ఎంతలా ఓడిస్తున్నాకూడా … ?

ఓటమి మనిషిలో నైతిక స్తైర్యాన్ని కృంగదీయాలి. అలాగే గొంతులోని బలాన్ని దిగలాగేయాలి. మాట సన్నగా అయిపోయి మౌనమే శరణ్యమన్న పరిస్థితి రావాలి. ఇది ఎంతటి వారి విషయంలో [more]

Update: 2021-06-13 13:30 GMT

ఓటమి మనిషిలో నైతిక స్తైర్యాన్ని కృంగదీయాలి. అలాగే గొంతులోని బలాన్ని దిగలాగేయాలి. మాట సన్నగా అయిపోయి మౌనమే శరణ్యమన్న పరిస్థితి రావాలి. ఇది ఎంతటి వారి విషయంలో అయినా కూడా సహజంగా జరిగే పరిణామం. అందుకే మాటలతో కాదు, ఓటమితో దెబ్బ కొట్టాలని రాజకీయ పార్టీలు అనుకుంటాయి. ఆ ఆ విధంగా చూస్తే తెలుగుదేశం పార్టీని వైసీపీ కొట్టిన దెబ్బలు అన్నీ ఇన్నీ కావు. వైసీపీ ఏకపక్ష విజయాలతో టీడీపీ ఈపాటికి నో సౌండ్ అన్నట్లుగా ఎక్కడో ఉండాలి. కానీ ఆ పార్టీ అంతకు మించి రెట్టించిన గొంతుతో రీ సౌండ్ చేస్తోంది. జగన్ మీద ఇంకా దూకుడుగా విరుచుకుపడుతోంది.

అర్ధం కానిదే :

జగన్ చేతిలో వరస ఓటములను తెలుగుదేశం ఎందుకు లైట్ తీసుకుంటోంది అన్నదే వైసీపీ నేతలకు అసలు అర్ధం కావడంలేదుట. నిజానికి 151 సీట్లతో వైసీపీ 2019 ఎన్నికల్లో బంపర్ విక్టరీ కొట్టినపుడే టీడీపీ పని అయిపోయింది అనుకున్నారు. కనీసం కొన్నాళ్ళు అయినా టీడీపీ సైలెంట్ అవుతుంది అని కూడా రాజకీయ మేధావులు సైతం అంచనా వేశారు. కానీ ఓడిన మరుక్షణం బెబ్బులి మాదిరిగా టీడీపీ జగన్ మీద విరుచుకుపడింది. అంతే కాదు అవి అసలు ఎన్నికలే కావు, ఈవీఎంల ట్యాంపరింగ్ తోనే విక్టరీ అనేశారు. లోకల్ బాడీ ఎన్నికలు పెడితే బ్యాలట్ పేపర్ మీద విజయం మాదే అన్నారు. అలాగే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టారు. వైసీపీయే బ్యాలట్ పేపర్ మీదా గెలిచింది.

అది కూడా సరిపోదా….?

లోకల్ బాడీ ఎన్నికలు అన్నీ కూడా తాము కోరుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ నాయకత్వంలోనే జరిగాయి. అయినా కూడా వైసీపీ ఎన్నికల దౌర్జన్యాలు అంటూ కొత్త వాదన తెచ్చి సరిగ్గా ఎన్నికలు జరగలేదని టీడీపీ నేతలు బండలు వేశారు. ఇక తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక జరిగింది. అయితే తిరుపతిలో దొంగ ఓట్లు పెద్ద ఎత్తున వేసుకున్నారు అన్నారు. మరి మిగిలిన ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫలితం కూడా వైసీపీకే అనుకూలంగా వచ్చింది. పైగా గతం కంటే మెజారిటీ దారుణంగా పెరిగింది. ఈ దెబ్బకు టీడీపీ మరో మూడేళ్ల పాటు సౌండ్ చేయకుండా ఉంటుంది అని వైసీపీ వేసుకున్న అంచనాలు కూడా తప్పేసాయి. తిరుపతి ఎన్నికలో ఘోర ఓటమి తరువాత కూడా టీడీపీ ఎక్కడా తగ్గడంలేదు, పైగా జగన్ని మరింతగా ఇరికించాలని చూస్తోంది.

ఏంటి ధైర్యం :

జగన్ విషయంలో తెలుగుదేశం ఇంత తేలిగ్గా తీసుకోవడానికి కారణం ఏంటి అన్నదే ఇపుడు చర్చ. ఎన్నిసార్లు ఓడించినా కూడా మాకు ఇదంతా మామూలే, మళ్లీ మాదే అధికారం అని టీడీపీ పెద్దలు ధీమాగా చెబుతున్నారు. ఈ ఎన్నికలు కాదు, సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గల్లంతు కావడం ఖాయమని ఇపుడు తాపీగా చెబుతున్నారు. అంటే జగన్ గెలుపులన్నీ కూడా ఒక్క మాటతో పక్కన పెట్టేస్తున్నారు అన్న మాట. దీనికి మరో కారణం కూడా ఉంది అంటున్నారు. జగన్ మీద సీబీఐ కేసులు ఉన్నాయి. పైగా ఏపీ ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉంది. భారీ ఎత్తున అప్పులతో ఖజానా వెక్కిరిస్తోంది. దీనికి తోడు కరోనా సెకండ్ వేవ్ తో ఎంతటి పాలకులకైనా కత్తి మీద సాములా వ్యవహారం ఉంది. ఇలా జగన్ గెలుపులను మింగేసే పరిణామాలు ఏపీలో బోలేడు ఉన్నాయి. బహుశా అవే టీడీపీకి ఎక్కడలేని ధైర్యాన్ని ఇస్తున్నాయి అనుకోవాలి. వీటికి మించి బలమైన అనుకూల మీడియా చేతిలో ఉండడం కూడా టీడీపీకి వరమే. జగన్ ఏం చేసినా రివర్స్ లో జనాలకు చేర్చేలా ఆ మీడియా మోతుబరులు చేస్తున్న కృషితో వైసీపీ శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరులా మారుతోంది. ఇక జగన్ తో మరో మూడేళ్ళు చెడుగుడు ఆడేందుకు రెడీ అంటూ టీడీపీ కవ్విస్తోంది. బహుశా 2024 ఎన్నికలే ఫైనల్స్ అనుకోవాలి. ఆ ఎన్నికల్లో కూడా టీడీపీని ఓడిస్తెనే తప్ప జగన్ విజయానికి సంపూర్ణత చేకూరదు అంటున్నారు.

Tags:    

Similar News