tdp : రివర్స్ లో వస్తేనే రికవరీ అవుతామా?
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్లాన్ మార్చింది. గత రెండున్నరేళ్లుగా పార్టీలో ఉన్న స్తబ్దతను తొలగించే ప్రయత్నం మొదలు పెట్టినట్లుంది. వైసీపీని రెచ్చగొట్టి లబ్ది పొందాలన్నది [more]
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్లాన్ మార్చింది. గత రెండున్నరేళ్లుగా పార్టీలో ఉన్న స్తబ్దతను తొలగించే ప్రయత్నం మొదలు పెట్టినట్లుంది. వైసీపీని రెచ్చగొట్టి లబ్ది పొందాలన్నది [more]
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్లాన్ మార్చింది. గత రెండున్నరేళ్లుగా పార్టీలో ఉన్న స్తబ్దతను తొలగించే ప్రయత్నం మొదలు పెట్టినట్లుంది. వైసీపీని రెచ్చగొట్టి లబ్ది పొందాలన్నది టీడీపీ ప్రయత్నంగా కన్పిస్తుంది. అందుకే అయ్యన్న పాత్రుడు వంటి నేతలు ముఖ్యమంత్రి పై అలాంటి వ్యాఖ్యలు చేశారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. రివర్స్ లో వెళితేనే పార్టీ తిరిగి పుంజుకుంటుందన్న ధోరణితోనే టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నట్లుంది.
జగన్ ను తిడితే…?
జగన్ ను తిడితే వైసీీపీ నేతలు ఊరుకోరు. ఈ విషయాన్ని టీడీపీ నేతలకు తెలియంది కాదు. అయితే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో పార్టీకి మైలేజీ అవసరం. సానుభూతి కావాలి. తటస్థ ఓటర్ల మద్దతును పొందాలి. తాము కోల్పోయిన సామాజికవర్గాలను తిరిగి తమ చెంతకు తెచ్చుకోవాలి. అప్పుడే వచ్చే ఎన్నికల్లో తమకు విజయం లభిస్తుందన్నది టీడీపీ సీనియర్ నేతల అంచనా. అందుకు జగన్ పై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారంటున్నారు.
రెండేళ్లలో రాని….
ఇప్పడు జోగి రమేష్ నిరసన కార్యక్రమాన్నే తీసుకుంటే ఈ రెండేళ్లలో రాని సానుభూతి టీడీపీ అధినేత చంద్రబాబుకు వచ్చినట్లు పార్టీ శ్రేణులు బహిరంగంగానే చెబుతున్నాయి. అందుకే అయ్యన్న పాత్రుడు ఆగడం లేదు. మరోసారి ఆయన దూషణకు దిగారు. తనను జైల్లో పెట్టినా పరవాలేదని, ఈ ప్రభుత్వం ఉండకూడదని అయ్యన్న పాత్రుడు అంటున్నారు. మరోసారి ఆయన వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టే చేసే ప్రయత్నం చేశారు.
టీడీపీ ట్రాప్ లో…
జగన్ పార్టీ నేతలు కూడా టీడీపీ ఆడుతున్న గేమ్ లో చిక్కుకుంటున్నారు. వారు రెచ్చగొడితే వీళ్లు రెచ్చిపోతున్నారు. టీడీపీకి ఇది కలసి వచ్చేటట్లే కన్పిస్తుంది. చంద్రబాబు జగన్ ను తిట్టినా పెద్దగా పట్టించుకోక పోవడంతో, ఇప్పుడు ఆ బాధ్యతను పార్టీ నేతలకు అప్పగించారు. మొత్తానికి వైసీపీ నేతలు టీడీపీ ట్రాప్ లో పడిపోయినట్లే కనిపిస్తుంది. చూసేవారికి వైసీపీ తప్పు బహిరంగంగా కనిపిస్తుండటంతో పసుపు పార్టీ యాక్షన్ ప్లాన్ సక్సెస్ అయినట్లే కన్పిస్తుంది.