Tdp : బద్వేలులో టీడీపీ ఓట్లు వారికేనట
బద్వేల్ ఉప ఎన్నిక అనివార్యమయింది. ప్రధాన పార్టీలు బరి నుంచి తప్పుకున్నా ఎన్నిక జరగాల్సి ఉంది. బలం లేని పార్టీలతో బలప్రదర్శన చేస్తుంది. సమఉజ్జీలు లేకపోవడంతో బద్వేలు [more]
బద్వేల్ ఉప ఎన్నిక అనివార్యమయింది. ప్రధాన పార్టీలు బరి నుంచి తప్పుకున్నా ఎన్నిక జరగాల్సి ఉంది. బలం లేని పార్టీలతో బలప్రదర్శన చేస్తుంది. సమఉజ్జీలు లేకపోవడంతో బద్వేలు [more]
బద్వేల్ ఉప ఎన్నిక అనివార్యమయింది. ప్రధాన పార్టీలు బరి నుంచి తప్పుకున్నా ఎన్నిక జరగాల్సి ఉంది. బలం లేని పార్టీలతో బలప్రదర్శన చేస్తుంది. సమఉజ్జీలు లేకపోవడంతో బద్వేలు ఉప ఎన్నికల్లో వైసీపీ విజయం సునాయాసమయింది. బద్వేలు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ లు పోటీ పడుతున్నాయి. వైసీపీ అభ్యర్థిగా దాసరి సుధ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కమలమ్మను ప్రకటించింది. ఇక్కడ రెండు ప్రధాన జాతీయ పార్టీలకూ ఓటు బ్యాంకు లేదు. దీంతో వైసీపీకి ఏకపక్ష విజయమే. అయితే ఇప్పుడు తెలుగుదేశం, జనసేన ఓటు బ్యాంకు ఎటువైపు మరలతాయన్నది ఆసక్తికరంగా మారింది.
రెండు తప్పుకోవడంతో….
తెలుగుదేశం పార్టీ, జనసేన బద్వేలు ఉప ఎన్నిక నుంచి తప్పుకున్నాయి. ఇక్కడ ఒక్క టీడీపీయే బలంగా ఉంది. బలమైన నేతలున్నారు. అయితే వైసీపీకి రికార్డు స్థాయి మెజారిటీ రాకుండా ఉండేందుకు ఈ పార్టీ ఓటు బ్యాంకు ఏ పార్టీవైపు తరలుతుందన్నది చర్చనీయాంశంగా మారింది. టీడీపీకి గత ఎన్నికల్లో దాదాపు యాభై వేలకు పైగానే ఓట్లు వచ్చాయి. వైసీపీ 44 వేల ఓట్ల మెజారిటీతో గత ఎన్నికల్లో గెలిచింది.
బీజేపీని దెబ్బతీయడానికి….
అయితే బద్వేలులో టీడీపీ ఓటు బ్యాంకు ఇప్పుడు బీజేపీకి టర్న్ అవుతుందా? లేక కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకత్తం లోపాయికారీగా ఈ ఎన్నికల్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. కొందరు నేతలు కాంగ్రెస్ కు మద్దతిస్తేనే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. బీజేపీని దెబ్బతీయడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నారు. ప్రధానంగా టీడీపీపై ఒంటికాలు మీద లేస్తున్న సోము వీర్రాజు నాయకత్వాన్ని కూడా ఈ ఎన్నిక ద్వారా ప్రశ్నించవచ్చని వారు భావిస్తున్నారు.
కాంగ్రెస్ కే సపోర్ట్ చేస్తారా?
కాంగ్రెస్ ఇక రాష్ట్రంలో ఎదిగే అవకాశం లేదు. ఆ పార్టీకి బద్వేలులో మద్దతిచ్చినా వచ్చే సాధారణ ఎన్నికల సమయానికి తిరిగి తమ ఓటు బ్యాంకు తమకు ఉంటుందన్న క్యాలిక్యులేషన్ లో ఉన్నారు. తమ క్యాడర్ కు త్వరలోనే ఏ పార్టీకి ఓటు వేయాలన్న దానిపై పరోక్షంగా స్థానిక నాయకత్వం సంకేతాలు పంపుతుందంటున్నారు. మొత్తం మీద టీడీపీ ఓటు బ్యాంకు బద్వేలు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు వెళుతుందన్న టాక్ కడప జిల్లా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.