Badvel : ఓ గాడ్… వైసీపీకి వెళ్లకుండా చూడవూ
బద్వేలు ఉప ఎన్నికకు ఇంకా వారం రోజులు సమయం ఉంది. ఈలోపు బద్వేలు టీడీపీ నేతలు ఎటువైపు మొగ్గు చూపుతారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అసలు పోటీ [more]
బద్వేలు ఉప ఎన్నికకు ఇంకా వారం రోజులు సమయం ఉంది. ఈలోపు బద్వేలు టీడీపీ నేతలు ఎటువైపు మొగ్గు చూపుతారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అసలు పోటీ [more]
బద్వేలు ఉప ఎన్నికకు ఇంకా వారం రోజులు సమయం ఉంది. ఈలోపు బద్వేలు టీడీపీ నేతలు ఎటువైపు మొగ్గు చూపుతారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అసలు పోటీ చేయకపోవడమే పెద్ద తప్పిదంగా స్థానిక టీడీపీ నేతలు భావిస్తున్నారు. మరో ఓటమిని ఖాతాలో వేసుకోలేక, ఖర్చును భరించలేకనే చంద్రబాబు ఎన్నికల నుంచి తప్పుకున్నారని తమ్ముళ్లు భావిస్తున్నారు. లేదంటే కనీసం పార్టీ జెండా ఎగిరేదని, ఈ నిర్ణయంతో కనీసం పదిహేను నుంచి ఇరవై శాతం ఓట్లు దూరమవుతాయని కూడా టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అభ్యర్థిని ప్రకటించి….
అసలు ఎవరు చెప్పమన్నారు పోటీ చేస్తామని. ముందుగా రాజశేఖర్ ను అభ్యర్థిగా ప్రకటించడంతో పార్టీ నేతలు ఏర్పాట్లు చేసుకున్నారు. రాజశేఖర్ మాత్రం తాను పైసా ఖర్చు పెట్టలేనని, పార్టీ భరిస్తే పోటీ చేయడానికి సిద్ధమని తెలిపారు. కనీసం నాలుగైదు కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. తిరుపతి ఉప ఎన్నికలకే దాదాపు ముప్ఫయికోట్ల రూపాయలకు పైగానే టీడీపీ ఖర్చు చేయాల్సి వచ్చింది. సీనియర్ నేతలు కూడా నిధుల కోసం చేతులు చాచడం కన్పించింది.
అన్ని జెండాలు రెప… రెప….
దీంతో పాటు పవన్ కల్యాణ్ జనసేన పోటీ చేయడం లేదని ప్రకటించారు. దీంతో ఏకగ్రీవమవుతుందని చంద్రబాబు భావించారు. కానీ బీజేపీ, జనసేన బరిలో ఉండటంతో బద్వేలులో ఇప్పుడు ఎన్నికల వాతావరణం నెలకొంది. నియోజకవర్గం అంతటా వైసీపీ జెండాలు ఎగురుతున్నాయి. బీజేపీ, జనసేన కాంగ్రెస్ పార్టీ జెండాలు కూడా కన్పిస్తున్నాయి. కానీ ఎటొచ్చీ టీడీపీ జెండాలే అస్సలు కన్పించకుండా పోయాయి. పార్టీ స్థానిక నేతలు దీనిని తప్పుపడుతున్నారు.
వైసీపీకి టర్న్ కాకుంటే చాలట…..
ఇప్పుడు టీడీపీ అటు నేరుగా బీజేపీికి మద్దతివ్వలేదు. కాంగ్రెస్ కు లోపాయికారిగా సహకరించలేదు. ఒకసారి ఓట‌్లు టర్న్ అయ్యాయంటే తిరిగి తెచ్చుకోవడం కష్టమే. అందుకే నియోజకవర్గ మంతా పండగ వాతావరణం ఉన్నా టీడీపీ నేతల మొహాల్లో నవ్వులు లేవు. చంద్రబాబు ఎన్నికల నుంచి తప్పుకుని పొరపాటు చేశారంటున్నారు. టీడీపీ ఓటు బ్యాంకు ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ చీల్చుకుంటే పరవాలేదు. వైసీపీకి మళ్ల కూడదనే లోకల్ టీడీపీ లీడర్లు వేయి దేవుళ్లకు ప్రార్థనలు చేస్తున్నారు.