టీడీపీ టిక్కెట్ల కోసం ఇంత డిమాండా ?
ఏపీలోని కీలక జిల్లా అయిన గుంటూరు జిల్లాలో విపక్ష టీడీపీలో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కోసం ఇప్పటి నుంచే ఫుల్ డిమాండ్ ఏర్పడింది. పలు కీలక స్థానాలపై [more]
ఏపీలోని కీలక జిల్లా అయిన గుంటూరు జిల్లాలో విపక్ష టీడీపీలో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కోసం ఇప్పటి నుంచే ఫుల్ డిమాండ్ ఏర్పడింది. పలు కీలక స్థానాలపై [more]
ఏపీలోని కీలక జిల్లా అయిన గుంటూరు జిల్లాలో విపక్ష టీడీపీలో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కోసం ఇప్పటి నుంచే ఫుల్ డిమాండ్ ఏర్పడింది. పలు కీలక స్థానాలపై కీలక నేతలు గురిపెట్టి చాపకింద నీరులా ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సత్తెనపల్లి సీటు కోసం ఇద్దరు రాజకీయ యోధుల వారసులు పోటీలో ఉన్నారు. సీనియర్ పార్లమెంటేరియన్ రాయపాటి సాంబశివరావు తనయుడు రాయపాటి రంగారావుతో పాటు మాజీ మంత్రి, ఏపీ తొలి స్పీకర్ అయిన దివంగత కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరాం ఇద్దరూ పట్టుదలతో ఉన్నారు. ఇద్దరూ బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన నేతలు కావడంతో ఈ సీటు ఎవరికి వస్తుందా ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. పార్టీ అధినేత చంద్రబాబు సైతం వీరి మధ్య సయోధ్య వచ్చే వరకు ఈ సీటు ఇన్‌చార్జ్ పగ్గాలు ఎవ్వరికి అప్పగించేందుకు ఇష్టపడడం లేదు.
పశ్చిమ నియోజకవర్గానికి….
పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీథర్ వచ్చే ఎన్నికల్లో అక్క నుంచి పోటీ చేసేందుకు ఇష్టడడం లేదని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మీదే ఆయన మనసంతా ఉంది. ఇక మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ సైతం గుంటూరు పశ్చిమం మీదే కన్నేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ – జనసేన పొత్తు ఉంటుందని టీడీపీ వర్గాల మధ్య నడుస్తోన్న చర్చల నేపథ్యంలో తెనాలిలో జనసేన నుంచి మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పోటీలో ఉంటే అప్పుడు రాజా పశ్చిమం లేదా సత్తెనపల్లి నుంచి రేసులో ఉంటారని మరో ప్రచారం జరుగుతోంది.
ఈ రెండు చోట్ల ఎక్కడైనా?
ఇక అమరావతి జేఏసీలో కీలక నేతగా ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అందరిని తనవైపునకు తిప్పుకున్న ప్రొఫెసర్ కొలికపూడి శ్రీనివాసరావు తాడికొండ మీద కన్నేశారు. ఆయన వచ్చే ఎన్నికల్లో తనకు తాడికొండ టీడీపీ టిక్కెట్ ఇస్తే.. అక్కడ నుంచి పోటీ చేస్తానని చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది. మంగళగిరిలో లోకేష్ పోటీ చేయని పక్షంలో అక్కడ పోటీ చేసేందుకు బీసీ నేతలు పట్టుబడుతున్నారు.
లోక్ సభ స్థానాలకు కూడా…
బాపట్ల లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ నుంచి వర్ల రామయ్య పేరుతో పాటు కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, శలగల రాజశేఖర్ ( మాజీ ఎంపీ శలగల బెంజిమన్ తనయుడు) పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇక్కడ మాజీ ఎంపీ మాల్యాద్రికి వచ్చే ఎన్నికల్లో ఛాన్సులు లేవు. ఇక నరసారావుపేట పార్లమెంటు స్థానం నుంచి ఆ ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ఇక నరసారావుపేట లోక్‌సభ సీటుకే రాయపాటి వారసురాలు శైలజ పేరు కూడా వినిపిస్తోంది. మాచర్ల స్థానం కోసం రెడ్డి వర్గం నేతలతో పాటు బీసీ నేతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి వీరిలో ఎవరి ప్రయత్నాలు ఫలిస్తాయో ? చూడాలి.