ఇరవై ఏళ్ల నుంచి ఇక్కడ లీడర్ సెట్ కాలేదా?
ఏపీలో తెలుగుదేశం పార్టీ ఇరవై ఏళ్లుగా గెలవని నియోజకవర్గాలు 20 + ఉన్నాయి. 1999 ఎన్నికల నుంచి చూస్తే చంద్రబాబు సైతం ఇక్కడ మనం గెలవలేం… ఇక్కడ [more]
ఏపీలో తెలుగుదేశం పార్టీ ఇరవై ఏళ్లుగా గెలవని నియోజకవర్గాలు 20 + ఉన్నాయి. 1999 ఎన్నికల నుంచి చూస్తే చంద్రబాబు సైతం ఇక్కడ మనం గెలవలేం… ఇక్కడ [more]
ఏపీలో తెలుగుదేశం పార్టీ ఇరవై ఏళ్లుగా గెలవని నియోజకవర్గాలు 20 + ఉన్నాయి. 1999 ఎన్నికల నుంచి చూస్తే చంద్రబాబు సైతం ఇక్కడ మనం గెలవలేం… ఇక్కడ ఆశలు వదిలేసుకుందాం ? అని ముందుగానే డిసైడ్ అయిపోతారేమో ? ఇరవై ఏళ్లలో ఒక్కటంటే ఒక్కసారి కూడా ఇక్కడ టీడీపీ జెండా ఎగరలేదు. ఓ నాయకుడి అసమర్థతకు ఇది నిదర్శనమే.. ! ఇరవై ఏళ్లలో ఒక్కసారి కూడా ఆ నియోజకవర్గంలో గెలిచే సత్తా ఉన్న నేతను సెట్ చేయలేకపోవడం పార్టీ అధినేతగా ఎవరికి అయినా అవమానమే ? ఇక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కేంద్రమైన కడప ఎంపీ సీటును టీడీపీ ఒకేఒకసారి గెలుచుకుంది. అది కూడా 1984 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రమే.. ! ఎన్టీఆర్ పార్టీ పెట్టాక జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన డీఎన్. రెడ్డి 54 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అప్పటి నుంచి ఒక్కటంటే ఒక్కసారి కూడా ఈ పార్లమెంటు సీటుపై పసుపు జెండా ఎగరలేదు. 1984 తర్వాత కడప పార్లమెంటు సీటు అనేది వైఎస్ ఫ్యామిలీ అడ్డాగా మారిపోయింది.
1989 నుంచి వైఎస్ ఫ్యామిలీ….
1989 నుంచి 1998 వరకు వరుసగా నాలుగు ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైఎస్. రాజశేఖర్ రెడ్డి ఎంపీగా విజయం సాధించారు. ఒక్క 1996లో మాత్రమే ఆయనకు టీడీపీ నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఆ ఎన్నికల్లో వైఎస్ కందుల రాజమోహన్ రెడ్డిపై 5 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆ తర్వాత 1999, 2004 ఎన్నికల్లో వరుసగా వైఎస్ సోదరుడు వివేకా నందరెడ్డి విజయం సాధించారు. 1999లో కూడా వివేకా పులివెందుల మెజార్టీ సాయంతో 25 వేలతోనే గట్టెక్కారు. 2009లో తొలిసారి ఇక్కడ నుంచి జగన్ ఎంపీగా గెలిచారు. 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన జగన్ ఆ తర్వాత వైసీపీలోకి వచ్చి 2011 ఉప ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో గెలిచారు.
ఈ పార్లమెంటు పరిధిలో…..
ఇక 2014, 2019 ఎన్నికల్లో జగన్ కజిన్ వైఎస్. అవినాష్ రెడ్డి వరుస విజయాలు సాధించారు. 1984 తర్వాత కడప ఎంపీ సీటు కాంగ్రెస్ అయినా, వైసీపీ అయినా కూడా వైఎస్ ఫ్యామిలీ దాటి బయటకు పోలేదు. ఇక ఇప్పుడు కాదు.. చంద్రబాబు జీవిత కాలంలో అయినా కడప గడపపై పసుపు పార్టీ జెండా ఎగర వేస్తారా ? అంటే సందేహంగానే ఉంది. ఏపీలోనే పార్టీ పరిస్థితి ఘోరంగా ఉంది. ఇక జగన్ కంచుకోటలో టీడీపీని గెలిపిస్తారని ఆశించడం కూడా అత్యాశే అయ్యేలా ఉంది. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో ఒక్కటంటే ఒక్కచోట కూడా టీడీపీకి భవిష్యత్ కనిపించడం లేదు.
రెండింటిలో నాయకత్వం ఉన్నా….
కడప పార్లమెంట్ పరిధిలో బద్వేల్, కడప, ప్రోద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురం నియోజకవర్గాలు ఉన్నాయి. గత రెండు ఎన్నికల్లో ఈ ఏడు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ గెలవ లేదు. ఇవన్నీ కూడా వైసీపీకి కంచుకోటలుగా ఉన్నాయి. జమ్మలమడుగుల, పులివెందులలో టీడీపీ గురించి మాట్లాడుకోవడం వేస్ట్. ఉన్నంతలో ఒక్క కమలాపురంలో పార్టీ స్ట్రాంగ్‌గా ఉన్నా అక్కడ నాయకత్వ కొరత ఉంది. మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్ బలమైన నేతే అయినా ఆయనకు కొన్ని వర్గాలు కలిసి రావడం లేదు… పైగా ఆయన్ను మార్చేయాలన్న డిమాండ్లు ఉన్నాయి.
ఏ ఒక్క చోట కూడా…?
బద్వేల్లో త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది. అక్కడ టీడీపీ తరపున బలమైన పోటీ ఇచ్చే నేత కూడా లేని పరిస్థితి. ప్రొద్దుటూరులో మాత్రం ఉక్కు ప్రవీణ్ రెడ్డి వచ్చాక పార్టీ కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. కడపలోనూ పార్టీకి సరైన నాయకులు లేరు. 2004లో కమలాపురం, 2009లో ప్రొద్దుటూరులో గెలిచిన టీడీపీ… 2014, 2019లో ఒక్కసీటు కూడా గెలవలేదు. ఇలాంటి చోట పార్టీని బాబు ఏ తీరాలకు నడిపిస్తారో ?