పదిహేనేళ్ల పాటు ఇక్కడ కష్టమేనట
ఏపీ రాజధాని కేంద్రంగా ఉన్న కృష్ణా జిల్లాలో టీడీపీ పరిస్థితి ఏంటి ? తాజా పరిణామాలు ఎలా ఉన్నాయి ? గత ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న పార్టీ [more]
ఏపీ రాజధాని కేంద్రంగా ఉన్న కృష్ణా జిల్లాలో టీడీపీ పరిస్థితి ఏంటి ? తాజా పరిణామాలు ఎలా ఉన్నాయి ? గత ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న పార్టీ [more]
ఏపీ రాజధాని కేంద్రంగా ఉన్న కృష్ణా జిల్లాలో టీడీపీ పరిస్థితి ఏంటి ? తాజా పరిణామాలు ఎలా ఉన్నాయి ? గత ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న పార్టీ కనీసం వచ్చే ఎన్నికల నాటికి అయినా పార్టీ పుంజుకుంటుందా ? అనేది ఆసక్తిగా మారింది. ఎక్కడికక్కడ నాయకులు సైలెంట్‌గా ఉండడం వేరు. వారికి సొంత పార్టీపై ఉన్న అసంతృప్తులు.. లేదా.. అభిప్రాయ భేదాలు.. ఇతరత్రా సమస్యలు ఉంటే.. అవి ఎప్పటికైనా.. పరిష్కారం అవుతాయి. ప్రజల్లో మార్కులు వేయించుకునేందుకు అవకాశం కూడా ఉంటుంది. కానీ, ఇప్పుడు ఇలాంటి పరిస్థితి కన్నా.. 'సైలెంట్ చేయిస్తున్న' పరిస్థితి కనిపిస్తుండడం గమనార్హం.
వ్యూహాత్మకంగా…?
అంటే.. జిల్లాలో పట్టు పెంచుకునేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. టీడీపీలో కీలకంగా ఉన్న నేతలను అదుపు చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటోంది. వాస్తవానికి ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ.. అప్పటికప్పుడు.. ఏదో రాజకీయాలు చేసేయడం సహజమే. కానీ, వచ్చే 10 – 15 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని రాజకీయాలు చేయడం చాలా భిన్నంగా ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీ కనుక ఇదే అజెండాను ఎంచుకుంటే.. ప్రత్యర్థి పార్టీలు ఎలా దూకుడుగా ముందుకు సాగాలి ? అనేది అత్యంత కీలకం.
వ్యక్తిగత విభేదాలే…?
జిల్లాలో టీడీపీ పరిస్థితిని చూస్తే.. విజయవాడలో పార్టీ వ్యక్తిగత వివాదాలు, నేతల మధ్య ఆధిపత్య రాజకీయాలు కొంపముంచాయి. ఇంకా ముంచుతూనే ఉన్నాయి. ఎంపీ కేశినేని నాని, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా, బొండా ఉమాలు ఎవరికి వారే రాజకీయాలు నడుపుతున్నారు. వీరిలో ఎవరికి ఎవరితోనూ పడేలా లేదు. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్‌ను కూడా బొండా, బుద్ధా వ్యతిరేకిస్తున్నారు. ఇక, మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో నేతలు మౌనంగా ఉన్నారు. గతంలో ఉన్న కేసులు ఇప్పుడు తిరగదోడతారేమోనని.. నేతలు భయపడుతున్నారు.
ఎవరూ బయటకు రాక….
దీంతో టీడీపీ శ్రేణులు ఎవరూ బయటకు రావడం లేదు. ఇప్పటికే మాజీ మంత్రి దేవినేని ఉమాపై కేసులు పెట్టారు. అదే సమయంలో నేతలకు వాయిస్ లేకుండా.. గత కేసులు తిరగదోడుతున్నారనే సంకేతాలు ఇస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ నేతలు.. మౌనంగా ఉంటున్నారు. మరి ఈ పరిణామం నుంచి పార్టీని బయటకు లాగి.. బతికించుకుంటేనే టీడీపీ కంచుకోటలో జెండా ఎగురుతుందని.. సైకిల్ తిరుగుతుందని… లేకపోతే దశాబ్దాల కంచుకోట కూలిపోయే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.