అక్కడ టీడీపీ అలా అయిపోయిందేంటి… ?
విశాఖ జిల్లాలో మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయంగా చాలా ప్రాముఖ్యత కలిగినది అందే చెప్పాలి. స్వాతంత్ర సమరయోధుడు, దిగ్గజ నేత తెన్నేటి విశ్వనాధం లాంటి వారిని ఎమ్మెల్యేగా [more]
విశాఖ జిల్లాలో మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయంగా చాలా ప్రాముఖ్యత కలిగినది అందే చెప్పాలి. స్వాతంత్ర సమరయోధుడు, దిగ్గజ నేత తెన్నేటి విశ్వనాధం లాంటి వారిని ఎమ్మెల్యేగా [more]
విశాఖ జిల్లాలో మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయంగా చాలా ప్రాముఖ్యత కలిగినది అందే చెప్పాలి. స్వాతంత్ర సమరయోధుడు, దిగ్గజ నేత తెన్నేటి విశ్వనాధం లాంటి వారిని ఎమ్మెల్యేగా గెలిపించి పంపిన చరిత్ర మాడుగులది. మాడుగుల నుంచి గెలిచి మంత్రి పదవులు చేపట్టిన వారున్నారు. ఇక మొదటి నుంచి ప్రతిపక్ష రాజకీయానికి పెట్టింది పేరు అయిన మాడుగుల 1983లో తెలుగుదేశం ఆవిర్భావంతోనే ఆ పార్టీని నెత్తిన పెట్టుకుంది. 2004 ఎన్నికల దాకా టీడీపీ తప్ప మరో ఊసు లేదు. అంటే టీడీపీకి కంచుకోట అనే చెప్పాలి.
సైకిల్ చిత్తేనా….?
మాడుగులలో టీడీపీకి విపరీతమైన ఆదరణ ఉంటూ వచ్చింది. 1983 నుంచి 1999 దాకా 21 ఏళ్ల పాటు రెడ్డి సత్యనారాయణ ఏకచత్రాధిపత్యంగా గెలిచారు. ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. టీడీపీని ఫస్ట్ టైమ్ 2004లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన కరణం ధర్మశ్రీ ఓడించారు. ఆ తరువాత 2009 ఎన్నికలలో మళ్ళీ టీడీపీ తరఫున గవిరెడ్డి రామానాయుడు గెలిచారు. కానీ 2014 నుంచి ఇప్పటికి రెండు సార్లు వైసీపీ తరఫున బూడి ముత్యాల నాయుడే గెలుస్తూ వస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో మరో మారు గెలిచేందుకు ఆయన అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. మరో వైపు చూస్తే రెండు ఎన్నికలలో వరస ఓటమితో టీడీపీలో పూర్తి నైరాశ్యం కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు గ్రిప్ అన్నది పార్టీ మీద పూర్తిగా పోయింది అంటున్నారు.
వర్గ పోరు తీవ్రం …
టీడీపీలో వర్గ పోరు ఎక్కువగా ఉంది. గవిరెడ్డి పార్టీ జనాలకు అందుబాటులో ఉండడంలేదు. ఆయన వన్ టైమ్ ఎమ్మెల్యేగానే మిగిలిపోయారు. చంద్రబాబు ఆయనకు మరో రెండు సార్లు అవకాశం ఇచ్చినా కూడా గెలవలేకపోయారు. దీంతో వచ్చే ఎన్నికల్లో తమకు చాన్స్ ఇస్తారని పైలా ప్రసాదరావుతో పాటు పీవీజీ కుమార్ అనే ఇద్దరు నేతలు ఎవరి మటుకు వారు గట్టిగా ట్రై చేసుకుంటున్నారు. చిత్రమేంటి అంటే ఈ ఇద్దరు నాయకులకూ నియోజకవర్గం మొత్తం మీద బలం లేదు. మాజీ ఎమ్మెల్యే అయిన గవిరెడ్డి అయితే పార్టీ కమిటీలు కూడా వేసి టీడీపీని బలోపేతం చేయలేని స్థితిలో ఉన్నారు. దాంతో ఒక్క మాటలో చెప్పాలంటే మాడుగులలో టీడీపీకి సరైన లీడర్ లేరనే అనాలి.
అదే బలంగా…?
వైసీపీకి అదే బలంగా మారుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. అంతే కాదు సంక్షేమ కార్యక్రమాలు జనాలకు చేరువ అవుతున్నాయి. ఇక ఆయన మొత్తం మాడుగుల మీద పట్టు సాధించారు. విపక్షమే వీక్ గా ఉండడమే ఆయనకు వరంగా మారుతోంది. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనకు జగన్ టికెట్ ఇస్తారని అంటున్నారు. గవిరెడ్డి పోటీకి వచ్చినా కొత్త వారు ఎదురొచ్చినా టీడీపీలోనే ఐక్యత లేదు కాబట్టి ఓడుతుందా అన్నదే ప్రశ్నగా ఉంది. మొత్తం మీద చూస్తూంటే వైసీపీ వచ్చే ఎన్నికలో కచ్చితంగా గెలిచే సీటుగా మాడుగులను ఖాతాలో వేసుకోవచ్చు అంటున్నారు.