Tdp : ఉన్న ఆ నలుగురు లగేజీ సర్దేస్తున్నారా?
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా పడకేసింది. ఎల్. రమణ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఇక ఇక్కడ పార్టీ కార్యక్రమాలు లేకుండా పోయాయి. తెలంగాణ [more]
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా పడకేసింది. ఎల్. రమణ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఇక ఇక్కడ పార్టీ కార్యక్రమాలు లేకుండా పోయాయి. తెలంగాణ [more]
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా పడకేసింది. ఎల్. రమణ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఇక ఇక్కడ పార్టీ కార్యక్రమాలు లేకుండా పోయాయి. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడుగా బక్కని నరసింహులును చంద్రబాబు నియమించారు. ఈ నియామకం జరిగి దాదాపు నాలుగు నెలలు దాటి పోయింది. అయినా ఇప్పటి వరకూ తెలంగాణ టీడీపీ ఎటువంటి కార్యక్రమాలను చేపట్టడం లేదు. కనీసం పార్టీ కార్యాలయంలో కార్యవర్గ సమావేశాలు కూడా జరగడం లేదు.
ఈ కారణాలతో…
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మళ్ల ీ జవసత్వాలు తేవాలని చంద్రబాబు అనుకున్నారు. అయితే నేతలందరూ వరస పెట్టి పార్టీని వీడుతుండటంతో ఆయనలో కూడా పునరాలోచనలో పడ్డారు. అసలు పార్టీని ఇక్కడ మూసేస్తే బాగుంటుందన్న ఆలోచనకు ఒక దశలో వచ్చారు. కానీ జాతీయ పార్టీ అని చెప్పుకోవాల్సి రావడం, హైదరాబాద్ నడిగడ్డ మీద ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉండటం వంటి కారణాలతో ఆయన ఇష్టం లేకున్నా పార్టీని కొనసాగిస్తున్నారు.
రెండు జిల్లాల్లోనే….
ప్రస్తుతం తెలంగాణ టీడీపీలో చెప్పుకోదగ్గ నేతలు ఎవరూ లేరు. మహబూబ్ నగర్ జిల్లా, ఖమ్మం జిల్లాలోనే కొద్దో గొప్పో క్యాడర్, నేతలు ఆ పార్టీకి ఉన్నారు. వీరు కూడా ఇప్పుడు దిక్కులు చూస్తున్నట్లుంది. మహబూబ్ నగర్ జిల్లాలో కొత్త కోట దయాకర్ రెడ్డి, సీతా దయాకర్ రెడ్డిలు సయితం కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలిసింది. కొత్త కోట దయాకర్ రెడ్డి సీనియర్ నేతగా పార్టీలో నేటికీ కొనసాగుతుండటం విశేషం.
కాంగ్రెస్ లోకి…
అయితే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక ఆయన కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగుదేశం పార్టీకి భవిష‌్యత్ లేదని భావించిన మరికొందరు ఖమ్మం జిల్లా నేతలు సయితం అధికార పార్టీలో చేరేందుకు రెడీ అయిపోయారు. చంద్రబాబు పూర్తిగా ఏపీ రాజకీయాల్లోనే మునిగిపోవడంతో ఇక్కడ పార్టీని పట్టించుకోవడం లేదు. ఆర్థికంగా కూడా ఇబ్బందిగా మారడంతో ఈ పార్టీ ఇక్కడ ఉన్నా లేనట్లేనని చెప్పుకోవాల్సిందే.