కుర్ర కుమారాలు వికసించేది ఉందా… ?

టీడీపీలో సీనియర్లకు చెక్ అంటున్నారు. దాంతో వారసులను ముందుకు తెస్తున్నారు. అయితే వీరిలో ఎందరు తండ్రులకు ధీటుగా నిలబడతారు అన్నదే చర్చగా ఉంది. తండ్రులు ఢక్కామెుక్కీలు తిన్న [more]

Update: 2021-08-11 13:30 GMT

టీడీపీలో సీనియర్లకు చెక్ అంటున్నారు. దాంతో వారసులను ముందుకు తెస్తున్నారు. అయితే వీరిలో ఎందరు తండ్రులకు ధీటుగా నిలబడతారు అన్నదే చర్చగా ఉంది. తండ్రులు ఢక్కామెుక్కీలు తిన్న వారు. విశేష అనుభవం ఉన్న వారు. కుమారులు అలా కాదు ఆవేశం పాలు ఎక్కువ, అనుభవం తక్కువ. ఇక ఎలా చూసినా అలవి కాని దూకుడుతో ఉంటారు. దాంతో పార్టీకి డ్యామేజ్ యమ జోరుగా సాగుతుంది. వారు అలవాట్లు, వైఖరుల మూలంగా కూడా పార్టీ త‌రచూ ఇబ్బందులలో పడుతుంది. దీంతో టీడీపీ పెద్దలు జూనియర్ల విషయంలో ఆచీ తూచీ వ్యవహరిస్తున్నారు అన్న మాట ఉంది.

ముందే అలా …

విశాఖ జిల్లా టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ రాజకీయాల్లో వార్డు మెంబర్ గా కూడా ఈ రోజుకీ గెలవలేదు. ఛాన్స్ ఇస్తే గెలిచొస్తా అంటారు కానీ ఆ రిస్క్ కి బాబు 2019 ఎన్నికల్లోనే రెడీ అవలేదు. ఇక విజయ్ వ్యాపారాలు చేస్తారు. ఆయన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలు వ్యాపారాలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా బినామీలతో కలసి విశాఖ ఏజెన్సీలో లేటరైట్ గనుల తవ్వకాల‌లో ఆయన ఉన్నారని చెబుతారు. అంటే రాజకీయాల్లోకి రాక ముందే ఆరోపణలు అన్న మాట. ఇందులో నిజం ఉందో నింద ఉందో అనవసరం కానీ ప్రత్యర్ధులు విమర్శించడానికి మాత్రం దొరికిపోతున్నారు అంటున్నారు.

ఈయన అంతేనా ..?

ఇక పెందుర్తికి చెందిన టీడీపీ మరో సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి తనయుడు అప్పలనాయుడు రాష్ డ్రైవింగ్ తో ఆ మధ్యన పోలీస్ కేసులకెక్కారు. ఆయన మద్యం మత్తులో అలా చేసారని వార్తలు వచ్చాయి. ఇక తండ్రి అధికారంలో ఉన్నపుడు డిఫ్యాక్టో ఎమ్మెల్యేగా అప్పలనాయుడు పెత్తనం చలాయించారని చెబుతారు. పెందుర్తిలో భూ కబ్జాల భాగోతాల వెనక ఆయన పేరుని కూడా విపక్షాలు ఇప్పటికీ గట్టిగా చెబుతాయి. మరి బండారు అప్పలనాయుడిని రేపటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిని చేస్తే కోరి వైసీపీకి చాన్స్ ఇచ్చినట్లేనా అన్న చర్చ అయితే టీడీపీలో ఉందిట.

లాగగలరా..?

వీరితో పాటుగా ఏజెన్సీలోని అరకు ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున 2019 ఎన్నికల్లో ఫస్ట్ టైమ్ పోటీ చేసి ఓడిన కిడారి శ్రావణ్ టీడీపీకి అవసరార్ధం దొరికిన తమ్ముడు. ఆయన తండ్రి కిడారి సర్వేశ్వరరావు రాజకీయ జీవితమంతా కాంగ్రెస్ తోనే సాగింది. ఇక ఆయన్ని మావోలు హత్య చేయడంతో చంద్రబాబు సానుభూతి కోసం తెలివిగా శ్రావణ్ కి మంత్రి పదవి ఇచ్చారు. మంత్రిగా ఉన్నపుడే శ్రావణ్ భోగాపురంలోని రిసోర్ట్స్ లో ఒక యువతితో దొరికారు అన్న ప్రచారం కూడా ఉంది. ఆయన ఇపుడు టీడీపీలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అంటున్నారు. కానీ రాజకీయంగా ఆయన జోరు చూపించగలరా అన్నదే పార్టీ నేతలకు కలుగుతున్న డౌట్. వీరే కాదు, చాలా మంది వారసులు ఉన్నారు. వారంతా కేరాఫ్ ఫాదర్స్ మాత్రమే. ఇక వారిని ముందు పెట్టి కీలకమైన 2024 ఎన్నికల్లో పోటీకి దిగితే పార్టీకి ఎంత వరకూ ప్లస్ అవుతారు అన్నది అధినాయకత్వానికి అసలు అర్ధం కావడంలేదుట.

Tags:    

Similar News