అక్కడ కొత్త స్ట్రాటజీతో టీడీపీ… ?

ఫార్టీ ఇయర్స్ పార్టీకి పుట్టెడు వ్యూహాలు ఉంటాయి. పైగా ఫార్టీ ఇయర్స్ అనుభవం ఉన్న చంద్రబాబు అధినాయకుడుగా ఉన్నారు. దాంతో పోయిన చోటనే వెతుక్కోవాలని టీడీపీ నడుం [more]

Update: 2021-08-14 13:30 GMT

ఫార్టీ ఇయర్స్ పార్టీకి పుట్టెడు వ్యూహాలు ఉంటాయి. పైగా ఫార్టీ ఇయర్స్ అనుభవం ఉన్న చంద్రబాబు అధినాయకుడుగా ఉన్నారు. దాంతో పోయిన చోటనే వెతుక్కోవాలని టీడీపీ నడుం బిగించింది. విశాఖ జిల్లాలో టీడీపీ పరిస్థితి దారుణంగానే ఉంది. గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలలో ఒకే ఒక్కడుగా తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు గొంతు వినిపిస్తున్నారు. దాంతో మిగిలిన చోట్ల పార్టీ వాయిస్ పెంచాలని, టీడీపీ బలాన్ని గట్టిగా చాటాలని అధినాయకత్వం డిసైడ్ అయింది. తాజాగా భిమిలీలో ఇంచార్జి నియమించిన ఆ పార్టీ ఇపుడు విశాఖ సౌత్ మీద దృష్టిని పెట్టింది.

వాళ్ళే టార్గెట్….

విశాఖ సౌత్ లో మత్య్సకారులు, బ్రాహ్మణులు, ముస్లిమ్ మైనారిటీలు ఎక్కువగా ఉంటారు. మైనారిటీలకు టికెట్ ఇవ్వాలి అంటే ఇంతకంటే మంచి సీటు లేదు. గతంలో టీడీపీ అలా మాజీ ఎమ్మెల్యే రహమాన్ కి టికెట్ ఇచ్చి గెలిచింది. ఆ తరువాత మత్య్సకారులకు పెద్ద పీట వేస్తూ వచ్చింది. అయితే సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలోకి ఫిరాయించడంతో అక్కడ టీడీపీకి నాధుడు లేకుండా పోయాడు. దాంతో ఈసారి మైనారిటీలను టీడీపీ టార్గెట్ చేస్తోంది. వారికి టికెట్ ఇవ్వడం ద్వారా సౌత్ లో జెండా ఎగరేయాలని ఆలోచిస్తోంది.

ఆయనకు ఛాన్స్…

రెండు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీని అట్టిపెట్టుకుని ఉన్న మహమ్మద్ నజీర్ ని ఇంచార్జిగా నియమిస్తారు అన్న ప్రచారం ఉంది. ఆయన‌ తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగంలో చురుకుగా పనిచేస్తున్నారు. విశాఖ సౌత్ లో గట్టి నేతగా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకు ధీటుగా అక్కడ పార్టీని నడిపిస్తున్నారు. ఇక ఆయన చంద్రబాబుకు కూడా సన్నిహితుడిగా ఉంటున్నారు. దాంతో ఆయనకు ఇంచార్జి పదవిని కట్టబెట్టి వచ్చే ఎన్నికల నాటికి అభ్యర్ధిగా ప్రకటించాలని ప్లాన్ ఉందిట.

తట్టుకుంటారా …?

అయితే ఇక్కడ వాసుపల్లి బాగా పాతుకుపోయారు. ఆయన వైసీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే తట్టుకునే సామర్ధ్యం నజీర్ కి ఉందా అన్నది ఒక చర్చ. అయితే 2024 నాటికి సౌత్ నుంచి ముస్లిం అభ్యర్ధి ఎమ్మెల్యే అయి మూడు దశాబ్దాలు అవుతుంది. అందువల్ల వారికి ఈ తడవ టికెట్ ఇస్తే అంతా ఏకమై గెలిపించుకుని వస్తారని టీడీపీ అంచనా వేస్తోంది. పైగా టీడీపీ ట్రెడిషనల్ ఓటు బ్యాంక్ కూడా చెక్కుచెదరలేదని భావిస్తోంది. మొత్తానికి వైసీపీ మైనారిటీలకు టికెట్ ఇస్తుంది అనుకుంటే టీడీపీ ఆ ప్రయోగం ఇక్కడ చేస్తోంది. దాంతో పసుపు పార్టీకి వచ్చే ఎన్నికల్లో రాజకీయ లాభమేనా అన్నది చూడాలి.

Tags:    

Similar News