అక్కడ కూడా టీడీపీకి క్యాండెట్ లేడే ?
గత ఎన్నికల తర్వాత ఏపీలో టీడీపీ కంచుకోటలు కూలిపోతున్నాయి. చివరకు ఆ పార్టీకి ఓ నాయకుడు కూడా లేని దుస్థితి చాలా చోట్ల ఉంది. ఏపీ మొత్తం [more]
గత ఎన్నికల తర్వాత ఏపీలో టీడీపీ కంచుకోటలు కూలిపోతున్నాయి. చివరకు ఆ పార్టీకి ఓ నాయకుడు కూడా లేని దుస్థితి చాలా చోట్ల ఉంది. ఏపీ మొత్తం [more]
గత ఎన్నికల తర్వాత ఏపీలో టీడీపీ కంచుకోటలు కూలిపోతున్నాయి. చివరకు ఆ పార్టీకి ఓ నాయకుడు కూడా లేని దుస్థితి చాలా చోట్ల ఉంది. ఏపీ మొత్తం మీద దాదాపుగా 25 నియోజకవర్గాల్లో టీడీపీకి సరైన నేతలు లేరు. కొందరు సీనియర్లు యాక్టివ్‌గా లేకపోవడం, కొన్ని చోట్ల గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారిపోవడం, ఓడిపోయిన ఇన్‌చార్జ్‌లు వైసీపీలోకి వెళ్లిపోవడమో లేదా పార్టీకి రాజీనామా చేయడమో జరిగింది. ఈ లిస్టులోనే విశాఖ జిల్లాలోని యలమంచిలి నియోజకవర్గం కూడా ఒకటి. టీడీపీ ఆవిర్భావం అంటే 1983 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ 6 సార్లు విజయం సాధించింది. కాంగ్రెస్ రెండుసార్లు గెలవగా, 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలిచింది. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన యు. రమణమూర్తి రాజు స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. ఆయనే 2004, 09 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కూడా గెలిచారు.
పంచకర్ల వెళ్లిపోవడంతో…?
ఎన్ని వివాదాలు ఉన్నా రాజకీయంగా తిరుగులేని పట్టు కలిగి ఉండడమే రమణమూర్తి రాజుకు ఉన్న ప్లస్ పాయింట్. ఏపీలోనే చాలా చోట్ల దిక్కూ దివాణం లేని దుస్థితిలో ఉన్న టీడీపీకి యలమంచిలిలో మామూలు కష్టాలు లేవు. ఒకప్పుడు పార్టీకి కంచుకోటగా ఉన్న ఇక్కడ ఇప్పుడు టీడీపీ జెండా పట్టుకుని నడిపించే నాథుడు లేకుండా పోయాడు. 2014లో పెందుర్తి నుంచి ఇక్కడకు ఎన్నికలకు ముందు వలస వచ్చిన పంచకర్ల రమేష్ బాబు గంటా ప్రాపకంతో ఎమ్మెల్యే అయ్యారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత అడ్రస్ లేకుండా పోయారు.
ఆయననే దువ్వుతూ?
చివరకు చంద్రబాబును తిట్టి వైసీపీ చెంత చేరిపోయారు. ఇక పాత టీడీపీ నేత, ప్రస్తుత జనసేన నేత సుందర్‌కుమార్ సైతం తిరిగి టీడీపీలోకి వస్తారన్న ప్రచారం జరుగుతోంది. గతంలో కొన్నేళ్ల పాటు టీడీపీలో ఉన్న ఆయనకు ప్రతి ఎన్నికకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. పార్టీ కోసం కష్టపడడం.. చివర్లో ఎవరో ఒకరు టిక్కెట్ తన్నుకుపోతుండడం జరుగుతూ వస్తోంది. అందుకే సుందర్ కుమార్ గత ఎన్నికలకు ముందే జనసేనలోకి వెళ్లిపోయారు. ఆ ఎన్నికల్లో ఆయన జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఇప్పుడు టీడీపీకి ఎవ్వరూ లేకపోవడంతో మళ్లీ సుందర్ కుమార్‌ను పార్టీ అధిష్టానం దువ్వే పనిలో ఉందట.
ద్వితీయ శ్రేణి నేతలు…?
అయితే సీటుపై స్పష్టమైన హామీ కోసం ఆయన వెయిటింగ్‌లో ఉన్నారు. ఇక జడ్పీ మాజీ చైర్మన్ లాలం భవానీ భర్త లాలం భాస్కరరావు సైతం వచ్చే ఎన్నికల్లో యలమంచిలి టీడీపీ టిక్కెట్ నాదే అని ప్రచారం చేసుకుంటోన్న పరిస్థితి. వీరితో పాటు మరో ఇద్దరు ద్వితీయ శ్రేణి నాయకులు సైతం ఇక్కడ టీడీపీ పగ్గాలు చేపట్టేందుకు ఆసక్తితో ఉండడం ఇక్కడ టీడీపీ దుస్థితికి నిదర్శనం. మరి చంద్రబాబు యలమంచిలిలో పార్టీని ఎలా ట్రాక్ ఎక్కిస్తారో ? ఎవరికి పగ్గాలు ఇస్తారో ? చూడాలి.