ఫేక్ న్యూస్ పై సమరంలో భాగంగా క్లైమేట్ చేంజ్ అబ్జర్వేటరీ లాంఛ్ చేసిన తెలుగుపోస్ట్
తెలుగుపోస్ట్ క్లైమేట్ చేంజ్ అబ్జర్వేటరీని ప్రారంభించింది;

హైదరాబాద్: 19, జనవరి 2025 - ఇంటర్నేషనల్ ఫ్యాక్ట్-చెకింగ్ నెట్‌వర్క్ (IFCN) బిల్డ్- 2024 ప్రాజెక్ట్‌లో భాగంగా తెలుగుపోస్ట్ క్లైమేట్ చేంజ్ అబ్జర్వేటరీని ప్రారంభించింది. గత దశాబ్దం కాలంలో భారతదేశంలో చోటు చేసుకున్న తీవ్రమైన వాతావరణ సంఘటనల గురించి ఖచ్చితమైన సమాచారాన్ని అందించడానికి, వాతావరణ మార్పులకు సంబంధించి జరుగుతున్న తప్పుడు సమాచారాన్ని అడ్డుకోడానికి తెలుగుపోస్ట్ తీసుకున్న చొరవలో ఇది భాగం.
అబ్జర్వేటరీ ముఖ్య లక్ష్యం అసత్య కథనాలను, ప్రచారాలను అడ్డుకోవడం, వాతావరణ మార్పు గురించి, ఈ భూమిపై వచ్చే మార్పుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం. ఈ ప్రాజెక్ట్ భారతదేశంలో వాతావరణ మార్పుల ట్రెండ్‌లను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తుంది, వాతావరణ సంబంధిత తప్పుడు సమాచారాన్ని అడ్డుకోడానికి, ఏది నిజం, ఏది అబద్ధం అని ప్రజలకు తెలియజేస్తుంది. ఇంటరాక్టివ్ మ్యాప్ ద్వారా వాతావరణంలో వచ్చిన సమూలమైన మార్పులు, డేటా, విశ్లేషణను అందిస్తుంది.
21వ శతాబ్దంలో వాతావరణ మార్పు, విపత్తులు పెను సవాల్ గా మారనున్నాయి. పర్యావరణం మాత్రమే కాకుండా జాతీయ భద్రత, అభివృద్ధిపై కూడా ప్రభావం చూపుతున్నాయి. భారతదేశానికి, ఈ ప్రమాదాలను పరిష్కరించడం చాలా ముఖ్యం. ప్రపంచ శక్తిగా ఎదగడానికి కీలకంగా మారనుంది. వాతావరణ మార్పులపై ప్రజలకు అవగాహన అవసరం, తప్పుడు సమాచారం సంక్షోభాన్ని కలిగిస్తుంది. దేశ పురోగతిని గణనీయంగా అడ్డుకుంటుంది.
క్లైమేట్ చేంజ్ అబ్జర్వేటరీలో భాగంగా ఏమున్నాయంటే:
ఫ్యాక్ట్ చెక్స్: వాతావరణ మార్పులకు సంబంధించిన క్లెయిమ్‌లపై నిజ నిర్ధారణ
వివరణలు: IFCN బిల్డ్ 2024 లక్ష్యాలకు అనుగుణంగా ఇటీవలి వాతావరణ మార్పు సంఘటనలను వివరిస్తూ లోతైన విశ్లేషణలు. ఈ వివరణలు వాతావరణ మార్పు చుట్టూ జరుగుతున్న ప్రచారంపై ప్రజలలో అవగాహనను మెరుగుపరుస్తారు.
ఇంటరాక్టివ్ మ్యాప్: గత దశాబ్ద కాలంలో భారతదేశంలో చోటు చేసుకున్న వాతావరణ మార్పులను డాక్యుమెంట్ చేసే సమగ్ర మ్యాపింగ్ ప్రాజెక్ట్. ప్రాంతీయంగా చోటు చేసుకున్న వాతావరణ మార్పులు, ప్రభావాలపై అవగాహన అందిస్తుంది. "వాతావరణ మార్పు అనేది ప్రస్తుతం పెను సవాలుగా మారింది, సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం కోసం ఖచ్చితమైన సమాచారం చాలా కీలకం"
"క్లైమేట్ చేంజ్ అబ్జర్వేటరీ ప్రజలకు విశ్వసనీయమైన డేటా, విశ్లేషణను అందించడానికి కట్టుబడి ఉంది. సరైన సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి, తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకోడానికి ప్రజలకు అధికారం ఇస్తుంది” అని తెలుగుపోస్ట్ ఎడిటర్-ఫ్యాక్ట్ చెకర్ సత్య ప్రియ తెలిపారు.
"తెలుగుపోస్ట్ తన ఫ్యాక్ట్ చెక్ కార్యకలాపాలను 7 భాషల్లో విస్తరించింది, AI, వాతావరణ మార్పు, రాజకీయాలు, ఆరోగ్యం మొదలైన అంశాలపై తప్పుడు సమాచారాన్ని ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ ఉంది.” అని తెలుగుపోస్ట్ డైరెక్టర్, ఎడిటర్ రవి శ్రీనివాస్ తెలిపారు.
జనవరి 2025 నాటికి, తెలుగుపోస్ట్ వాతావరణ మార్పులకు సంబంధించిన అపోహలు, కుట్ర సిద్ధాంతాలు, తప్పుడు సమాచారాన్ని అడ్డుకోడానికి అనేక ఫ్యాక్ట్ చెక్ లను ప్రచురించింది.
ఉదాహరణకు, పర్యావరణంపై కార్బన్ డయాక్సైడ్ ప్రభావం, Chemtrails మొదలైనవి అందులో ఉన్నాయి. తెలుగుపోస్ట్ స్టబుల్ బర్నింగ్, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, డబ్ల్యుఎంఓ రిపోర్ట్, క్లైమేట్ రిస్క్ అసెస్‌మెంట్ రిపోర్ట్ మొదలైన ముఖ్యమైన అంశాలపై ఎక్స్ప్లైనర్లను కూడా ప్రచురించింది.