కొత్త ఫేస్ టీడీపీలో ఇక కనిపించదా.. ?
తెలుగుదేశం పార్టీలో ఎప్పటికీ కొత్తదనం ఏముంది అంటూ జనాలు పెదవి విరిచే సీనే కనిపిస్తోంది. అప్పట్లో అన్న ఎన్టీఆర్ పార్టీకి సారధిగా ఉండేవారు. ఎన్టీఆర్ కి విశేషమైన [more]
తెలుగుదేశం పార్టీలో ఎప్పటికీ కొత్తదనం ఏముంది అంటూ జనాలు పెదవి విరిచే సీనే కనిపిస్తోంది. అప్పట్లో అన్న ఎన్టీఆర్ పార్టీకి సారధిగా ఉండేవారు. ఎన్టీఆర్ కి విశేషమైన [more]
తెలుగుదేశం పార్టీలో ఎప్పటికీ కొత్తదనం ఏముంది అంటూ జనాలు పెదవి విరిచే సీనే కనిపిస్తోంది. అప్పట్లో అన్న ఎన్టీఆర్ పార్టీకి సారధిగా ఉండేవారు. ఎన్టీఆర్ కి విశేషమైన జనాదరణ ఉంది. ఆయనను దేవుడిగా కూడా జనం ఆరాధించేవారు. దాంతో టీడీపీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయేది. ఆయన ఆధ్వర్యంలోనే ఎంతో మంది యువనేతలు అప్పట్లో రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఇప్పటికీ ఇప్పుడే ఉన్నారు తప్ప చంద్రబాబు ఆధ్వర్యంలో తయారై రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపు దమ్మున్న నాయకులు లేరు.
బాబు చేతుల్లోకి వచ్చాక..?
ఎపుడైతే చంద్రబాబు చేతులలోకి పార్టీ వచ్చిందో నాటి నుంచే అసలైన కష్టాలు మొదలయ్యాయి. ప్రతీ ఎన్నికకూ పొత్తులు ఎత్తులు అవసరం పడింది కూడా అపుడే. పాతికేళ్ల బాబు జమానాలో పొత్తుల కధ కూడా కంచికి చేరుతోంది. ఇక గ్లామర్ విషయం చూసుకుంటే అతని కంటే ఘనుడు అన్నట్లుగా చంద్రబాబుతో పోల్చుకుంటే లోకేష్ ఏమీ కాకుండా అయ్యాడని సొంత పార్టీ నుంచే కామెంట్స్ వరసగా పడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, లోకేష్ బాబు కలసి ఎన్నికల ప్రచారాన్ని చేసినా తెలుగుదేశం ఒడ్డెక్కడం సులువు అయ్యేలా లేదు.
చరిష్మా లేకపోవడంతో….?
ఈ ఇద్దరికీ ప్రధానంగా జనాలను ఆకర్షించే వాక్చాతుర్యం కాని… గ్లామర్ లేకపోవడం సమస్యగా ఉంది. చంద్రబాబు గంటల తరబడి ప్రసంగాలు చేసినా జనాలను ఆకట్టుకోవడం కష్టమే. ఇక చినబాబు కూడా సరేసరి అన్నట్లుగా తయారయ్యారని తమ్ముళ్ళ నుంచే కామెంట్స్ వస్తున్నాయి. వచ్చే ఎన్నికలకు రెండేళ్లకు పైగా వ్యవధి ఉన్నా తెలుగుదేశం ఇప్పటి నుంచే పొలిటికల్ గా గ్లామర్ ని అద్దుకోవాలని సూచనలు అయితే వస్తున్నాయి. చంద్రబాబు లోకేష్ ఎంత తిరిగినా కూడా జగన్ ప్రజాకర్షణ ముందు నిలబడలేని పరిస్థితి ఉంది. వైసీపీకి జగన్ ఒక్కడు చాలు అన్నట్లుగా పరిస్థితి ఉంటుంది.
ఎందుకు ఓటెయ్యాలి?
2019 సీనే 2024లో కూడా కనిపిస్తే జనాలు తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటేయాలి అన్నది ప్రశ్న అయితే సమాధానం టీడీపీ పెద్దల వద్ద ఉందా ? అన్నదే చూడాలి. రొడ్డ కొట్టుడు స్పీచులు, అవుట్ డేటెడ్ వ్యూహాలు, నేతలతో తెలుగుదేశం బండిని 2024 ఎన్నికల్లో పరుగులు తీయించడం కష్టమే అని కూడా అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కనుక తెలుగుదేశం తరఫున ప్రచారానికి వస్తే ఆ కిక్కు వేరుగా ఉంటుందన్నది టీడీపీలో నూటికి తొంబై శాతం మంది తమ్ముళ్ళ అభిప్రాయంగా ఉంది. కానీ బాబు తీరు చూస్తూంటే తానూ లోకేష్ సరిపోతామని అనుకుంటున్నారు. ఇదే కనుక జరిగితే మాత్రం మళ్లీ తెలుగుదేశం పార్టీకి శృంగ భంగం తప్పదని కూడా అంటున్నారు. మరి ఎన్నికల నాటికి బాబు స్ట్రాటజీ ఏమైనా మారుస్తారా చూడాలి.