వైట్ హౌస్ లో ఒంటరి జీవితమేనా?

వారు ఎంతటి గొప్ప దేశాధినేతలు అయినా కావచ్చు. తమ దక్షత, సమర్థతతో పాలనాపరమైన అనేక చిక్కుముడులను ఇట్టే పరిష్కరించవచ్చు. దేశానికి తిరుగులేని నేతలు కావచ్చు. కానీ వ్యక్తిగత [more]

Update: 2019-12-28 16:30 GMT

వారు ఎంతటి గొప్ప దేశాధినేతలు అయినా కావచ్చు. తమ దక్షత, సమర్థతతో పాలనాపరమైన అనేక చిక్కుముడులను ఇట్టే పరిష్కరించవచ్చు. దేశానికి తిరుగులేని నేతలు కావచ్చు. కానీ వ్యక్తిగత జీవితాలు, కుటుంబ వ్యవహారాలను వారిని కుంగదీస్తాయి. చికాకులు కలిగిస్తూ ఉంటాయి. చరిత్ర తరచి చూస్తే ఇలాంటి ఉదాహరణలు ఎన్నో కనపడతాయి. జనాభా పరంగా ప్రపంచంలో రెండో పెద్ద దేశమైన భారత ప్రధాని నరేంద్ర మోదీ కుటుంబ జీవితం గురించి అందరికీ తెలిసిందే. భార్య యశోదా బెన్ తో సత్సంబంధాలు లేవు. ఇరువురూ ఒంటరి జీవితం గడుపుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించిన ఎన్టీ రామారావు ద్వితీయ కళత్రం కారణంగా ఎదుర్కొన్న ఇబ్బందులు అందరికీ తెలిసిందే. జింబాంబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాంబే పాలన వ్యవహారాల్లో భార్య జోక్యం కారణంగా రెండేళ్ల క్రితం పదవినే కోల్పోయారు. ప్రపంచ వ్యాప్తంగా కొంత మంది దేశాధినేతల కుటుంబాల్లో కలతలు, కష్టాలు, కన్నీళ్లు అనివార్యంగా కనపడుతోంది. ఎంత దేశాధినేతలయినా వారు వ్యక్తిగత జీవితాల్లో సాధారణ మనుషులే. మానవ మాత్రులే. అందరిలాగానే వారికి తలనొప్పులు తప్పవు.

మెలనియాతో సత్సంబంధాలు లేక…

ఇప్పుడు ఈ కోవ లోకి వస్తాడు .. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అగ్రరాజ్య అధినేతగా యావత్ ప్రపంచాన్ని గడగడలాడించే ఆయన వ్యక్తిగత జీవితంలో చికాకులతో సతమతమవుతున్నారు. నిత్యం ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సమస్యలను ఇట్టే చక్కదిద్దే ట్రంప్ సొంత ఇంటి ఇబ్బందులను పరిష్కరించుకోలేక పోతున్నారు. రెండో భార్య ఇందుకు కారణమని చెప్పక తప్పదు. అధ్యక్షుడు ట్రంప్, ఆయన భార్య మెలానియాల మధ్య సత్సంబంధాలు లేవని అంతర్జాతీయ సమాజం కోడై కూస్తోంది. అధ్యక్ష్య కార్యాలయమైన శ్వేత భవనంలో ఇద్దరూ ఒంటరి జీవితం గడుపుతున్నారు. మనుషులు కలిసి ఉంటున్నప్పటికీ వారి మధ్య మాటలు లేవు. ఎవరి జీవితం వారిదే. ఎవరి ప్రపంచం వారిదే. కనీసం ఒకరి ముఖం ఒకరు చూసుకునే పరిస్థితి లేదని, పలకరింపులు కూడా లేవని శ్వేతసౌధ వర్గాల కథనం. దీనిని తోసి పుచ్చడం కష్టమే.

ఇవాంకా వల్లనేనా?

ఈ మొత్తం పరిస్థిితికి ప్రధాన కారణం ఇవాంకా ట్రంప్. ఈమె ట్రంప్ గారాల పట్టి. ట్రంప్ మొదటి భార్య కూతురు. అధ్యక్షుడిని అనుక్షణం కనిపెట్టుకుని ఉంటారు. అధికారిక వ్యవహారాల్లో చేదోడు వాదోడుగా ుటారు. అధ్యక్షుడు ట్రంప్ అధికారిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారన్న పేరుంది. సహజంగానే చురుకైన నాయకత్వ లక్షణాలు గల ఇవాంకా అనేక విషయాల్లో తండ్రి ట్రంప్ ను మెప్పిస్తుందన్న పేరుంది. ట్రంప్ రెండో భార్య అయిన మెలానియాకు ఇది సహజంగానే మింగుడు పడని పరిణామం. తన మొదటి భార్య కూతురు ఇవాంకా కు ట్రంప్ ప్రాధాన్యం ఇవ్వడాన్ని మెలనియా జీర్ణించుకోలేక పోతున్నారు. అందువల్లే అధ్యక్షుడు ట్రంప్ అధికారిక కార్యక్రమాలకు కావాలనే, ఉద్దేశ్యపూర్వకంగా దూరంగా ఉంటున్నారు. ఎక్కడా ఏ కార్యక్రమంలోనూ కనిపించడం లేదు. సాధారణంగా అధ్యక్షుడి విదేశీ పర్యటనల్లో, అధికారిక కార్యక్రమాల్లో ప్రధమ మహిళ ప్రముఖంగా కనపడుతుంటారు. ఆమెతో మాట్లాడటానికి, కరచాలనం చేసేందుకు దేశాధినేతలే పోటీ పడుతుంటారు. చాలా వరకూ ట్రంప్ ఒక్కరే విదేశీ పర్యటనలకు వెళుతున్నారు. అధికారిక కార్యక్రమాల్లో నూ దే పరిస్థిితి. కొన్ని సందర్భాల్లో ఇవాంకాను తీసుకెళుతున్నారు.

కుమారుడితోనే జీవితంగా….

గతంలో ఒకసారి ఇవాంకా హైదరాబాద్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఇవన్నీ మెలనియాకు మింగుడుపడటం లేదు. అమెరికా ప్రధమ మహిళగా, ప్రపంచంలోనే శక్తిమంతమైన మహిళగా ఆమె సకల భోగాలు గల వైట్ హౌస్ లో దాదాపు ఒంటరి జీవితం గడుపుతున్నారు. సవతి భార్య కుమార్తె ఇవాంకా పొడ ఆమెకు ఎంత మాత్రం గిట్టడం లేదు. గత ఏడాది అనారోగ్యం పాలైన మెలనియా దాదాపు మూత్ర పిండాలు కోల్పోయే ప్రమాదకర పరిస్థితికి చేరుకున్నారు. “ఫ్రీ మెలనియా – అనాధరైజ్డ్ బయోగ్రఫీ” పేరుతో సీఎన్ఎన్ పాత్రికేయులు కేట్ బెనెట్ రాసిన పుస్తకంలో ఈ సంచలన విషయాలు వెల్లడించారు. వైట్ హౌస్ పాత్రికేయ సిబ్బందితో ఒకరైన బెనెట్ ఎక్కువగా మెలనియా వ్యక్తిగత విషయాలు చూస్తుంటారు. స్లోవేనియాలో పుట్టి పెరిగినప్పటి నుంచి వైట్ హౌస్ లోకి ప్రవేశించే వరకూ మెలనియా జీవితంలోని అనేక పార్శ్వాలను ఆయన ఈ 288 పేజీల పుస్తకంలో విశ్లేషించారు. ప్రస్తుతం ఈ పుస్తకం, ఇందులోని విషయాలు అగ్రరాజ్యంలో ఆసక్తికరంగా మారాయి. అందరి దృష్టి వీటిపైనే ఉంది. ప్రస్తుతం మెలనియా దృష్టి అంతా తన పదమూడేళ్ల కుమారుడిపైనే ఉంది. మెలనియా, ట్రంప్ దంపతులకు జన్మించిన కుమారుడు బీరెన్. అతని బాగోగులు, భవిష్యత్, విద్యాభ్యాసం పైనే మెలనియా దృష్టి కేంద్రీకరించారు. అతనే ప్రపంచంగా జీవితం సాగిస్తున్నారు. బ్లడ్ ఈజ్ థిక్కర్ దేన్ వాటర్ అన్న ఆంగ్ల సామెత మెలనియాకు చక్కగా వర్తిస్తుంది. ఇది నూరుశాతం వాస్తవం. తన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ బీరెన్ బాగోగులను చూడటంలోనే ఆమె తలమునకలై ఉన్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News