టిడిపికి మరో షాక్ తప్పదా ?

వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీ కి గుడ్ బై కొట్టడానికి రెడీ అయినట్లు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. కోస్తా లో కాపు సామాజికవర్గంలో క్రేజీ లీడర్ [more]

Update: 2019-06-26 06:30 GMT

వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీ కి గుడ్ బై కొట్టడానికి రెడీ అయినట్లు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. కోస్తా లో కాపు సామాజికవర్గంలో క్రేజీ లీడర్ గా ఎదిగి హత్యగావించబడిన వంగవీటి రంగా తనయుడిగా రాధా ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అయితే ఆయన వేసిన రాంగ్ స్టెప్స్ రాజకీయంగా రాధను పాతాళానికి తీసుకుపోయాయి. తన తండ్రిని హత్య వెనుక వున్నారని ఆరోపణలు ఎదుర్కొన్న వారి పార్టీలోకి వెళ్లడం కోస్తాలో కాపు సామాజికవర్గం జీర్ణించుకోలేక పోయింది. పైగా వైసిపి ఇచ్చిన బంపర్ ఆఫర్ లను కాలదన్ని ఆ పార్టీకి గుడ్ బై కొట్టడం, జనసేన లో సముచిత స్థానం వున్నా కాదనుకుని టిడిపికి పోవడంతో ఇంతకాలం వున్న రంగా ఇమేజ్ మసకబారిబోయింది.

పవన్ తో భేటీ వెనుక …

టిడిపిలో చేరితే ఎమ్యెల్సీ పదవి ఇస్తామనడంతో వంగవీటి రాధా మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ విజయానికి శ్రమించారు. అయితే సీన్ సితార అయ్యి టిడిపి ఘోరంగా దెబ్బతింది. టిడిపి భవిష్యత్తులో సైతం కోలుకుంటుందో లేదో చెప్పలేని పరిస్థితి. దాంతో జనసేన వైపు దృష్టి పెట్టి సామాజికపరంగా అయినా కనీసం పోయిన పరువు దక్కించుకోవాలని సన్నిహితుల సూచనలతో రాధా మనసు మార్చుకున్నట్లు తెలుస్తుంది. గతంలో ప్రజారాజ్యం పార్టీలో టికెట్ తెచ్చుకుని ఓడిపోయిన వంగవీటి రాధా కు జనసేన తో కూడా దగ్గర సంబంధాలే వున్నాయి. నాడు వైఎస్ ను కాదనుకుని తన భవిష్యత్తును అయోమయం చేసుకున్నారు రాధ. ఇప్పుడు వైఎస్ జగన్ ను కాదనుకుని మరోసారి దెబ్బయ్యారు. ఇక ప్రస్తుతం జనసేన తప్ప ఆయనకు మరో దారి లేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ తో రెండు గంటల పాటు సుదీర్ఘ చర్చలు సాగించారు రాధా. పార్టీలోకి అడుగుపెడితే తన పాత్ర పై క్లారిటీ తీసుకున్న ఆయన వచ్చేనెల 5 వతేదీన వంగవీటి రంగా జయంతి నాడు తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలుస్తుంది. చూడాలి ఇప్పుడు వంగవీటి రాధా కొత్త అడుగు అయినా రాజకీయ భవిష్యత్తు ప్రసాదిస్తుందో లేదో.

Tags:    

Similar News