వంగవీటి దానిని వదులుకునేందుకు ఇష్టంగా లేరట

మున్సిపల్ ఎన్నికలు వచ్చి కొందరు నేతలను యాక్టివ్ చేశాయి. అయితే ఈ ప్రభావం వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఎలా మారుతుందన్నది ఆసక్తికరంగా మారింది. విజయవాడలో మాజీ ఎమ్మెల్యే [more]

Update: 2021-03-10 08:00 GMT

మున్సిపల్ ఎన్నికలు వచ్చి కొందరు నేతలను యాక్టివ్ చేశాయి. అయితే ఈ ప్రభావం వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఎలా మారుతుందన్నది ఆసక్తికరంగా మారింది. విజయవాడలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా తిరిగి యాక్టివ్ అయ్యారు. దాదాపు ఇరవై నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వంగవీటి రాధా మున్సిపల్ ఎన్నికల వేళ మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండటం చర్చనీయాంశమైంది. అయితే భవిష్యత్ లో ఇది చంద్రబాబుకు తలనొప్పిగా మారనుందన్న చర్చ జరుగుతోంది.

అన్ని పార్టీలూ మారి….

వంగవీటి రాధా ఇప్పటికే అన్ని పార్టీలూ మారేశారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన కనీసం పోటీ చేయని పరిస్థితి. టీడీపీకి మద్దతుగా ప్రచారం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే వంగవీటి రాధా ఖచ్చితంగా ఎమ్మెల్సీ అయ్యేవారు. ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేదు. దీంతో ఆయన ఇరవై నెలలుగా పార్టీ విషయాలకు దూరంగా ఉంటున్నారు. కేవలం అమరావతిలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా వంగవీటి రాధా రెండు, మూడు సార్లు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

కార్పొరేషన్ ఎన్నికల వేళ…..

అయితే ఇప్పుడు బెజవాడ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో వంగవీటి రాధా కీలకంగా మారారు. ఆయన పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాలకు కూడా హాజరయ్యారు. అయితే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తన పట్టుపోకుండా ఉండేందుకే వంగవీటి రాధా యాక్టివ్ అయినట్లు చెబుతున్నారు. తొలినుంచి వంగవీటి రాధాకు సెంట్రల్ నియోజకవర్గంపైనే మక్కువ ఎక్కువ. ఇక్కడ టీడీపీ ఇన్ ఛార్జిగా బోండా ఉమామహేశ్వరరావు ఉన్నారు. గత ఎన్నికల్లోనూ బోండా ఉమ స్వల్ప ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు.

టీడీపీ టిక్కెట్ రాకున్నా…..

బోండా ఉమను కాదని చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టిక్కెట్ ను వంగవీటి రాధాకు ఇచ్చే అవకాశం లేదు. తనకు టీడీపీ టిక్కెట్ రాకపోయినా ఈసారి జనసేన నుంచి పోటీ చేయాలని వంగవీటిరాధా భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే ఆయన మున్సిపల్ ఎన్నికల వేళ యాక్టివ్ అయ్యారంటున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న 21 వార్డుల్లో టీడీపీ లేదా జనసేన అభ్యర్థులను గెలిపించాలని వంగవీటి రాధా పిలుపునివ్వడం చర్చనీయాంశమైంది. వంగవీటి రాధా సెంట్రల్ నియోజకవర్గాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేరన్నది స్పష‌్టమవుతుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో పార్టీ మారైనా వంగవీటి రాధా సెంట్రల్ నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి.

Tags:    

Similar News