విష్ణు ఇక అంతేనా…?
రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను సంపాయించుకునేందుకు ఏ నాయకుడైనా తాపత్రయ పడుతుంటారు. అయితే, వచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోకుండా.. తన రూటు సెపరేటు.. అంటూ కబుర్లు చెప్పేవారి [more]
రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను సంపాయించుకునేందుకు ఏ నాయకుడైనా తాపత్రయ పడుతుంటారు. అయితే, వచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోకుండా.. తన రూటు సెపరేటు.. అంటూ కబుర్లు చెప్పేవారి [more]
రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను సంపాయించుకునేందుకు ఏ నాయకుడైనా తాపత్రయ పడుతుంటారు. అయితే, వచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోకుండా.. తన రూటు సెపరేటు.. అంటూ కబుర్లు చెప్పేవారి పరిస్థితి ఏంటి? ఫ్యూచర్ ఏంటి ? ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలే.. బీజేపీ నాయకుడు, విశాఖ ఉత్తర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజును వేధిస్తున్నాయి. ఆయన బీజేపీలో ఉన్నారు. కానీ, ఏ ఒక్క నాయకుడితోనూ ఆయనకు సఖ్యత లేదు. ఏ ఒక్క నేతతోనూ కలిసి ముందుకు సాగే పరిస్థితి లేదు. పోనీ.. ఆయన పార్టీ మారే ప్రయత్నం చేస్తున్నారా? అంటే.. చేసినట్టే అనిపిస్తుంది .. కానీ,బీజేపీని మాత్రం విడిచిపెట్టరు.
ఆయనను పిలవకుండానే…..
ఇదీ ఇప్పుడు విష్ణుకుమార్ రాజు గురించి బీజేపీలో జరుగుతున్న చర్చ. ఆయనను ఆటలో అరిటిపండు మాదిరిగా లెక్కేసుకుంటున్నారు బీజేపీ నాయకులు. ఇటీవల ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ మహాత్మా గాంధీ సంకల్పయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమానికి అందరినీ పిలిచారు. అయితే, విష్ణుకుమార్ రాజు విషయానికి వచ్చే సరికి మాత్రం.. మనం పిలవక పోయినా.. ఆయనే వచ్చేస్తారు! అనే ధీమా వ్యక్త పరిచారు. ఇక, ఈ కార్యక్రమానికి అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు విష్ణుకుమార్ రాజు. అంటే… దీనిని బట్టి.. పార్టీలో ఆయన ఉన్నారని పెద్దగా ఎవరూ లెక్కపెట్టుకోవడం లేదు.
ఇంగ్లీష్ మీడియం కరెక్టేనంటూ….
బీజేపీ రాష్ట్ర నేతలు జగన్‌ను విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ఇసుక, తెలుగు మీడియం ఎత్తివేతలపై కన్నా సహా పలువురు నాయకులు జగన్ సర్కారును టార్గెట్ చేస్తున్నారు. తీవ్ర విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. మరి ఇంతలా రాష్ట్ర బీజేపీ నాయకులు విరు చుకుపడుతుంటే.. విష్ణుకుమార్ రాజు మాత్రం.. తీరిగ్గా ఇంగ్లీష్ మీడియం కరెక్టే అనే బాంబు పేల్చారు. అంతేకాదు, ఇంగ్లీష్ మీడియం వల్ల అన్యమతాలను రుద్దినట్టవుతుంది.. అన్న కన్నా వ్యాఖ్యలతో విభేదించారు. ఆయనలా ఎందుకు అన్నారు? ఇది ఎలా సాధ్యం అంటూ బుగ్గలు నొక్కుకున్నారు.
చంద్రబాబుకు కూడా…..
దీంతో అంతంత మాత్రంగా ఉన్న విష్ణుకుమార్ రాజుతో సంబంధాలు మరింత క్షీణించాయని కన్నా వర్గం చెబుతోంది. ఇక, మిగిలిన నాయకులతో కూడా విష్ణుకుమార్ రాజు ఎంతెంత దూరం.. అంటే.. చాలా చాలా దూరంగానే ఉన్నారు. అటు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలో చంద్రబాబుకు వీలున్నప్పుడల్లా డప్పుకకొడుతూనే ఉండేవారు. ఆయన అప్పుడు కూడా పార్టీలో ఎవ్వరికి అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు కూడా అదే పంథాలో ముందుకు వెళుతుండడంతో పార్టీ అగ్ర నాయకత్వం కూడా ఆయన్ను పట్టించుకోవడం లేదు. దీంతో బీజేపీలో విష్ణుకుమార్ రాజు ఆటలో అరిటి పండుగా మారారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.