శర్మను దాటాలంటే సెంచరీ కొట్టాలిసిందే ?

ప్రపంచ కప్ లో తన అద్వితీయ ఆటతీరుతో ఇప్పటివరకు టాప్ స్కోరర్ గా నిలిచాడు ఇండియన్ స్టార్ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ. వరల్డ్ కప్ [more]

Update: 2019-07-12 03:07 GMT

ప్రపంచ కప్ లో తన అద్వితీయ ఆటతీరుతో ఇప్పటివరకు టాప్ స్కోరర్ గా నిలిచాడు ఇండియన్ స్టార్ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ. వరల్డ్ కప్ లో సెమిస్ ముగిసే సరికి 648 పరుగులతో శర్మే నెంబర్ వన్ స్థానం లో కొనసాగుతున్నాడు. శర్మ తరువాత ఆస్ట్రేలియన్ డాషింగ్ ఓపెనర్ 647 పరుగులు తో రెండో స్థానంలో, బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ 606 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. అయితే సెమిస్ లో టీం ఇండియా, ఆస్ట్రేలియా లీగ్ దశలో బంగ్లాదేశ్ ఇంటి బాట పట్టడంతో వరల్డ్ కప్ లో టాప్ స్కోరర్ శర్మ నిలుస్తాడా లేదా అన్న చర్చ నడుస్తుంది. వీరి ముగ్గురి తరువాత మరో ఇద్దరికి శర్మ రికార్డ్ దాటే ఛాన్స్ కనిపిస్తుంది.

రూట్, విలియమ్సన్ లకు అవకాశం …

ఇంగ్లాండ్ ఆటగాడు జోయ్ రూట్ 549 పరుగులతో టాప్ స్కోర్ బ్యాట్స్ మెన్ లలో నాలుగో స్థానం లో వున్నాడు. ఇక ఇదో స్థానంలో న్యూజిలాండ్ కెప్టెన్ కెన్ విలియమ్సన్ 548 పరుగులతో కొనసాగుతున్నాడు. ఫైనల్ ఇంగ్లాండ్ – న్యూజిలాండ్ ల నడుమ లార్డ్స్ లో జరగనుండటంతో రోహిత్ రికార్డ్ ను వీరిద్దరిలో ఎవరోఒకరు బద్దలు కొట్టే అవకాశం వుంది. ఈ స్టార్ బ్యాట్స్ మెన్ లు ఇరువురు తమ టీమ్ లు ఫైనల్ కి చేరుకోవడంలో అద్భుత పాత్ర పోషించినవారే కావడం విశేషం. శర్మ నెలకొల్పిన 648 పరుగులను దాటాలంటే రూట్ సరిగ్గా వంద పరుగులు ఫైనల్ లో కొడితే సరిపోతుంది. ఇక కెన్ విలియమ్సన్ అయితే 101 పరుగులు చేయాలి. అయితే వీరిద్దరూ శర్మ పరుగుల రికార్డ్ ను అధిగమించకపోతే మాత్రం 2019 ప్రపంచకప్ టాప్ స్కోరర్ రికార్డ్ మాత్రం టీం ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట నిలిచిపోనుంది. ఇప్పటికే ఒక వరల్డ్ కప్ టోర్నీ లో ఐదు సెంచరీల రికార్డ్ తో పాటు రోహిత్ అనేక రికార్డ్ లను తనపేరిట లిఖించడం తెలిసిందే

Tags:    

Similar News