విలియమ్సన్ ది గ్రేట్ …. రోహిత్ కి దక్కని ఆ ఛాన్స్
న్యూజిలాండ్ ను తన అద్భుత ప్రతిభతో ఫైనల్స్ వరకు చేర్చడంలో కెన్ విలియమ్సన్ అద్భుత పోరాటమే సాగించాడు. ఒక పక్క రాస్ టేలర్ తప్ప మిగిలిన బ్యాట్స్ [more]
న్యూజిలాండ్ ను తన అద్భుత ప్రతిభతో ఫైనల్స్ వరకు చేర్చడంలో కెన్ విలియమ్సన్ అద్భుత పోరాటమే సాగించాడు. ఒక పక్క రాస్ టేలర్ తప్ప మిగిలిన బ్యాట్స్ [more]
న్యూజిలాండ్ ను తన అద్భుత ప్రతిభతో ఫైనల్స్ వరకు చేర్చడంలో కెన్ విలియమ్సన్ అద్భుత పోరాటమే సాగించాడు. ఒక పక్క రాస్ టేలర్ తప్ప మిగిలిన బ్యాట్స్ మెన్ ఎవరి నుంచి సహకారం లేకపోయినా పోరాట స్పూర్తితో లీగ్ లో ఓడిపోయే మ్యాచ్ లను సైతం గెలిచి ఫైనల్స్ వరకు తన టీం ను తీసుకువెళ్లాడు కివీస్ కెప్టెన్ విలియమ్సన్. టీం చేసిన మొత్తం పరుగులో కెన్ చేసినవి సగానికి పైనే. రెండు సెంచరీల తో బాటు కీలకమైన సమయాల్లో హాఫ్ సెంచరీలు చేసి జట్టుకు వెన్నెముకగా నిలిచి స్ఫూర్తివంత కెప్టెన్ గా నిలిచాడు కెన్. అందుకే ప్రతిష్టాత్మకమైన 2019 వరల్డ్ కప్ టోర్నీ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కి ఐసిసి ఎంపిక చేసింది.
రోహిత్ కి చుక్కెదురు …
వాస్తవానికి ప్రపంచకప్ సెమిస్ లో వెనుతిరిగినా టీం ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. శర్మ 648 పరుగులు చేయగా, ఆసీస్ ఓపెనర్ వార్నర్ 647 పరుగులతో రెండో ప్లేస్ లోను బాంగ్లాదేశ్ ఆటగాడు షకీబ్ 606 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. అయితే వీరిని ఫైనల్ లో సెంచరీ చేస్తే అధిగమించే అవకాశం ఉండగా కెన్ విలియమ్సన్ 578 పరుగులు, ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్ మెన్ జో రూట్ 556 పరుగులే చేయగలిగారు. ఈ లెక్క ప్రకారం రోహిత్ కి మ్యాన్ ఆఫ్ ద టోర్నీ దక్కే అవకాశం వుంది. కానీ ఐసిసి ఓవరాల్ ఆటతీరును పరిగణలోనికి తీసుకుని టోర్నీ హీరో గా కెన్ విలియమ్సన్ ను ఎంపిక చేసింది. బ్యాటింగ్ యావరేజ్ లో రోహిత్ కన్నా(81) ఒక్క పాయింట్ కెన్ (82.57) ముందు ఉండటంతో ప్రతిష్టాత్మక అవార్డు విలియమ్సన్ సొంతమైంది. సెమిస్ లో ఒకే ఒక్క పరుగు చేసి బ్యాటింగ్ యావరేజ్ పదిపాయింట్లు దిగిపోయిన రోహిత్ శర్మ కు మ్యాచ్ తో పాటు దురదృష్టం వెక్కిరించగా ఫైనల్ మ్యాచ్ పోయినా కెన్ కి మాత్రం కొంత ఊరట లభించడం విశేషం.