కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా…?

ఇంకా ఆరుగురు సభ్యులు మాత్రమే అవసరం. అది వీలయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. ఇదీ భారతీయ జనతా పార్టీ ధీమా. మా సభ్యులంతా మాతోనే ఉన్నారు. [more]

Update: 2019-05-26 16:30 GMT

ఇంకా ఆరుగురు సభ్యులు మాత్రమే అవసరం. అది వీలయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. ఇదీ భారతీయ జనతా పార్టీ ధీమా. మా సభ్యులంతా మాతోనే ఉన్నారు. సంకీర్ణ సర్కార్ కు వచ్చే ముప్పేమీ లేదు. ఇదీ కాంగ్రెస్, జేడీఎస్ నేతల నమ్మకం. అయితే కర్ణాటకలో త్వరలోనే ప్రభుత్వం మారుతుందన్న ప్రచారం జరుగుతంది. కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో సంకీర్ణ సర్కార్ కు గండం తప్పేలా లేదు.

లోక్ సభ ఎన్నికల ఫలితాలతో….

కర్ణాటకలో ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 28 లోక్ సభ స్థానల్లో బీజేపీ 25 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప మరోసారి ముఖ్యమంత్రి కావాలని తపిస్తున్నారు. మొత్తం 224 స్థానాలున్న కర్ణాటకలో బీజేపీకి 104 మంది సభ్యుల బలం ఉంది. కాంగ్రెస్ కు 77, జేడీఎస్ కు 37 మందిసభ్యుల బలం ఉంది. అయితే ఇప్పుడు లోక్ సభ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాదాపు 12 మంది పార్టీని వీడేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

దానంతట అదే….

దానంతట అదే కుప్పకూలిపోతుందని యడ్యూరప్ప భావిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేష్ జార్భిహోళి ఇప్పటికే ఆ ప్రయత్నాలను ప్రారంభించారు. రమేష్ జార్ఖిహోళితో పాటు మరో పదకొండు మంది సభ్యులు పార్టీని వీడతారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొందరు బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుసుకున్న కాంగ్రెస్, జేడీఎస్ లు శాసనసభ్యులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. శాసనసభ్యులు చేజారి పోకుండా చూసుకునేందుకు సిద్ధరామయ్య, కుమారస్వామిలు ప్రయత్నిస్తున్నారు.

రాజీనామాలు చేయించి…..

బీజేపీ ప్లాన్ మరోలా ఉంది. ఇప్పుడు స్పీకర్ తమ చేతిలో లేరు. అందుకని పన్నెండు మంది కాంగ్రెస్ శాసనసభ్యుల చేత రాజీనామా చేయించాలని నిర్ణయించారు. ఈ రాజీనామాలతో సంకీర్ణ సర్కార్ బలం తగ్గే అవకాశముంది. దీంతో గవర్నర్ ఆహ్వానం మేరకు సర్కార్ ను ఏర్పాటు చేయవచ్చు. లోక్ సభ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ శాసనసభ్యులు కూడా రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో 48 గంటల్లోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. మొత్తం మీద కర్ణాటక సంకీర్ణ సర్కార్ కు గండం తప్పేట్లు లేదు. కౌంట్ డౌన్ మొదలయినట్లేనన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News