కాదనే దమ్ము, ధైర్యం ఉందా?

ముఖ్యమంత్రి యడ్యూరప్ప దావోస్ పర్యటన నుంచి తిరిగి వచ్చినా ఇప్పట్లో మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశాలు లేనట్లు కన్పిస్తుంది. ఢిల్లీ ఎన్నికల తర్వాతనే మంత్రి వర్గ [more]

Update: 2020-01-25 18:29 GMT

ముఖ్యమంత్రి యడ్యూరప్ప దావోస్ పర్యటన నుంచి తిరిగి వచ్చినా ఇప్పట్లో మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశాలు లేనట్లు కన్పిస్తుంది. ఢిల్లీ ఎన్నికల తర్వాతనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం ఉంది. అయితే నిన్న మొన్నటి వరకూ 11 మందితో మంత్రి వర్గ విస్తరణ చేయాలని చెప్పిన పార్టీ కేంద్ర నాయకత్వం దీనిని మరో ఐదుకు తగ్గించింది. మొత్తం ఆరుగురిని మాత్రమే ఈ విడత మంత్రి వర్గంలోకి తీసుకోవాలని యడ్యూరప్పకు సంకేతాలు అందినట్లు తెలుస్తోంది.

మిగిలిన రాష్ట్రాల్లో…

దేశంలో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలను బీజేపీ అధిష్టానం నిశితంగా గమనిస్తుంది. నాయకత్వ లోపం కారణంగా అనేక రాష్ట్రాల్లో బీజేపీ అధికారానికి దూరమయింది. హర్యానా, జార్ఖండ్ లలో ముఖ్యమంత్రులకు ఎంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చినా వారు సమర్థమైన పాలన అందివ్వ లేక పోయారన్న నమ్మకంతో ఉంది. కేవలం కేంద్ర నాయకత్వం, మోడీ ఇమేజ్ మీద ఆధారపడి అక్కడ రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ కేంద్ర నాయకత్వం పసిగట్టింది. కానీ యడ్యూరప్ప అలా కాదు.

బలమైన సామాజికవర్గంతో పాటు….

బలమైన లింగాయత్ సామాజికవర్గంతో పాటు పార్టీని గెలిపించగల సత్తా యడ్యూరప్ప కు ఉందన్నది అనేకమార్లు రుజువైంది. నిజానికి దక్షిణాదిన కర్ణాటకలో బీజేపీ పునాదులు ఏర్పరచుకోవడానికి యడ్యూరప్ప ప్రధాన కారణమని చెప్పాలి. దక్షిణాదిలో ఏ రాష్ట్రంలోనూ బీజేపీ ఇంతవరకూ పట్టు సాధించలేకపోయిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో యడ్యూరప్ప అవసరం పార్టీకి ఎంతో ఉందన్నది కాదనలేని సత్యం.

ఆరింటితో సరిపెట్టాలని….

యడ్యూరప్పకు 70ఏళ్లు వచ్చినా పార్టీ నిబంధనల ప్రకారం ఆయనను పక్కన పెట్టే ధైర్యం చేయలేదు. అంతేకాదు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే యడ్యూరప్పను బీజేపీ అధ్యక్ష్య పదవి నుంచి తప్పించింది. మరి మంత్రివర్గ విస్తరణలో యడ్యూరప్ప ను కాదనే సాహసం చేయలేదన్న వాదన కూడా మరోవైపు విన్పిస్తుంది. పార్టీ నేతలను కట్టడి చేయాలంటే మొత్తం 16 మంత్రి పదవులను భర్తీ చేయకుండా ఆరింటితో సరిపెట్టాలని కేంద్రం భావిస్తుంది. మరి యడ్యూరప్ప ఇందుకు అంగీకరిస్తారో? లేదో? చూడాలి.

Tags:    

Similar News