అప్పకు కలసిరాకుండాపోయిన తొలి ఏడాది
కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. అయితే ఆ ముహూర్తాన యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారో కాని అభివృద్ధిని విపత్తులు అడ్డుకుంటూనే ఉన్నాయి. వరదలు, విపత్తులతోనే [more]
కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. అయితే ఆ ముహూర్తాన యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారో కాని అభివృద్ధిని విపత్తులు అడ్డుకుంటూనే ఉన్నాయి. వరదలు, విపత్తులతోనే [more]
కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. అయితే ఆ ముహూర్తాన యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారో కాని అభివృద్ధిని విపత్తులు అడ్డుకుంటూనే ఉన్నాయి. వరదలు, విపత్తులతోనే యడ్యూరప్ప ఏడాది కాలాన్ని ముగించేశారు. గత ఏడాది జులైలో యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు. తొలి నాలుగు నెలలు మంత్రి వర్గ విస్తరణ, ఉప ఎన్నికలపైనే ఆయన ఎక్కువగా దృష్టి సారించాల్సి వచ్చింది.
ఉప ఎన్నికలతో….
యడ్యూరప్ప అధికారంలోకి రావడానికి కారణమైన కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకుని ఉప ఎన్నికలకు రెడీ అయిపోయారు. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తేనే యడ్యూరప్ప ప్రభుత్వం మనుగడ ఉంటుంది. దీంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఎక్కువగా ఈ ఉప ఎన్నికలపైనే దృష్టి పెట్టారు. మొత్తం మీద యడ్యూరప్ప తన వారిని గెలిపించుకుని పదవిని, ప్రభుత్వాన్ని సుస్ధిరం చేసుకున్నారు.
వరదలతో తీవ్రనష్టం….
ఇదిలా ఉండగానే వరదలు కర్ణాటకను ముంచేశాయి. లక్షలాది ఎకరాల్లో పంట నీటమునిగింది. కోట్లాది రూపాయల నష్టం జరిగింది. యడ్యూరప్ప కేంద్ర సాయం కోసం చూసినా పెద్దగా రాలేదు. ఈలోగా మంత్రి వర్గ విస్తరణపై యడ్యూరప్ప కసరత్తలు చేశారు. యడ్యూరప్ప వ్యతిరేకవర్గం ఢిల్లీలో తిష్టవేసి విస్తరణలో తమకు అవకాశం ఇవ్వాలని పట్టబట్టారు. దీంతో యడ్యూరప్ప కొంతకాలం మంత్రవర్గ విస్తరణపైనే పెట్టాల్సి వచ్చింది.
కరోనా రావడంతో….
అంతా బాగుందనుకుని కుదురుకునే సమయంలోనే కరోనా వైరస్ వచ్చి పడింది. ఆరు నెలల నుంచి యడ్యూరప్ప ఫోకస్ అంతా దీనిపైనే పెట్టారు. వైద్య పరికరాల కొనుగోళ్లలో అవినీతి జరిగిందన్న ఆరోపణలున్నాయి. వలస కార్మికుల సాయంలోనూ ప్రభుత్వ పెద్దలు చేతివాటం చూపారంటున్నారు. మరోవైపు కర్ణాటకలో కరోనా వైరస్ తగ్గడం లేదు. లక్ష కేసులు దాటిపోయాయి. మరికొంతకాలం యడ్యూరప్ప కరోనాపైనే కుస్తీ చేయకతప్పదు. మొత్తం మీద యడ్యూరప్ప ఏడాది పాలనలో అంతా విపత్తులు, వైరస్ లతోనూ గడిచిపోయిందని చెప్పక తప్పదు.