యడ్యూరప్పకు ఇక ఉద్వాసన తప్పదట

కర్ణాటక ముఖ్మమంత్రి యడ్యూరప్పను ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసమే యడ్యూరప్పను ఇంకా [more]

Update: 2021-04-12 17:30 GMT

కర్ణాటక ముఖ్మమంత్రి యడ్యూరప్పను ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసమే యడ్యూరప్పను ఇంకా ముఖ్యమంత్రిగా కొనసాగిస్తున్నారంటున్నారు. ఈ మేరకు మరోసారి బీజేపీ అసంతృప్త నేతలు ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. యడ్యూరప్ప స్థానంలో కొత్త వారిని నియమించాలని గత కొంతకాలంగా డిమాండ్ విన్పిస్తున్న సంగతి తెలిసిందే.

కొత్త నేత కోసం….

యడ్యూరప్పకు 70 సంవత్సరాలు దాటడంతో పాటు ఆయనపై తీవ్రమైన వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు రావడంతో బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా తొలగించేందుకు సిద్ధమయింది. యడ్యూరప్ప తర్వాత నేత కోసం అన్వేషణను కూడా కేంద్ర నాయకత్వం మూడు నెలల క్రితమే ప్రారంభించింది. ఇద్దరి ముగ్గురి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉండటంతో కేంద్ర నాయకత్వం కూడా కొంత గ్యాప్ ఇచ్చిందంటున్నారు.

మరొకరికి ఇప్పుడే అప్పగిస్తే…..

యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా మరో రెండేళ్లు కొనసాగాల్సి ఉంది. అయితే ఇది సుదీర్ఘకాలంగా బీజేపీ కేంద్ర నాయకత్వం భావిస్తుంది. ఆయన స్థానంలో మరొకరికి పగ్గాలు అప్పజెబితే రానున్న అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తారని పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. అదే సామాజికవర్గానికి చెందిన నేతకు పగ్గాలు ఇవ్వడమా? మరో నేతను తీసుకురావడమా? అన్న దానిపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు.

మే 2వ తేదీ తర్వాత…

ఈ సంకేతాలను చూసే యడ్యూరప్ప హడావిడిగా అసంతృప్త నేతలకు వ్యతిరేకంగా సంతకాలు సేకరించారు. అయితే 65 మంది ఎమ్మెల్యేలే దీనిపై సంతకం చేశారు. మిగిలిన వారంతా అసంతృప్త నేతలగానే పరిగణించాలని యడ్యూరప్ప నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న బసవగౌడ పాటిల్ యత్నాల్ చెబుతున్నారు. మే 2వ తేదీ తర్వాత రాష్ట్రంలో నాయకత్వ మార్పు తప్పదని ఆయన హెచ్చరిిస్తున్నారు. మొత్తం మీద యడ్యూరప్పపై కేంద్ర నాయకత్వం వైఖరిలో ఎలాంటి మార్పు లేనట్లే కనపడుతుంది.

Tags:    

Similar News