అర్జంటుగా భారతిని రంగంలోకి దించాల్సిందేనా…?

వైఎస్ జగన్. మూడు అక్షరాల జగన్ ప్రత్యర్ధులను ముచ్చెరువుల నీరు తాగిస్తాడు. అది ఆయన రాజకీయ జీవితం చూసిన వారికి ఎవరికైనా అర్ధమయ్యే విషయం. ఇక జగన్ [more]

Update: 2021-04-10 12:30 GMT

వైఎస్ జగన్. మూడు అక్షరాల జగన్ ప్రత్యర్ధులను ముచ్చెరువుల నీరు తాగిస్తాడు. అది ఆయన రాజకీయ జీవితం చూసిన వారికి ఎవరికైనా అర్ధమయ్యే విషయం. ఇక జగన్ ఒంటరి పోరాటం చేశారని అంతా అంటారు. కానీ జగన్ కి అండగా ఇంటి ఆడవారే కొండగా నిలబడ్డారు. వారిలో తొలిగా తల్లి విజయమ్మ ఉన్నారు. ఆ తరువాత చెల్లెమ్మ షర్మిల జగన్ కి వెన్నంటి ఉన్నారు. నిజానికి షర్మిల వైసీపీకి చేసిన సేవ మాటలలో చెప్పలేనిది. పార్టీ ఈ రోజు ఇలా ఉంది అంటే దాని పునాదులలో షర్మిల ఉన్నారని చెప్పకతప్పదు.

అసలైన ఒంటరి ….

ఇపుడు జగన్ ఒంటరి అయ్యారు అని చెప్పాలి. జగన్ కోరుకున్న సీఎం కుర్చీ దక్కింది. ఆయన రెండేళ్ళ సీఎం గా కూడా అనుభవం గడించారు. ఇక పార్టీ ప్రస్థానం పుష్కర కాలం దాటేసింది. జగన్ అటు పాలనాపరంగా ఇటు రాజకీయాన కూడా రాటుదేలారు. అయితే ఎటు నుంచి చూసినా ఇపుడు జగన్ ఒక్కరే కనిపిస్తున్నారు. ఆయన పార్టీని చూడలేకపోతున్నారు. ముఖ్యమంత్రిగా పీకల దాకా పనులు ఉన్నాయి. దాంతో జగన్ కి తనను ముఖ్యమంత్రి సీటు దాకా చేర్చిన పార్టీని పెద్దగా పట్టించుకునే తీరికా ఓపికా రెండూ లేవు అంటున్నారు. మరో వైపు షర్మిల వేరే పార్టీ పెట్టుకుని తెలంగాణా రాజకీయ మైదానానికి పరిమితం అవుతున్నారు. విజయమ్మ ఇక రాజకీయాలకు గుడ్ బై కొట్టేస్తారు అన్న ప్రచారం ఉంది.

ఆమె రావాలి….

జగన్ సతీమణి భారతి ఈ మధ్య వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. ఆమెకు రాజకీయ ఆకాంక్షలు ఎంతవరకూ ఉన్నాయో తెలియదు కానీ ఆమె పేరు తరచూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు ప్రస్తావిస్తున్నారు. భారతికి పగ్గాలు అప్పగిస్తే ఆమె బాగా పాలిస్తారు అని కూడా కితాబు ఇస్తున్నారు. ఆయన సెటైరికల్ గా ఈ డైలాగులు వేసినా కూడా భారతి మాత్రమే ఇపుడు వైసీపీకి జగన్ కి ఆల్టర్నేషన్ గా కనిపిస్తున్నారు. ఆ మధ్య దాకా షర్మిలకు పార్టీ బాధ్యతలు అప్పగించాలని అని కోరే వారంతా కూడా ఇపుడు భారతమ్మ పార్టీని చక్కబెట్టినా బాగుండు అంటున్నారు. ఖర్మం చాలక జగన్ జైలుకే వెళ్ళాల్సి వస్తే కూడా భారతి తప్ప మరో ఆప్షన్ కూడా జగన్ కి వైసీపీ లేదు అన్నది నిజం.

కొట్టొచ్చిన లోటు….

ఇక తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక జరుగుతూంటే అన్ని పార్టీలకూ నాయకులు బోలెడు మంది ఉన్నారు. ఒక్క వైసీపీకి మాత్రం అధికారం తప్ప స్టార్ కాంపెనియర్లు లేరు. మంత్రులు చాలా మంది ఉన్నారు. కానీ వారిని చూసి వైసీపీకి ఓటేసే సీన్ లేదు అన్నది తెలిసిందే. ఇదే సమయంలో షర్మిల కనుక ఉంటే కచ్చితంగా పార్టీకి అతి పెద్ద పొలిటికల్ గ్లామర్ గా ఉండేవారు. ఆమె సుడిగాలి పర్యటన చేసి మరీ జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి కాలు కదపకుండా విజయాన్ని తెచ్చి పెట్టేవారు అన్న మాట అయితే ఉంది. టీడీపీలో చూస్తే అటు చంద్రబాబు ఇటు లోకేష్ బాబు కలియతిరిగేస్తున్నారు. క్యాడర్ బేస్డ్ పార్టీగా ఉన్న బీజేపీలో నాయకులకు కొదవలేదు కానీ జగన్ వస్తేనే తప్ప వైసీపీ ప్రచారం ఊపందుకోని దుస్థితి వైసీపీకి దాపురించింది అంటే దానికి జగనే కారణం అంటున్నారు. జగన్ రెండవ నాయకత్వం ఎదిగితే తనకు ఇబ్బంది అని భావించారో ఏమో షర్మిల దూరం అయ్యారని కూడా ప్రచారంలో ఉంది. అందువల్ల తన సతీమణి భారతినైనా ఈ సమయంలో రంగంలోకి దింపితే అది జగన్ కీ పార్టీకి మేలు అంటున్న వారూ పెరుగుతున్నారు. మరి జగన్ దీని మీద ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

Tags:    

Similar News