ఇద్దరూ అంతేనా.. పక్క రాష్ట్రాలను చూసైనా నేర్చుకోరా?

పొరుగు రాష్ట్రాల్లో ఫలితాలు చూసైనా ఏపీ నేతలు రాజకీయ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. తమిళనాడు, కేరళలో వచ్చిన ఫలితాలయినా వీరిలో మార్పును తేలేకపోయాయి. ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ [more]

Update: 2021-05-21 05:00 GMT

పొరుగు రాష్ట్రాల్లో ఫలితాలు చూసైనా ఏపీ నేతలు రాజకీయ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. తమిళనాడు, కేరళలో వచ్చిన ఫలితాలయినా వీరిలో మార్పును తేలేకపోయాయి. ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ అధినేత జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు లిద్దరూ పరస్పరం విమర్శలు చేసుకోవడం మినహా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఇద్దరు నేతలు జంకుతున్నారు.

వ్యతిరేకత ఉందని…..

మోదీ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతుందని వివిధ ఫలితాల ద్వారా వెల్లడవుతుంది. తమిళనాడులో స్టాలిన్ మోదీ, షాలను తన ఎన్నికల ప్రచారంలో తూర్పార పట్టారు. ఇద్దరినీ వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేశారు. కానీ అక్కడ ప్రజలు స్టాలిన్ వైపు మొగ్గు చూపారు. కానీ ఏపీలో మాత్రం చంద్రబాబు, జగన్ ఇది చూసైనా కనీసం మోదీని వ్యక్తిగతంగా కాకపోయినా ప్రభుత్వ వైఖరిని నిలదీయకపోవడం విచిత్రంగా చెప్పుకోవాలి.

కేసులు పెట్టినా…?

ఇక కేరళలోనూ పినరయివిజయన్ పై గోల్డ్ స్కాం కేసు పెట్టారు. ఆయనపై అవినీతి ఆరోపణలు చేశారు. కానీ పినరయి విజయన్ అఖండ మెజారిటీతో గెలిచారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ప్రజలు పినరయి వైపే నిలబడ్డారు. ఇక్కడ కూడా జగన్ తన కేసులకోసం భయపడాల్సిన పనిలేదని ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారు చెబుతూనే ఉన్నారు. అయినా బీజేపీని పన్నెత్తు మాట అనకపోవడం చర్చనీయాంశంగా మారింది.

స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై….?

ఒకవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. కార్మికులు కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. జగన్ ప్రధానికి లేఖ రాసి చేతులు దులుపుకున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ఆ లేఖకు ప్రధాని నుంచి రిప్లై కూడా లేదు. ఇక చంద్రబాబు ప్రయివేటీకరణ చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని కాకుండా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా ఇద్దరు నేతలు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఉమ్మడి పోరాటం చేస్తేనే భవిష్యత్ ఉంటుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

Tags:    

Similar News