వారసులకు నో ఛాన్స్ అంటున్న జగన్…ఇదే ఎగ్జాంపుల్
తండ్రులు ఘనత వహించిన రాజకీయ నాయకులు. ఇంకేం వారసత్వం అతి పెద్ద అండగా ఉంది దూసుకుపోవచ్చు అనుకున్నారు. కానీ చివరికి అనుకున్న పదవులు దక్కక వట్టి కార్పోరేటర్లుగానే [more]
తండ్రులు ఘనత వహించిన రాజకీయ నాయకులు. ఇంకేం వారసత్వం అతి పెద్ద అండగా ఉంది దూసుకుపోవచ్చు అనుకున్నారు. కానీ చివరికి అనుకున్న పదవులు దక్కక వట్టి కార్పోరేటర్లుగానే [more]
తండ్రులు ఘనత వహించిన రాజకీయ నాయకులు. ఇంకేం వారసత్వం అతి పెద్ద అండగా ఉంది దూసుకుపోవచ్చు అనుకున్నారు. కానీ చివరికి అనుకున్న పదవులు దక్కక వట్టి కార్పోరేటర్లుగానే మిగిలిపోయారు. విశాఖ విజయనగరం జిల్లాలల్లో ఇద్దరు వైసీపీ ప్రముఖుల కుమార్తెలు కార్పొరేషన్ ఎన్నికల బరిలో దిగినపుడు అంతా ఏవేవో అనుకున్నారు. చివరికి మాత్రం ఏమీ కాకుండానే వారి రాజకీయ కధ చప్పగా సాగుతోంది. విశాఖకు చెందిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుమార్తె తో పాటు విజయనగరం వైసీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి తనయ కూడా కార్పొరేషన్ బరిలో నిలిచి గెలిచారు.
మేయర్ అనుకుంటే…?
కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె విషయానికి వస్తే ఆమెను మేయర్ కావాలనే బరిలోకి దించారు. తన రాజకీయానికి సహకారం అందిస్తూ దూకుడుగా సాగుతున్న శ్రావణిని మేయర్ గా చూసుకోవాలని స్వామి తెగ తపనపడ్డారు. కానీ సొంత పార్టీలో తన ప్రత్యర్ధి మంత్రి బొత్స సత్యనారయాణ చక్రం తిప్పేసి బీసీ మహిళకు మేయర్ సీటుని రిజర్వ్ చేయించారని టాక్. దాంతో కనీసం డిప్యూటీ మేయర్ అయినా చేయాలని ఉబలాటపడ్డారు. కానీ ఆ పదవి కూడా బీసీలకే వైసీపీ అధినాయకత్వం కట్టబెట్టింది. దాంతో కాలికి బలపం కట్టుకుని విజయనగరం అంతటా తండ్రీ కూతురూ తిరిగి వైసీపీని గెలిపించినా ఫలితం మాత్రం దక్కలేదు అన్న బాధ అయితే క్యాడర్ లో ఉంది.
ఇక్కడా డిటో …
ఇక విశాఖ మంత్రి ముత్తంశెట్టి కూతురు డాక్టర్ చదివిన ప్రియాంక కూడా జస్ట్ కార్పోరేటర్ అనిపించుకున్నారు. ఆ పదవి కోసం ఇంత శ్రమపడాలా అన్న చర్చ కూడా వస్తోంది. విశాఖ మేయర్ బీసీ జనరల్ కి రిజర్వ్ అయింది. దాంతో తన కుమార్తెకు కచ్చితంగా డిప్యూటీ మేయర్ పదవి ఖాయమని మంత్రి భావించారు. కానీ వైసీపీ హై కమాండ్ ఎక్కడా ఆ చాన్స్ ఇవ్వలేదు. పదవులు అన్నీ బలహీన వర్గాలకే తప్ప వారసులకు కావని పక్కా క్లారిటీగా చెప్పేసింది. దీంతో మంత్రి కుమార్తె వట్టి కార్పొరేటర్ గానే మిగిలిపోవాల్సివచ్చింది అని అనుచరులు బాధపడుతున్నారు.
ఇదే సంకేతమా…?
అసలు లోకల్ బాడీ ఎన్నికల్లో వారసులను దించవద్దు అని జగన్ కచ్చితమైన ఆదేశాలు జారీ చేసినా చాలా చోట్ల మాట ధిక్కరించి మరీ టికెట్లు ఇచ్చారు. ఇక తమ వారి కోసం తిరుగుతూ అసలు పార్టీని కొన్ని చోట్ల గాలికి వదిలేసారు. అయితే జగన్ మాత్రం ఒకే కుటుంబానికి అన్ని పదవులూ ఇవ్వడానికి విముఖం అని చెబుతారు. అందుకే ఆయన ఇంతకు ముందు ఎన్నడూ పదవుల రుచి ఎరగని బడుగు బలహీన వర్గాలకే వాటిని కట్టబెట్టి కొత్త సంప్రదాయానికి తెర తీశారు. కేవలం ఈ ఇద్దరు నాయకుల వారసులకే కాదు, చాలా మంది పెద్ద నేతల కుటుంబీకులను కూడా పక్కన పెట్టేశారు. ఈ పదవులతో వారు సొంతంగా ఎదిగి గట్టి నేతలు అనిపించుకుంటే ఫ్యూచర్ లో పెద్ద పదవులు అవే వెతుక్కుని వస్తాయని వైసీపీ పెద్దలు సూచిస్తున్నారు.