జగన్ ఆ పనిచేయగలుగుతారా?
వైఎస్ జగన్ కు వచ్చే ఎన్నికల్లో మద్యనిషేధం ప్రతిబంధకంగా మారనుంది. కరోనా వైరస్ గత రెండేళ్ల నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది. ప్రభుత్వ ఆదాయం దారుణంగా [more]
వైఎస్ జగన్ కు వచ్చే ఎన్నికల్లో మద్యనిషేధం ప్రతిబంధకంగా మారనుంది. కరోనా వైరస్ గత రెండేళ్ల నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది. ప్రభుత్వ ఆదాయం దారుణంగా [more]
వైఎస్ జగన్ కు వచ్చే ఎన్నికల్లో మద్యనిషేధం ప్రతిబంధకంగా మారనుంది. కరోనా వైరస్ గత రెండేళ్ల నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది. ప్రభుత్వ ఆదాయం దారుణంగా పడిపోయింది. వరసగా రెండేళ్ల నుంచి కరోనా వైరస్ కారణంగా జగన్ ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేయాల్సి వస్తుంది. కరోనా దారుణంగా దెబ్బతీసినా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను మాత్రం జగన్ నిలిపివేయాలేదు.
రెండేళ్ల అధికారంలో…..
జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తుంది. ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు పరుస్తున్నారు. దాదాపు 90 శాతం హామీలను ఇప్పటికే జగన్ అమలు పర్చారన్న ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ పేద ప్రజలకు అండగా ఉంటానని, వారికి భరోసా కల్పిస్తానని చెబతూ ఇచ్చిన మాటను జగన్ నిలబెట్టుకుంటున్నారు. దీంతో జగన్ నాయకత్వంపైనా, ఆయన మాటలపైన ప్రజల్లో విశ్వాసం నెలకొంది.
మద్యం దుకాణాలను…
అయితే రాష్ట్రానికి ప్రధాన ఆదాయవనరుగా ఇప్పుడు మద్యం షాపులే ఉన్నాయి. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రయివేటు మద్యం దుకాణాలను తొలగించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు. పనివేళలు కూడా తగ్గించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే మద్యం దుకాణాలను నిర్వహిస్తున్నారు. 4వేలకు పైగా ఉన్న మద్యం దుకాణాలను రెండు వేల వరకూ తగ్గించారు. బెల్ట్ షాపులను తొలగించారు. మద్యం ధరలను కూడా విపరీతంగా పెంచారు. అలాగయినా మద్యానికి దూరమవుతారని ధరలను పెంచామని ప్రభుత్వం చెబుతోంది.
ఆర్థిక పరిస్థితి దృష్ట్యా…..
దీంతో జగన్ ఏపీలో సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తారన్న నమ్మకం ప్రజల్లో ఉంది. ప్రధానంగా మహిళలను ఆకట్టుకునే పథకాలను ప్రవేశపెట్టిన జగన్ మద్యనిషేధాన్ని కూడా అమలుపరుస్తారని భావించారు. తాను దశల వారీగా మద్యనిషేధాన్ని అమలు పరుస్తానని చెప్పిన జగన్ ఇప్పటి వరకూ అలాంటి ప్రయత్నాలకు పూనుకోలేదు. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోతుందనే. ఇప్పుడు ఇంకా మూడేళ్లే మిగిలింది. కరోనాతో సతమతమవుతున్న రాష్ట్రాలో సంపూర్ణ మద్యనిషేధం సాధ్యాసాధ్యాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. అయితే జగన్ మొండి వైఖరి ఉన్నవారు కనుక తప్పనిసరిగా అమలుపరుస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు.