జగన్ ఫోటో ఉంటే చాలట ?
గత రెండేళ్ళుగా జగన్ తాడేపల్లిలోని తన ఇంటి నుంచి అడుగు తీసి బయటకు పెట్టలేదు. ప్రత్యేకించి కీలకమైన ఎన్నికల వేళ కూడా ఒక మీటింగ్ అయినా నిర్వహించలేదు. [more]
గత రెండేళ్ళుగా జగన్ తాడేపల్లిలోని తన ఇంటి నుంచి అడుగు తీసి బయటకు పెట్టలేదు. ప్రత్యేకించి కీలకమైన ఎన్నికల వేళ కూడా ఒక మీటింగ్ అయినా నిర్వహించలేదు. [more]
గత రెండేళ్ళుగా జగన్ తాడేపల్లిలోని తన ఇంటి నుంచి అడుగు తీసి బయటకు పెట్టలేదు. ప్రత్యేకించి కీలకమైన ఎన్నికల వేళ కూడా ఒక మీటింగ్ అయినా నిర్వహించలేదు. తమ పార్టీకి ఓటేయాలని వీధుల్లోకి వచ్చి జనాలను అభ్యర్ధించలేదు. కానీ అన్ని ఎన్నికల్లోనూ ఆయనదే విజయం. జగన్ పేరు చెబితే ఓట్ల వర్షం కురుస్తోంది. ఆయన ఫోటో చూపిస్తే చాలు జనాలు భారీ మెజారిటీలు ఇస్తున్నారు. ఇది లోకల్ బాడీ ఎన్నికల నుంచి తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక దాకా సాగుతూ వస్తోంది.
ప్రత్యర్ధులు హడల్….
ప్రత్యర్ధులకు జగన్ బయటకు వచ్చినా వణుకే. ఆయన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో ఉన్నా హడలే. తిరుపతిలో ఉప ఎన్నికల వేళ జగన్ బహిరంగ సభ నిర్వహిస్తారు అన్న వార్త వచ్చినపుడు టీడీపీ నుంచి ఎన్ని కామెట్స్ వచ్చాయో అందరికీ తెలిసిందే. మా ధాటికి తట్టుకోలేకే జగన్ ఇలా ఓట్ల వేటకు బయల్దేరారు అని అన్నారు. పెదబాబు, చినబాబు అయితే జగన్ని తాడేపల్లి నుంచి కాలు బయటకు పెట్టించామని తెగ పొంగారు. అదే జగన్ టూర్ క్యాన్సిల్ అయితే మా సవాల్ స్వీకరించలేక రద్దు చేసుకున్నారు ఇదే నేతలు ప్రచారం చేశారు. మొత్తానికి జగన్ ప్రచారం చేయలేదు అన్న మాటే కానీ టీడీపీ సహా విపక్షాలు ఆయన నామస్మరణలోనే తరించి కావాల్సినతగా చేసిపెట్టాయని చెప్పాలి.
బాగా సాధించారే ..?
ఎన్టీయార్ లాంటి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు కూడా హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఆ తరువాత స్థానిక ఎన్నికల్లోనూ ఆయన ఊరూరా తిరిగిన చరిత్ర ఉంది. ఇక బీజేపీ ప్రస్తుత నేతలు మోడీ, అమిత్ షా వంటి వారు ఏ చిన్న ఎన్నిక అయినా అక్కడకు వచ్చి వాలిపోతున్నారు. ప్రచారం గట్టిగా చేస్తున్నారు. కేసీయార్ తీరు చూస్తే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల కోసం బహిరంగ సభ పెట్టి ఓట్లను అర్ధించారు. మరి దేశంలో కీలకమైన నేతల తీరు ఇలా ఉంటే ఒక్క జగనే వీరికంటే భిన్నం అనిపించుకున్నారు. తాను రాకుండానే భారీ విజయాలు పార్టీకి దక్కేలా చూసుకుంటున్నారు అంటే గ్రేట్ అనక తప్పదు.
కనెక్టివిటీ అలా…?
జనం గుండె చప్పుడుగా ఏ నేత అయినా ఉంటే వారు వీధుల్లోకి వచ్చి ఓట్లు అడగాల్సిన అవసరం ఉండదు. ఎమ్జీఆర్ అమెరికా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రచారానికి దూరంగా ఉన్నా కూడా తమిళనాడులో అప్పట్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పార్టీ బంపర్ మెజారిటెతో గెలిచింది. అంటే జనాలు అంతలా తమ సొంతం చేసుకున్నారు అన్న మాట. ఎమ్జీయార్ తో పోల్చడం కాదు కానీ ఏ నాయకుడు అయినా కృషి చేస్తే ప్రజానాయకుడు అవడం అన్నది అసాధ్యం కాదు. జగన్ ఇపుడు అదే పనిలో అడుగులు వేస్తున్నారు. ఫ్యూచర్ లో కూడా తాను లేకుండా రాకుండా అయినా పార్టీ గెలిచేలా ఇప్పటి నుంచే గట్టిగానే వ్యూహాలు రచిస్తున్నారు అనుకోవాలి. అంటే ఇక మీదట జగన్ ఫోటోలే ప్రచారం చేస్తాయన్న మాట.