ఏకిపారేస్తున్నారు జగన్…..ఇలాగెందుకు?

ఆది నుంచి పార్టీలో ఉన్న వారికే పదవులు అంటూ ఆర్భాటంగా కబుర్లు చెప్పారు. వైసీపీ జెండాను నమ్ముకున్న వారికే కిరీటాలు అంటూ చాలానే మట్లాడారు. కానీ తీరా [more]

Update: 2021-08-07 12:30 GMT

ఆది నుంచి పార్టీలో ఉన్న వారికే పదవులు అంటూ ఆర్భాటంగా కబుర్లు చెప్పారు. వైసీపీ జెండాను నమ్ముకున్న వారికే కిరీటాలు అంటూ చాలానే మట్లాడారు. కానీ తీరా చూస్తే ఇతర పార్టీల నుంచి జంపింగ్ జఫాంగులకు పదవులు ఇచ్చి అయిన వారికి ఆకులు చేతికి ఇచ్చారని వైసీపీలో సీనియర్లు కొందరు మండిపడుతున్నారు. అస‌లు ఇప్పుడే కాదు … జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిన‌ప్ప‌టి నుంచి ఇదే తంతు న‌డుస్తోంది. ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి ఓడిన నేత‌లు… ఒక‌టి రెండు నెల‌ల క్రితం పార్టీలోకి వ‌చ్చిన వారికే కీల‌క ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టేస్తున్నారు. విజయనగరం జిల్లా వరకూ చూస్తే శోభా స్వాతిరాణిని ఏకంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన జీసీసీ చైర్ పర్సన్ పదవిని ఇచ్చి గౌరవించారు. ఆమె పార్టీలో ఎపుడు చేరింది అన్నది ఎవరికీ తెలియదు. ఆమె లోకల్ బాడీ ఎన్నికలకు ముందు అంటే ఇప్పటికి గట్టిగా అయిదారు నెలల ముందు వైసీపీలో చేరారు. మరి ఆమె పార్టీకి చేసిన సేవ ఏంటి అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి.

ఆది నుంచి ఉన్నవారికి…

వైసీపీని నమ్ముకుని సుదీర్ఘకాలం కొమ్ము కాసిన సీనియర్లు లేరా అన్న మాట కూడా వినిపిస్తోంది. గిరిజన నాయకులలో ఇప్పటికి చాలా మంది పదవులు కోసం అర్రులు చాస్తున్నారు. అరకు నుంచి పోటీకి చివరి దాకా ప్రయత్నం చేసి అధినాయకత్వం హామీతో విరమించుకున్న మాజీ ఎమ్మెల్శే శెట్టి గంగాధరస్వామికి ఉత్త చేయి చూపించారని ఆయన అనుచరులు కస్సుమంటున్నారు. ఆ ఇచ్చే జీసీసీ పదవి ఏదో తమ నేతకు ఇస్తే ఏం పోయింది అన్న మాట కూడా వారి నుంచి వినిపిస్తోంది. అయితే వైసీపీలో పెద్ద తలకాయ ఒకరు దూరి ఆమెను పార్టీలోకి తెచ్చారని, ఆయన పుణ్యమే ఈ పదవి కూడా అంటున్నారు. అంతలా ఆదరించి అక్కున చేర్చుకున్నా కూడా స్వాతి వల్ల పార్టీకి కొత్తగా వచ్చే లాభం ఏంటి అన్న ప్రశ్నను కూడా చాలా మంది సంధిస్తున్నారు.

వైఎస్ హయాం నుంచి….

ఇక వైఎస్సార్ హయాం నుంచి కూడా వైసీపీ కోసం పనిచేస్తూ మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న సాలూరుకి చెందిన రాజన్నదొరకు ఏ పదవీ ఇంతవరకూ ఇవ్వలేదని ఆయన అభిమానులు గుర్తు చేస్తున్నారు. ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి కూడా వ‌స్తుంద‌న్న గ్యారెంటీ లేద‌ని చెపుతున్నారు. ఇక ఆయ‌న సినియార్టీకి ఏం ఉప‌యోగం అని వైసీపీ నేత‌లే ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోవ‌డంతో పాటు జ‌గ‌న్‌ను తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టిన తోట త్రిమూర్తులు బంప‌ర్ ఆఫ‌ర్లు కొట్టేశారు.

సొంత సోషల్ మీడియాలోనే…?

ఆయ‌న‌కు ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా మూడు ప‌ద‌వులు క‌ట్ట‌బెట్ట‌డంతో వైసీపీ వ‌ర్గాలు నోరెళ్ల బెడుతున్నాయి. పార్టీలో చేరిన వెంట‌నే త్రిమూర్తుల‌కు అమ‌లాపురం పార్ల‌మెంట‌రీ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి ఇచ్చేశారు. ఆ వెంట‌నే మండ‌పేట ఇన్‌చార్జ్ ప‌ద‌వి ఇచ్చారు. ఇక తాజాగా త్రిమూర్తులుకు ఎమ్మెల్సీ ఇచ్చారు. అస‌లు వైసీపీ ఆవిర్భావం నుంచి ఎంతో క‌ష్ట‌ప‌డిన వాళ్ల‌కు ఒక్క ప‌ద‌వే లేదు… కానీ ఇలాంటి నేత‌ల‌కు మూడు ప‌ద‌వులా ? అని పార్టీ నేత‌లు గ‌గ్గోలు పెడుతున్నారు. ఇక నామినేటెడ్ ప‌ద‌వుల్లో పార్టీ మారిన వాళ్ల లిస్టును వైసీపీ వాళ్లే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే మాత్రం వైసీపీలో కాని వాళ్ళకు కంచాలు వేసి విందు చేస్తున్నారు అని క్యాడర్ మండుతోంది మరి.

Tags:    

Similar News