కమ్మ యాగం జరుగుతోందా? బలయిపోవాల్సిందేనా?

ఏపీలో కుల రాజ‌కీయమే సాగుతుంది. ఈ మాట కాదనే వారికి అసలు పాలిటిక్స్ మీద అవగాహన లేదనుకోవాలి. వారు మారినా, వీరు వచ్చినా వెనక కులం ట్యాగ్ [more]

Update: 2020-04-20 08:00 GMT

ఏపీలో కుల రాజ‌కీయమే సాగుతుంది. ఈ మాట కాదనే వారికి అసలు పాలిటిక్స్ మీద అవగాహన లేదనుకోవాలి. వారు మారినా, వీరు వచ్చినా వెనక కులం ట్యాగ్ కనిపిస్తుంది. ఎటువంటి మొహమాటం లేకుండా చెప్పుకోవాలంటే ఏపీలో కమ్మ, రెడ్లు రాజ్యాలను ఒకరి తరువాత ఒకరు ఏలుతున్నారు ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి ఈ కులాల నాటకం సాగుతూనే ఉంది. గతంలో గుట్టుగా సాగింది. ఇపుడు రట్టుగా, రచ్చగా మారింది. ఒక ఎన్నికతో ఏ రాజకీయ పార్టీ పతనం కాదు, అలాగే తాము కోరుకున్న పార్టీ అధికారంలోకి రాకపోతే నమ్ముకున్న కులమూ పాడైపోదు. కానీ ఏపీలో మాత్రం కమ్మ సామాజికవర్గం ఎందుకో తెగ ఆందోళన పడుతోంది.

అలా మొదలు…..

ఈ మధ్య కమ్మ సామాజిక వర్గంలోని రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు అంతా కలసి వాట్సప్ మీటింగు పెట్టుకున్నారుట. అది కూడా కరోనా మహమ్మారి యావత్తూ ప్రపంచాన్ని అతలాకులతం చేస్తున్న వేళట. అలా జరిగిన ఈ మీటింగుకు ఎంతో ప్రాధాన్యత వచ్చిందని అంటారు. ఏపీలో చంద్రబాబు ఓడిపోయి జగన్ రావడంతోనే కమ్మ సామాజికవర్గం నేతలు సగానికి సగం బలహీనమయ్యారు. ఇపుడు కరోనా మహమ్మారి ముంచుకువచ్చి మొత్తానికి ఊడ్చేసిందన్నది వారి ఆవేదన. ఎందుకంటే కమ్మవారికి చెందిన వ్యాపారాల పైనే కరోనా ప్రభావం దీర్ఘకాలం ఉంటుందని అంచనా. సినిమా హాళ్ళు, హొటళ్ళు, టూరిజం, రియల్ ఎస్టేట్, మీడియా వంటి వాటి మీద గుత్తాధిపత్యం కమ్మలదే.

ఇదీ నేపధ్యం …..

ఇక ఏపీలో చూసుకుంటే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కమ్మ సామాజికవర్గాన్ని టార్గెట్ చేశాడని వారికి ఆగ్రహంగా ఉంది. కమ్మలకు చెందిన వ్యాపారాలు ఎదగరాదనే వైసీపీ సర్కార్ నిర్మాణ రంగాన్ని పడుక్కోబెట్టిందని అంటారు. అలాగే ఇంగ్లీష్ బోధన సర్కార్ బడులలో ప్రవేశ పెట్టడం. మధ్య పాన నిషేధం అమలు, పోలవరం అవినీతి వెలికితీత‌, అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేయడం ఇలాంటివి కమ్మ సామాజికవర్గాన్ని ఆర్ధికంగా పెద్ద దెబ్బ కొట్టాయని అంటారు. దీనికి తోడు రాజకీయంగా జగన్ కమ్మ వారిని అణగదొక్కేలా చర్యలకు దిగుతున్నాడని అనుమానిస్తున్నారు. ఇది గతంలో ఎన్నడూ లేనిది. అప్పట్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఆఖరుకు వైఎస్సార్ సీఎం అయినా కూడా కమ్మలకు ఏ విధమైన ఇబ్బంది లేకపోయింది. కానీ జగన్ ఏకంగా సర్పయాగమే చేస్తున్నాడని, ఇది పుట్టె ముంచుతోందని కమ్మ వర్గం కలవరపడుతోంది.

రాయపాటి నోట….

వీటికి తోడు పులి మీద పుట్రలా కరోనా వైరస్ ఏపీని తాకింది. అంతే కాదు, ప్రపంచంలో కూడా వీర విహారం చేస్తోంది. కమ్మ వారికి ఆర్ధిక నిచ్చెనగా ఉన్న అమెరికా సైతం ఇపుడు ప్రమాదంలో పడింది. దీంతో ప్రభుత్వాల ఆసరా లేకుంటే మళ్ళీ ఏ మాత్రం లేవలేని దుస్థితిలోకి కమ్మవారు చేరుకుంటారన్నది నిజం. దాంతోనే కాస్తా బెదిరింపు ధోరణిలోనే పెద్దాయన రాయపాటి సాంబశివరావు జగన్ మీద విరుచుకుపడ్డారని అంటున్నారు. మమ్మల్ని తొక్కితే చాలా కష్టమని, మీకే ఇబ్బందని కూడా తన మాటల ద్వారా పరోక్షంగా చెప్పారని అంటున్నారు. ఎలా చూసుకున్నా కూడా కమ్మ సామాజిక వర్గానికి ఇపుడు రాజకీయంగా ఊతం కావాలి. ప్రభుత్వాల సానుకూలత కావాలి. కోరలు చాచి భారీ దెబ్బ కొట్టేసిన కరోనాని ఏమీ అనలేరు. అందుకే రాజకీయంగానే తేల్చుకోవడానికి కమ్మ సామాజికవర్గం నేతలు తయారవుతున్నారుట. మరి జగన్ దీనికి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.’

Tags:    

Similar News