జగన్ పక్కన పెట్టేశారు.. ఆమె చేతులు కాల్చుకోవాల్సిందేనా?
రాజకీయాల్లో శత్రుత్వం కన్నా మిత్రులు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. శత్రువులు ఎక్కువయ్యే కొద్దీ సమస్యలు పెరుగుతాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇదే సూత్రాన్ని పాటిస్తున్నట్లుంది. ఇటు కేంద్ర [more]
రాజకీయాల్లో శత్రుత్వం కన్నా మిత్రులు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. శత్రువులు ఎక్కువయ్యే కొద్దీ సమస్యలు పెరుగుతాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇదే సూత్రాన్ని పాటిస్తున్నట్లుంది. ఇటు కేంద్ర [more]
రాజకీయాల్లో శత్రుత్వం కన్నా మిత్రులు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. శత్రువులు ఎక్కువయ్యే కొద్దీ సమస్యలు పెరుగుతాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇదే సూత్రాన్ని పాటిస్తున్నట్లుంది. ఇటు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నప్పటికీ భవిష్యత్ రాజకీయ అవసరాల కోసం పొరుగు రాష్ట్రం నేతల అవసరం ఎప్పటికైనా వస్తుందని జగన్ గ్రహించారు. అందుకే తెలంగాణలో వైసీపీని నిర్వీర్యం చేసేందుకే డిసైడ్ అయ్యారు.
కేసీఆర్ తో వైరం…..
తెలంగాణలో టీడీపీ లాగానే వైసీపీ కాకూడదనుకున్నారు జగన్. టీడీపీ అనేక ఎన్నికల్లో పోట ీ చేసి ఓటమి పాలయి ఇబ్బంది పడుతుంది. పైగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకూడదన్నది జగన్ అభిప్రాయం. తనను బయటకు గెంటేసిన కాంగ్రెస్ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రాకూడదనే తొలినుంచి జగన్ కేసీఆర్ కు దగ్గరవుతూ వస్తున్నారు. అనేక సార్లు కేసీఆర్ తో భేటీ అయిన జగన్ రెండు రాష్ట్రాల సమస్యలపై చర్చించారు.
ఇద్దరిదీ ఒకే కోరిక…..
కేసీఆర్ కూడా జగన్ ప్రమాణస్వీకారానికి హాజరై ఆశీర్వదించారు. ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయి. జలవివాదాలు అప్పడప్పుడూ తలెత్తుతున్నా అది పైకి మాత్రమేనంటారు. లోపల మాత్రం జగన్ ఏపీలో స్థిరంగా కొనసాగాలని కేసీఆర్ భావిస్తారు. అలాగే జగన్ కూడా తెలంగాణలో కేసీఆర్ కుటుంబమే ఉండాలని కోరుకుంటారు. అందుకే తెలంగాణలో వైసీపీని పూర్తిగా జగన్ పడుకోబెట్టేశారు.
షర్మిల పార్టీ పెట్టినా…..
ఇప్పుడు షర్మిల కొత్త పార్టీ పెడుతున్నది కూడా అందుకేనంటారు. వైసీపీని తెలంగాణలో బలోపేతం చేయడం ఇష్టపడని జగన్ ఆ ప్రతిపాదనను అంగీకరించకపోవడంతో షర్మిల కొత్త పార్టీవైపు మొగ్గు చూపారు. ఇప్పుడు వైసీపీ నేతలు కూడా మూకుమ్మడిగా షర్మిల పార్టీలోకి వచ్చే అవకాశాలు లేవనే చెప్పాలి. షర్మిల జగన్ మాట వినకుండా కొత్తగా పార్టీ పెడితే చేతులు కాల్చుకోవాల్సిందేనన్న వ్యాఖ్యలు ఆ పార్టీ నుంచే విన్పిస్తున్నాయి.