వైఎస్ ఫార్ములా లోనే జగన్
స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి స్థానిక ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉండేవారు. ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్యెల్యేలు, ఎంపీలు మరీ ముఖ్యంగా స్థానిక క్యాడర్ కి టికెట్ల [more]
స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి స్థానిక ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉండేవారు. ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్యెల్యేలు, ఎంపీలు మరీ ముఖ్యంగా స్థానిక క్యాడర్ కి టికెట్ల [more]
స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి స్థానిక ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉండేవారు. ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్యెల్యేలు, ఎంపీలు మరీ ముఖ్యంగా స్థానిక క్యాడర్ కి టికెట్ల ఎంపిక నుంచి గెలుపు వరకు పూర్తి బాధ్యతలు అప్పగించేవారు. ఇదే ఫార్ములాను వైఎస్ జగన్ సైతం స్థానిక ఎన్నికల్లో అనుసరించారు. ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్ సన్ లోకేష్ లు రోడ్డెక్కి రోడ్డుషో లతో ప్రచారం హోరెత్తించినా సైలెంట్ గా రాజధానిలోనే ఉండి ఈ ఎన్నికలను పట్టించుకోనట్లే ఉన్నారు.
పార్టీ ముఖ్యులంతా…..
కానీ పార్టీ ముఖ్యులకు స్థానిక నేతల నిర్ణయాలకు జగన్ పూర్తి స్వేచ్చని ఇచ్చారు. దాంతో గెలుపు గుర్రాలను వెతికి పట్టుకోవడం అధికారపార్టీకి సులువు అయ్యింది. అదే టిడిపి లో విజయవాడ వంటి ప్రతిష్టాత్మక కార్పొరేషన్ లో ఏర్పడిన వివాదంలో అధిష్టానం నేరుగా జోక్యం చేసుకోవాలిసి వచ్చింది. అంతా చంద్రబాబు కనుసన్నల్లోనే జరగడం కొంప ముంచిందని ఆ పార్టీ వర్గాలే వాపోతున్నాయి.
సంబంధం లేని అజెండాతో …..
స్థానిక ఎన్నికలు అంటేనే కేంద్ర, రాష్ట్ర సమస్యలతో సంబంధం లేని అజెండా తో జరిగేవి. కానీ ఎపి లో విపక్షాలు మాత్రం కేంద్ర రాష్ట్ర సమస్యలనే స్థానిక ఎన్నికల అజండాగా ముందుకు తెచ్చి ఘోరంగా దెబ్బతిన్నాయి. స్టీల్ ప్లాంట్, అమరావతి, మూడు రాజధానులు, పోలవరం, హిందూ దేవాలయాలపై దాడులు ఇలా స్థానికంగా ప్రజలకు సంబంధం లేని అంశాలనే ఈ యుద్ధంలో ప్రచార అస్త్రాలుగా చేసుకుని అధికార వైసిపి పై దాడి మొదలు పెట్టాయి. ఇక్కడే వ్యూహాత్మకంగా జగన్ అడుగులు వేసి ప్రత్యర్థులకు తిరుగులేని షాక్ ఇచ్చారు. ఇప్పటివరకు పురపాలికల్లో తమ ప్రభుత్వం చేసింది, చేయాలిసింది చెప్పుకొస్తూ జగన్ సర్కార్ సంక్షేమ కార్యక్రమాల చిట్టాను ప్రజల్లోకి క్యాడర్ ద్వారా బలంగా తీసుకువెళ్ళింది. ఇది అధికార పక్షానికి బాగా వర్క్ అయితే విపక్షాలకు చుక్కలు చూపించేలా చేసింది.