సీనియర్లతో చికాకులు తప్పవా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ యువనేతలకే ఎక్కువ ప్రోత్సాహం ఇస్తున్నారు. తన కేబినెట్ లోనూ 80 శాతం మంది యువకులకే మంత్రిపదవులను ఇచ్చారు. పెద్దల సభలో మాత్రం కొందరు [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ యువనేతలకే ఎక్కువ ప్రోత్సాహం ఇస్తున్నారు. తన కేబినెట్ లోనూ 80 శాతం మంది యువకులకే మంత్రిపదవులను ఇచ్చారు. పెద్దల సభలో మాత్రం కొందరు [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ యువనేతలకే ఎక్కువ ప్రోత్సాహం ఇస్తున్నారు. తన కేబినెట్ లోనూ 80 శాతం మంది యువకులకే మంత్రిపదవులను ఇచ్చారు. పెద్దల సభలో మాత్రం కొందరు సీనియర్లను పంపుతున్నారు. రానున్న జగన్ కేబినెట్ లో సీనియర్లకు చోటు దక్కే అవకాశం లేదనే అంటున్నారు. వారికి గౌరవప్రదమైన పదవులు ఇచ్చేందుకు జగన్ రెడీ అయిపోయారంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఎన్నికల కేబినెట్ కావడంతో వయసు పైబడిన వారిని పక్కన పెడతారని భావిస్తున్నారు.
కొందరికే అవకాశం….?
ప్రస్తుతం జగన్ కేబినెట్ లో బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రంగనాధరాజు వంటివారు తప్పించి మిగిలిన వారంతా యువకులు. అయితే అనేక మంది సీనియర్లు రెండున్నరేళ్ల తర్వాత జరగనున్న విస్తరణలో అవకాశం వస్తుందని భావిస్తున్నారు. జగన్ మాత్రం సీనియర్లకు అవకాశం ఇవ్వకూడదని, పార్టీలో వారికి ఉన్నత పదవులు ఇచ్చి ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకోవాలని భావిస్తున్నారని తెలుస్తోంది.
అనేక మంది వెయిటింగ్…?
సిక్కోలు నుంచి చిత్తూరు వరకూ అనేక మంది సీనియర్లు మంత్రి పదవుల కోసం వెయిట్ చేస్తున్నారు. ధర్మాన ప్రసాదరావు, ఆనం రామనారాయణరెడ్డి, వెంకట్రామిరెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, పార్థసారధి వంటి సీనియర్ నేతలు మంత్రి పదవులు తమకు దక్కుతాయని భావిస్తున్నారు. అయితే జగన్ ఆలోచన మరో విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న రెండున్నరేళ్లు పాలనను పరుగులు పెట్టించాల్సి ఉంది.
ఇవ్వకపోతే…?
కరోనా ఇప్పట్లో వదిలేట్లులేదు. ఈ పరిస్థితుల్లో సీనియర్ నేతల కంటే యువ నాయకులే బెటర్ అని జగన్ భావిస్తున్నారు. సీనియర్ నేతలకు ఆల్టర్నేటివ్ గా కేబినెట్ ర్యాంకు హోదా కలిగిన పదవి ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. వారికి ఆ పదవి ఇచ్చి ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకోవాలని భావిస్తున్నారట. దీంతో సీనియర్లు జగన్ తీసుకునే నిర్ణయానికి సహకరిస్తారా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న సీనియర్లకు మంత్రి పదవులు దక్కకుంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ నెలకొంది.