జగన్ మదిలో మండలి చైర్మన్…?
రాష్ట్రంలో ఈ రకమైన రాజకీయ వాతావరణం ఎపుడూ లేదు. పదవులు అన్నీ కూడా వరసపెట్టి ఒకే పార్టీకి దక్కడం అన్నది జగన్ సృష్టించిన సరికొత్త రికార్డుగా చెప్పుకోవాలి. [more]
రాష్ట్రంలో ఈ రకమైన రాజకీయ వాతావరణం ఎపుడూ లేదు. పదవులు అన్నీ కూడా వరసపెట్టి ఒకే పార్టీకి దక్కడం అన్నది జగన్ సృష్టించిన సరికొత్త రికార్డుగా చెప్పుకోవాలి. [more]
రాష్ట్రంలో ఈ రకమైన రాజకీయ వాతావరణం ఎపుడూ లేదు. పదవులు అన్నీ కూడా వరసపెట్టి ఒకే పార్టీకి దక్కడం అన్నది జగన్ సృష్టించిన సరికొత్త రికార్డుగా చెప్పుకోవాలి. పంచాయతీ వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ సభ్యుడి దాకా వైసీపీ నేతలే పదవుల్లో నూటికి తొంబై అయిదు శాతం ఉంటున్నారు. ఇక ఏపీలో పెద్దల సభ కూడా రెండు నెలలు ఆగితే వైసీపీ పరం అవడం ఖాయం. అంతే కాదు క్యాబినెట్ ర్యాంక్ హోదా కలిగిన మండలి చైర్మన్ కూడా వైసీపీ నుంచే ఉంటారు. అలాగే డిప్యూటీ చైర్మన్ కూడా అదే పార్టీకి చెందిన వారు ఉంటారు.
బలాబలాలు తారు మారు…
ఇక ఏపీ మండలిలో మొత్తం 58 మంది సభ్యులు ఉంటే సగానికి పైగా టీడీపీకి చెందిన ఎమ్మెల్సీలు ఇప్పటిదాకా ఉండేవారు. కేవలం ఒకరిద్దరు ఎమ్మెల్సీలతో పెద్దల సభలో అడుగుపెట్టిన వైసీపీ జూన్ 18 తరువాత ఏకంగా 30 మంది సభ్యులతో పూర్తి మెజారిటీ సాధిస్తుంది. అదే సమయంలో టీడీపీ బలం దారుణంగా పడిపోతుంది. లోకేష్, యనమల వంటి వారు తప్ప మిగిలిన వారు కూడా 2023 నాటికి రిటైర్ అయిపోక తప్పదు. ఇలా మండలిలో గుత్తమొత్తంగా పెత్తనం వైసీపీ పరం కావడంతో అక్కడ చాలా పదవులు వారికి దక్కుతాయి.
పోటీ ఉన్నా కూడా …
ఇక మండలి చైర్మన్ గిరీ మీద చాలా మంది పెద్దల కన్ను ఇపుడు పడుతోంది అంటున్నారు. మండలి చైర్మన్ గా హాయిగా అధికారాన్ని అనుభవించే యోగాన్ని ఎవరు కాదనుకుంటారు. అందుకే ఇప్పటి నుంచే ఎవరి లెవెల్ లో వారు లాబీయింగ్ మొదలెట్టేశారు. అయితే జగన్ మదిలో ఎవరు ఉన్నారు అన్నదే అందరికీ అంతు పట్టని ప్రశ్న. జగన్ తీరు చూస్తే ఆయన ఎవరు పేరుని తన మనసులో ఉన్నది బయట పెట్టరు. చివరి నిముషంలో అనూహ్యంగా ఆయన నిర్ణయం తీసుకుంటారు. దాంతో అంతా షాక్ తినాల్సిందే. ఇపుడు కూడా అలాగే జరుగుతుందా అన్నదే ఆశావహులను పట్టి పీడిస్తున్న బెంగగా ఉందిట.
వారికే పీఠం….
ఇప్పటిదాకా నియామకాలు జరిగిన పదవుల విషయంలో జగన్ సెలెక్షన్ చూసిన వారికి ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్ధమవుతోంది. ఆయన బీసీలు, ఎస్సీలు, మైనారిటీల పక్షపాతిగానే ఉంటూ వస్తున్నారు. అదే విధంగా మహిళలకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. దాంతో జగన్ తలచుకుంటే ఒక బీసీ మహిళ అయినా చైర్ పర్సన్ అయ్యే చాన్స్ ఉంది అంటున్నారు. ఇపుడు ఉన్న ఎమ్మెల్సీలు కాదు మరింతమంది రేపటి రోజున మండలికి రాబోతున్నారు. వారి నుంచి కూడా చైర్మన్ పదవికి గట్టి పోటీ ఉండవచ్చు అని కూడా అంతా ఊహిస్తున్నారు. మొత్తానికి మే 24తో ప్రస్తుత చైర్మన్ షరీఫ్ దిగిపోతున్నారు. అందువల్ల ఆయన ప్లేస్ లో ఒక మైనారిటీని కూడా జగన్ తిరిగి కుర్చీ ఎక్కించే అవకాశాన్ని ఎవరూ కొట్టిపారేయడంలేదు. మొత్తానికి కాబోయే మండలి చైర్మన్ ఎవరా అన్నది ఒక్క జగన్ కి తప్ప మరెవరికీ తెలియదు అంటున్నారు.