జగన్ సెలక్షన్ అలాగే ఉంటుంది మరి
జగన్ కు పార్టీలో ప్రాణం ఇచ్చేవారు అనేక మంది ఉన్నారు. జగన్ ఎదుటి వ్యక్తుల నుంచి పైసా ఆశించకుండా అందలం ఎక్కించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు తిరుపతి [more]
జగన్ కు పార్టీలో ప్రాణం ఇచ్చేవారు అనేక మంది ఉన్నారు. జగన్ ఎదుటి వ్యక్తుల నుంచి పైసా ఆశించకుండా అందలం ఎక్కించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు తిరుపతి [more]
జగన్ కు పార్టీలో ప్రాణం ఇచ్చేవారు అనేక మంది ఉన్నారు. జగన్ ఎదుటి వ్యక్తుల నుంచి పైసా ఆశించకుండా అందలం ఎక్కించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా అంతే. వైద్యుడిగా ఉన్న గురుమూర్తిని ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేయడమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. జగన్ కేవలం తిరుపతి ఉప ఎన్నికల్లోనే కాదు సాధారణ ఎన్నికల్లో కూడా అతి సామాన్యులకు అతిపెద్ద పదవిని కట్టబెట్టారు.
నందింగం సురేష్….
ముందుగా బాపట్ల పార్లమెంటు సభ్యుడు నందిగం సురేష్ ను తీసుకుంటే ఆయన ఒక సామాన్య వ్యక్తి. పార్టీ కోసం పనిచేసే సాధారణ కార్యకర్త. అమరావతి ప్రాంతంలో తోటలు దగ్దమయిన కేసులో నందిగం సురేష్ పై అప్పటి ప్రభుత్వం కేసు నమోదు చేసింది. దీంతో సురేష్ లో ఉన్న ఫైర్ ను జగన్ గమనించారు. వెంటనే సాధారణ ఎన్నికల్లో బాపట్ల పార్లమెంటు సభ్యుడిగా ఎంపిక చేశారు. అక్కడ గెలవడంతో ఏకంగా ఆయన పార్లమెంటు గడప ఎక్కారు. జగన్ మీద ఈగ వాలినా నందిగం సురేష్ ఒప్పుకోరు.
గొడ్డేటి మాధవి….
ఇక అరకు పార్లమెంటు సభ్యురాలు గొడ్డేటి మాధవి. ఓ ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్ట్ టీచర్. మాధవి తండ్రి గొడ్డేటి దేముడు సీపీఐ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గిరిజనుల్లో మంచి పేరున్న ఆ కుటుంబానికి ఏకంగా పార్లమెంటు సభ్యత్వ పదవిని ఇచ్చారు. పైసా ఖర్చు పెట్టకుండా పార్లమెంటు మెంబర్ అయ్యారు. రాజకీయాలంటే ఇష్టం లేకపోయినప్పటికీ జగన్ పై నమ్మకంతో వచ్చిన ఆమె ఇప్పుడు కీలక పదవి పొందారు.
గురుమూర్తి కూడా….
తాజాగా తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసిన గురుమూర్తి సయితం సాధారణ వైద్యుడే. దళిత కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి ఫిజియోథెరపిస్ట్ గా మారారు. జగన్ పాదయాత్ర సమయంలో ఆయన వెన్నంటి ఉండి సేవలందించారు. ఇప్పుడు గురుమూర్తి కూడా సాధారణ స్థాయి నుంచి పార్లమెంటు కు ఎంపికయ్యారు. ఇలా జగన్ సెలక్షన్ డిఫరెంట్ గా ఉంటుందని, నాయకత్వంపై నమ్మకం పెంచుకోవడానికి ఇలాంటి ఎంపికలు ఉపయోగ పడతాయి.