ఎమ్మెల్యేల గుండెల్లో దడ పుట్టిస్తున్న జగన్…?
అవును. జగన్ ఎటూ తన రాజకీయ ఎత్తుగడలతో ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తున్నారు. నోట మాట రాకుండా తాళం వెస్తున్నారు. ఎవరు ఎన్ని రకాలుగా కుప్పిగెంతులు వేసినా కూడా [more]
అవును. జగన్ ఎటూ తన రాజకీయ ఎత్తుగడలతో ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తున్నారు. నోట మాట రాకుండా తాళం వెస్తున్నారు. ఎవరు ఎన్ని రకాలుగా కుప్పిగెంతులు వేసినా కూడా [more]
అవును. జగన్ ఎటూ తన రాజకీయ ఎత్తుగడలతో ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తున్నారు. నోట మాట రాకుండా తాళం వెస్తున్నారు. ఎవరు ఎన్ని రకాలుగా కుప్పిగెంతులు వేసినా కూడా కాళ్ల నొప్పి తప్ప వేరేగా ఫలితం లేదు అన్నది నిజం. ఇదిలా ఉంటే జగన్ కేవలం విపక్షానికే కాదు స్వపక్షంలోనూ బీపీ తెప్పిస్తున్నారు. తన పని తీరుతో ఆయన దూసుకుపోతున్నారు. అదే సమయంలో ఏ ఒక్క మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఆయన వెలుగుల ముందు వెలవెలబోవడం తప్ప గట్టిగా నిలవలేకపోతున్నారు.
సత్తా తేల్చేస్తారా …?
జగన్ అన్న ట్యాగ్ తగిలించుకునే 151 ఎమ్మెల్యేలలో అత్యధిక శాతం 2019 ఎన్నికల్లో గెలిచారు. వారు ఈ రెండెళ్ళ కాలంలో జనం దగ్గరకు వెళ్తున్నారా, వారి పని తీరు ఏంటి, పరపతి ఎలా ఉంది అన్న లెక్కలు జగన్ కి ఇపుడు అర్జంటుగా కావాలిట. ఎంత జగన్ పై స్థాయిలో బాగా పనిచేస్తున్నా కూడా దిగువ స్థాయిలో ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు సత్తా చాటకపోతే ప్రభుత్వం మీదనే ఆ మచ్చ పడుతుందని జగన్ బాగానే గ్రహించినట్లున్నారు. సరిగ్గా ఇదే పాయింట్ దగ్గరే చంద్రబాబు కూడా 2019 ఎన్నికల్లో అడ్డంగా దొరికిపోయారు.
ముందు జాగ్రత్తేనా …?
ఆ సంగతి బాగా తెలుసు కనుకనే జగన్ ఇపుడు జాగ్రత్త పడుతున్నారు అంటున్నారు. ఎమ్మెల్యేల మీద ఒక్కసారిగా వ్యతిరేకత పెరిగితే అది చివరికి పార్టీని, ప్రభుత్వాన్ని ముంచుతుందన్నదే జగన్ ఆలోచనగా ఉందిట. ఇదిలా ఉంటే ఏపీలో జగన్ సర్కార్ పధకాలు బాగున్నాయి. ఆయన సంక్షేమంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఆయన్ని దాటి కూడా ఎవరూ పోలేరు. అదే సమయంలో నియోజకవర్గంలో మిగిలిన సమస్యల మీద కూడా ఎమ్మెల్యేలు పని చేయాలి అన్నదే జగన్ ఉద్దేశ్యమని చెబుతున్నారు. దాంతో ఎమ్మెల్యేల పని తీరు మీద గట్టి నిఘా పెట్టారని అంటున్నారు.
కమిటీతో అలా ..?
ఇక ప్రభుత్వం నుంచి పార్టీ నుంచి సీనియర్లతో ఒక కమిటీని కూడా జగన్ తొందరలో ఏర్పాటు చేస్తారు అంటున్నారు. ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే పనితీరు మీద అధ్యయనం చేసి ఆ నివేదికను జగన్ కి ఇస్తుంది అంటున్నారు. అందులో రిమార్కులు వచ్చిన వారికి జగన్ ఒకసారి చెప్పి చూస్తారని అంటున్నారు. వారి పనితీరు మార్చుకోవడానికి మరో రెండేళ్ళ సమయం ఇస్తారని కూడా అంటున్నారు. అప్పటికి వారు మారకపోయినా, లేక వారి వల్ల పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చినా జగన్ తక్షణమే వారిని మార్చివేసి కొత్త వారిని ఆయా చోట్ల తీసుకువస్తారని అంటున్నారు. మొత్తానికి జగన్ తీసుకోబోతున్న ఈ నిర్ణయంతో ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయట.