జగన్ వ్యూహం మార్చినట్లే కనపడుతుందిగా?

రాజధాని అమరావతి వ్యవహారం ఇప్పట్లో తేలేలా కన్పించడం లేదు. వచ్చే ఎన్నికల వరకూ విశాఖకు రాజధాని తరలింపు సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. న్యాయస్థానాల్లో కేసులు ఉండటంతో [more]

Update: 2021-05-10 02:00 GMT

రాజధాని అమరావతి వ్యవహారం ఇప్పట్లో తేలేలా కన్పించడం లేదు. వచ్చే ఎన్నికల వరకూ విశాఖకు రాజధాని తరలింపు సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. న్యాయస్థానాల్లో కేసులు ఉండటంతో అవి ఎప్పుడు తేలతాయో తెలీని పరిస్థిితి. దీంతో వచ్చే ఎన్నికల సమయానికి రాజధాని అమరావతి నుంచే జగన్ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుందని వైసీపీ సీనియర్ నేతలే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇటీవల విశాఖ తరలింపు వ్యవహారంపై ఎవరూ పెద్దగా మాట్లాడటం లేదు.

న్యాయస్థానాల్లో….

రాజధానిని అమరావతి నుంచి తరలించడంపై హైకోర్టులో అనేక కేసులు ఉన్నాయి. మే 3వ తేదీ నుంచి రోజువారీ విచారణ ఉంటుందని ధర్మాసనం ప్రకటించింది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వేవ్ దృష్ట్యా అప్పటి నుంచి కూడా రోజువారీ విచారణ సాధ్యమయ్యేలా కన్పించడం లేదు. ఇప్పటికే హైకోర్టులో అనేక కేసులను కరోనా వైరస్ కారణంగా వాయిదావేశారు. అత్యవసర కేసులను మాత్రమే వర్చువల్ విధానంలో విచారణ చేపడుతున్నారు.

కోర్టులను కాదని….

ీఈ నేపథ్యంలో రాజధాని తరలింపు వ్యవహారం జగన్ కు తలనొప్పిగా మారింది. వచ్చే ఎన్నికల నాటికి రాజధానిని విశాఖకు తరలించకపోతే తాను చెప్పిన మాటకు విలువ లేకుండా పోతుంది. అలాగని న్యాయస్థానాలను కాదని విశాఖకు తరలి వెళ్లలేం. ఇందుకు జగన్ కొత్త ఆలోచన చేస్తున్నారని తెలిసింది. విశాఖలో సీఎం క్యాంప్ కార్యాలయాన్ని తరలించాలని జగన్ యోచిస్తున్నారని తెలిసింది.

క్యాంప్ కార్యాలయాన్ని…..

సీఎం క్యాంప్ కార్యాలయాన్ని విశాఖకు తరలిస్తే సగం పాలనను అక్కడకు తీసుకెళ్లినట్లేనని చెబుతున్నారు. తాను అక్కడ ఉంటే రాజధానిని తరలించినట్లే అవుతుందని, న్యాయస్థానాల ఆదేశాలను కూడా థిక్కరించినట్లు కాదని జగన్ భావిస్తున్నారు. అందుకే సీఎం క్యాంప్ కార్యాలయం కోసం వసతిని ఏర్పాటు చేయాలని అక్కడి అధికారులకు ఆదేశాలు అందినట్లు తెలిసింది. మొత్తం మీద రాజధాని తరలింపు వ్యవహారంలో న్యాయపరమైన చిక్కులు ఉండటంతో జగన్ కొత్త వ్యూహంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News