జగన్ ఆ ప్రామిస్ లపై యాక్షన్ ప్లాన్ రెడీ…?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తి కావస్తుంది. ఈ రెండేళ్లలో జగన్ తాను పాదయాత్రలోనూ, మ్యానిఫేస్టోలో ఇచ్చిన హామీలను అమలుపర్చారు. ఇప్పటి వరకూ 90 [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తి కావస్తుంది. ఈ రెండేళ్లలో జగన్ తాను పాదయాత్రలోనూ, మ్యానిఫేస్టోలో ఇచ్చిన హామీలను అమలుపర్చారు. ఇప్పటి వరకూ 90 [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తి కావస్తుంది. ఈ రెండేళ్లలో జగన్ తాను పాదయాత్రలోనూ, మ్యానిఫేస్టోలో ఇచ్చిన హామీలను అమలుపర్చారు. ఇప్పటి వరకూ 90 శాతం హామీలను అమలు పర్చారు. అయితే జిల్లాల్లోనూ, నియోజకవర్గాల్లోనూ జగన్ హామీలు అమలుకు నోచుకోవడం లేదు. దీనిపై జగన్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. జగన్ నియోజకవర్గాలకు ఇచ్చిన హామీలను అమలు పర్చాలని భావిస్తున్నారు.
పాదయాత్ర సమయంలో….
జగన్ 2019 ఎన్నికలకు ముందు సుదీర్థ పాదయాత్ర చేశారు. దాదాపు 3,800కు పైగా కిలోమీటర్లు ఆయన ప్రయాణంచారు. సుమారు 120 నియోజకవర్గాల్లో ఆయన సభలు జరిగాయి. ఈ సందర్భంగా ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం సమస్యలపై జగన్ ప్రస్తావించారు. తాను అధికారంలోకి వస్తే వెంటనే వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మూతపడిన కర్మాగారాలను తెరిపించడం కావచ్చు. స్థానికంగా తనకు అందిన ఫిర్యాదులు, వినతిపత్రాలపై అప్పట్లో జగన్ స్పందించారు.
నియోజకవర్గాల్లో…..
అయితే ఇప్పుడు నియోజకవర్గాల్లో జగన్ ఇచ్చిన హామీలను అమలుపర్చడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. నియోజకవర్గాల వారీగా జగన్ ఏ హామీలు ఇచ్చారు? వాటి పరిష్కారానికి ఎంత ఖర్చవుతుంది? అన్న దానిపై ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టి పెట్టింది. నియోజకవర్గాల వారీగా జగన్ ప్రస్తావించిన సమస్యలను, హామీలను తెప్పించుకుని వాటి పరిష్కారం సాధ్యాసాధ్యాలపై సీఎంవో దృష్టి పెట్టింది.
కార్యాచరణను రూపొందిస్తూ…..
ఇందుకోసం ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటోంది. సత్వరం పరిష్కరించాల్సిన సమస్యలు ఏంటి? వాటికి అయ్యే ఖర్చు ఎంత? దాని వల్ల నియోజకవర్గం పరిధిలోనిన ఏ యే ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుతుంది? అన్న అంశాలను సీఎంవో సేకరిస్తుంది. పూర్తి స్థాయిలో దీనిపై నివేదికను సిద్ధం చేసిన తర్వాత జగన్ చేయబోయే పర్యటనల్లో వీటిపై ఖచ్చితమైన హామీ ఇచ్చేలా ముఖ్యమంత్రి కార్యాలయం కార్యాచరణను రూపొందిస్తుంది.