ఇక మోయడం కష్టమేనా?

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. ఖాజానా వెక్కిరిస్తుంది. లాక్ డౌన్ విధించకపోయినా ఈ రెండు నెలల్లో రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గే అవకాశాలు కన్పిస్తున్నాయి. [more]

Update: 2021-05-30 00:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. ఖాజానా వెక్కిరిస్తుంది. లాక్ డౌన్ విధించకపోయినా ఈ రెండు నెలల్లో రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గే అవకాశాలు కన్పిస్తున్నాయి. మరో వైపు సంక్షేమ పథకాలకు నిధులను వెచ్చించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జగన్ కరోనా తొలిదశలో ప్రకటించిన విధానానికి ఈసారి స్వస్తి చెప్పినట్లే కనపడుతుంది. ఆర్థిక భారం ఎక్కువ కావడంతో కోవిడ్ బాధితులకు ఆర్థిక సాయం అందించలేకపోతున్నారు.

కరోనా బాధితులకు…

కరోనా తొలిదశలో వచ్చినప్పుడు కరోనా బాధితులకు జగన్ రెండు వేల రూపాయల నగదును ఇచ్చారు. వారు కోలుకునేందుకు, పౌష్టికాహారం తీసుకునేందకు ఇది ఉపయోగపడుతుందని జగన్ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ ఆర్థిక సాయాన్ని ప్రకటించి అప్పట్లో అందరి ప్రశంసలను అందుకున్నారు. కానీ ఈ సారి కేసులు సంఖ్య పెరుగుతోంది. రోజుకు పదివేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.

ఇక కష్టమేనా?

కరోనా బాధితులు పెరుగుతున్న దశలో ఈ పథకం అమలు చేయడం జగన్ కు కష్టంగా మారింది. తొలిదశలోనే ఈ పథకాన్ని మధ్యలోనే నిలిపేశారు. పేదలకు ఈ పథకం ఉపయోగపడుతుందని జగన్ భావించినా అందరికీ వర్తింప చేయడతో ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఈసారి ఈ విధానాన్ని అమలు చేసే ఆలోచనే జగన్ చేయడం లేదు. వీలయినంత త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్న ఉద్దేశ్యమే కన్పిస్తుంది.

ఆర్థిక సంక్షోభం తప్పదా?

మరో మూడు నెలలు కరోనా సంక్షోభం తప్పదంటున్నారు. ఇది జగన్ సర్కార్ కు ఇబ్బంది కరంగా మారనుంది. ఉద్యోగుల జీతభత్యాలను సకాలంలో చెల్లించలేని పరిస్థితి. ఇప్పటికే శక్తికి మించిన అప్పులు చేసిన జగన్ కొత్త పథకాలకు ఫుల్ స్టాప్ పెట్టాలన్న యోచనలో ఉన్నారు. ఆర్థిక శాఖ కూడా జగన్ కు ఈ సూచన చేసినట్లు తెలిసింది. మొత్తం మీద ఏపీ ఖజానా వెక్కిరిస్తుండటంతో జగన్ కు భవిష్యత్ లో ఆర్థికంగా పెను ఇబ్బందులు తప్పవన్న హెచ్చరికలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News