బ్యాడ్ లక్ జగన్ ….ఇది వదలేట్లు లేదు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ఏ ముహూర్తాన ప్రమాణస్వీకారం చేశారో కానీ అస్సలు రోజులు బాగాలేవు. ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ఏ ముహూర్తాన ప్రమాణస్వీకారం చేశారో కానీ అస్సలు రోజులు బాగాలేవు. ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ఏ ముహూర్తాన ప్రమాణస్వీకారం చేశారో కానీ అస్సలు రోజులు బాగాలేవు. ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇప్పటికి అధికారంలోకి రెండేళ్లవుతున్నా గట్టిగా ఎనిమిది నెలలు మాత్రమే జగన్ కుదురుగా పరిపాలన చేశారు. ఇక మిగిలిన సమయమంతా కరోనా మింగేసింది. కాలు కదపడానికి లేదు. వ్యాపారసంస్థలను తెరవడానికి లేదు.
ఖజానా బోసిపోయి….
కరోనా వైరస్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ను ఆర్థికంగా మరింత దెబ్బతీస్తుంది. రాష్ట్ర విభజనతో అసలే అంతంత మాత్రంగా ఉన్న ఏపీ ఆదాయం కరోనా దెబ్బకు కుదేలైపోయింది. ఇటు సంక్షేమ పథకాలను అమలు చేయాల్సి రావడం, అటు కరోనాను కంట్రోల్ చేయడం జగన్ కు శక్తికి మించిన భారంగా మారిందనే చెప్పాలి. ఆదాయం పూర్తిగా పడిపోవడంతో రానున్న కాలంలో మరిన్ని ఇబ్బందులు తప్పవని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హామీలను అమలు చేసేందుకు…
జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే తాను ఇచ్చిన హామీలను అమలు చేయాలనుకున్నారు. ప్రధానంగా రాష్ట్ర ఆదాయం మద్యం అమ్మకాల ద్వారానే వస్తుంది. కానీ జగన్ వచ్చిన వెంటనే ప్రయివేటు దుకాణాలను రద్దు చేసి మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. మద్యనిషేధంలో భాగంగా జగన్ ఈ చర్యలు తీసుకున్నప్పటికీ రాష్ట్ర ఆదాయానికి భారీగా గండిపడిందనే చెప్పాలి. అదే ప్రయివేటు దుకాణాలకు ఇస్తే వేలం ద్వారా ఆదాయం అధికంగా వచ్చి ఉండేది.
ప్రభుత్వ భూములను….
ఇక ప్రభుత్వ భూములను అమ్మి రాష్ట్ర ఖజానాను నింపుకుందామనుకున్నా కుదరడం లేదు. అనేక చోట్ల ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల విక్రయంపై హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి. దీనిద్వారా కూడా ఇప్పట్లో జగన్ సర్కార్ కు నిధులు సమకూరే అవకాశాలు లేవన్నది వాస్తవం. దీంతో జగన్ ఇక అప్పులపైనే ఆధారపడాల్సి ఉంటుంది. మొత్తం మీద జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కరోనా రూపంలో ఖజానాను కాటేసిందనే చెప్పాలి.