జగన్ ఉక్కు సంకల్పం ఏంటో … ?
ముఖ్యమంత్రి జగన్ చిత్తశుద్ధిని విశాఖ ఉక్కు కార్మికులు చూస్తామని అంటున్నారు. ఆయన మడమ తిప్పని నైజాన్ని కూడా గమనిస్తామని చెబుతున్నారు. మాట తిప్పే వెనక్కు వెళ్ళను అని [more]
ముఖ్యమంత్రి జగన్ చిత్తశుద్ధిని విశాఖ ఉక్కు కార్మికులు చూస్తామని అంటున్నారు. ఆయన మడమ తిప్పని నైజాన్ని కూడా గమనిస్తామని చెబుతున్నారు. మాట తిప్పే వెనక్కు వెళ్ళను అని [more]
ముఖ్యమంత్రి జగన్ చిత్తశుద్ధిని విశాఖ ఉక్కు కార్మికులు చూస్తామని అంటున్నారు. ఆయన మడమ తిప్పని నైజాన్ని కూడా గమనిస్తామని చెబుతున్నారు. మాట తిప్పే వెనక్కు వెళ్ళను అని చెప్పే జగన్ వైఖరిని కూడా తాము కళ్లారా తిలకిస్తామని అంటున్నారు. ఇంతకీ జగన్ ఏం చేయాలి. వారికి ఏం కావాలి అంటే చాలా పెద్దదే కావాలి. అయితే విషయం చాలా చిన్నది. కానీ దాని పర్యవసానాలు ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. జగన్ సుమారు మూడు నెలల క్రితం విశాఖ వచ్చినపుడు ఒక మాట ఇచ్చారు. విశాఖ ఉక్కుని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం కానివ్వను అని. అదే విధంగా అసెంబ్లీని ఎపుడు నిర్వహించినా కూడా ఉక్కు మీద గట్టి తీర్మానం చేస్తామని.
సర్వత్రా ఉత్కంఠ …?
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 20న నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశ్యం బడ్జెట్ పద్దులను ఆమోదించుకోవడం. అయితే పనిలో పనిగా ఉక్కు తీర్మానం కూడా ఆమోదించమని కార్మికులు కోరుతున్నారు. జగన్ చెప్పిన ప్రకారం తీర్మానం ఆమోదించాల్సిందే అంటున్నారు విశాఖ ఉక్కు అఖిల పక్ష పోరాట కమిటీ చైర్మన్ సీహెచ్ నరసింగరావు. ఆ పని చేస్తేనే ఆయన మీద నమ్మకం ఇంకా పెరుగుతుంది అని ఆయన చెబుతున్నారు. జగన్ విశాఖ టూర్ లో తమ వద్దకు వచ్చి ఉక్కు విషయంలో భరోసా ఇచ్చారాని, దానికి కొనసాగింపుగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
మోడీ మీదకే…?
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఈపాటికే కేంద్రం స్పష్టం చేసింది. దాని మీద రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కూడా ఆర్ధిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ ససేమిరా అనేశారు. అది తమ పాలసీ అని కూడా చెప్పుకున్నారు. మరి ఇంత జరిగాక కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే అది మోడీ మీదకు ఉక్కు బాణం వదిలినట్లే ఉంటుంది. దాని వల్ల పెద్దగా ఫలితం ఉండదు కానీ కేంద్ర పెద్దలకు మాత్రం గుస్సా వస్తుంది. అనవసర రచ్చ దీని వల్ల అని వైసీపీ పెద్దలలో చర్చ అయితే సాగుతోందిట.
మమ అనిపిస్తారా…?
ఇక కేవలం బడ్జెట్ పద్దుల కోసమే సభను పిలిచాము కాబట్టి దానికే పరిమితమైతే బాగుంటుంది అన్న ఆలోచన కూడా వైసీపీలో ఉందిట. పైగా వేరే ఏ విధమైన బిల్లులను కూడా సభలో ప్రవేశపెట్టేది ఉండదు అంటున్నారు. అలాంటిది ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ మీద తీర్మానం పెడితే చర్చ కూడా జరగాలి. ఆ మీదట ఆమోదించాలి. కరోనా విపత్కర వేళ అంత అవసరమా అన్నది కనుక అనుకుంటే ఉక్కు బిల్లు పక్కకు పోయినట్లే అంటున్నారు. అయితే ఇది అంత ఈజీ కాదు అని కూడా మరో మాట ఉంది. జగన్ ప్రతిష్టకు ముడిపడి ఉన్న అంశం. పైగా ఆంధ్రులకు గర్వకారణం అయిన విశాఖ ఉక్కు విషయంలో వైసీపీ చిత్తశుద్ధిని చాటే అవకాశమని అంటున్నారు. దీని మీద పట్టుబట్టేందుకు విశాఖ వైసీపీ ప్రజాప్రతినిధులు రెడీగా ఉన్నారుట. మరి జగన్ ఎలా డిసైడ్ చేస్తారో చూడాలి.