రేపటి పౌరులనూ వదలవా జగన్… ?

చంద్రబాబు రాజకీయానికి పూర్తి అపోజిట్ పాలిటిక్స్ జగన్ చేస్తున్నారు. చంద్రబాబు ఇప్పటిదాకా కులాలను పట్టుకుని రాజకీయం చేస్తూ వచ్చారు. ఒక్కో కులంలో కొంతమందిని అందలం ఎక్కించి మిగిలిన [more]

Update: 2021-05-21 14:30 GMT

చంద్రబాబు రాజకీయానికి పూర్తి అపోజిట్ పాలిటిక్స్ జగన్ చేస్తున్నారు. చంద్రబాబు ఇప్పటిదాకా కులాలను పట్టుకుని రాజకీయం చేస్తూ వచ్చారు. ఒక్కో కులంలో కొంతమందిని అందలం ఎక్కించి మిగిలిన వారిని ఆకట్టుకునే వ్యూహం బాబుది. జగన్ అలా కాదు. కులం మతం వర్గం ప్రాంతం అన్నీ దాటుకుని సంపూర్ణ రాజకీయమే చేస్తున్నారు. ఇక జగన్ అన్ని వయసుల వారినీ ఆకట్టుకునేలా సరికొత్త పధకాలకూ శ్రీకారం చుట్టారు. మహిళలు, యువత ఇలా బలమైన వారిని మరింతగా ప్రోత్సహిస్తున్నారు.

రేపటి ఓటర్లుగా…?

తాజా బడ్జెట్ లో అనేక చిత్రాలు ఉన్నాయి. అభివృద్ధి అన్నది పెద్దగా వెతకాల్సిన అవసరం లేదు. రాష్ట్రానికి రెండు లక్షల 30 వేల కోట్ల దాకా ఆదాయం వస్తుందని అంచనా వేసిన ఈ బడ్జెట్ లో అందులో ఎంతో కొంత శాతం ప్రగతి పనులకు కేటాయించారా అంటే పెద్దగా లేదు. కానీ అదే సమయంలో సంక్షేమం పేరిట పప్పు బెల్లాల పందేరం మాత్రం చాలా ధాటీగా చేసేలా సీన్ ఉంది. మొత్తం బడ్జెట్ ని చూస్తే ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా అని కూడా అనిపించడు. అలా అందరికీ సర్దేశారు. ఆఖరుకు రేపటి ఓటర్లుగా ఉన్న బాలల కోసం కూడా పధకాలు జగన్ రెడీ చేశారు.

రికార్డే మరి ……..

బడ్జెట్ అంటే ఇప్పటిదాకా చూసింది మొత్తం రాష్ట్రం ఒక యూనిట్ గా చేసుకుని కేటాయింపులు చేయడం. అయితే ఓట్ల రాజకీయ ముదిరాక ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్స్ వచ్చాయి. ఇపుడు బీసీ సబ్ ప్లాన్ కూడా తీసుకువచ్చారు. ఇక రైతుల కోసం వ్యవసాయ బడ్జెట్ ప్రత్యేకంగా చాలా కాలంగా ఉంది. జగన్ ఏలుబడిలో జెండర్ బడ్జెట్ ఒక స్పెషాలిటీ. అంటే సమాజంలో పురుషులతో పాటు సమానంగా మహిళలూ ఎదగాలని కోరుకుంటూ వారి కోసం బడ్జెట్ లో కేటాయింపులు బాగా చేశారు. అంతే కాదు 18 ఏళ్ల లోపు బాలలు, చిన్నారులకు ఏకంగా 16 వేల కోట్ల రూపాయలు వివిధ పధకాల కోసం కేటాయించి రికార్డే సృష్టించారు అని చెప్పాలి.

దూర దృష్టితోనే …?

జగన్ చాలా ముందు చూపుతోనే వ్యవహరిస్తున్నారు అంటున్నారు. ఈనాటి టీనేజర్లు, బాలలూ రేపటి ఓటర్లు, 2024 ఎన్నికల నాటికి వీరిలో చాలా మంది కొత్త ఓటర్లు అవుతారు. అందువల్ల వివిధ పధకాల రూపంలో ఇప్పటి నుంచే వారితో కనెక్షన్ పెట్టుకుంటే ఫ్యూచర్ లో వారు బాగా కలసి వస్తారు అన్నదే జగన్ మాస్టర్ ప్లాన్ అంటున్నారు. దీని బట్టి చూస్తే జగన్ సంక్షేమం
అపుడే పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వరకూ సాగిపోయింది అన్నమాట. ఇందులో వారూ వీరూ అన్న తేడా లేకుండా అర్హతే ప్రమాణంగా చేసుకుని అందరికీ అన్నీ ఇస్తూంటే అదే జగన్ వరస విజయాలకు సోపానంగా మారుతుందని అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News