Ys jagan : జగన్ ఎడం పాటించాల్సిందే…?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మరోసారి అధికారంలోకి రావాలంటే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోక తప్పదు. మరోసారి విజయం జగన్ కు అవరసరమని భావిస్తే కొన్ని బంధాలను తెంచుకోవాల్సి [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మరోసారి అధికారంలోకి రావాలంటే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోక తప్పదు. మరోసారి విజయం జగన్ కు అవరసరమని భావిస్తే కొన్ని బంధాలను తెంచుకోవాల్సి [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మరోసారి అధికారంలోకి రావాలంటే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోక తప్పదు. మరోసారి విజయం జగన్ కు అవరసరమని భావిస్తే కొన్ని బంధాలను తెంచుకోవాల్సి ఉంటుంది. కొన్ని అనుబంధాలను కలుపుకోవాల్సి ఉంటుంది. అప్పుడే జగన్ కు కొంత అడ్వాంటేజీ అవుతుంది. ఇప్పుడు తెచ్చుకోవాల్సిన బంధం బీజేపీతోనే. బీజేపీతో ఇదే రకమైన సంబంధాలను కొనసాగిస్తే జగన్ కూడా రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు.
వ్యతిరేకత కన్పిస్తుండటంతో….
దేశ వ్యాప్తంగా బీజేపీ పట్ల వ్యతిరేకత కన్పిస్తుంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో జనం నాడి కన్పించింది. ఏపీలో బీజేపీ పొడిచేదేం లేదు. దానికి ఓటు బ్యాంకు కూడా లేదు. బద్వేలు ఉప ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమైంది. ఏపీ బీజేపీ కూడా ఇంతకంటే నష్టపోయేదీ కూడా ఏమీ ఉండదు. అందుకే బీజేపీ వల్ల జగన్ కు ప్రయోజనం లేదు. పరోక్షంగా మద్దతు ఇస్తుండటం వల్ల నష్టమేనని విశ్లేషకుల అంచనా.
భ్రమలు తొలగి….
బీజేపీ పట్ల దేశ వ్యాప్తంగా భ్రమలు దాదాపుగా తొలగిపోయాయి. దాని మిత్రపక్షాలు కూడా ఒక్కొక్కటిగా వెళ్లిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీతో దూరం పాటిస్తేనే జగన్ కు వచ్చే ఎన్నికల్లో మంచి జరుగుతుందంటున్నారు. పోయిన ఎన్నికల్లోనూ జగన్ బీజేపీకి దూరంగానే ఉన్నారు. అయితే ఈసారి అధికారంలోకి రావడంతో బీజేపీతో సఖ్యతను జగన్ కోరుకున్నారు. పాటిస్తున్నారు కూడా. కొన్ని విషయాల్లో రాజీపడుతున్నారన్న విమర్శలను కూడా జగన్ ఎదుర్కొంటున్నారు.
రాజీ పడుతుండటంతో…
ప్రత్యేక హోదా విషయాన్ని పక్కన పెడితే.. పోలవరం ప్రాజెక్టు అంశంలోనూ, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి విషయంలోనూ, పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని జగన్ నిలదీయ లేకపోతున్నారని, 22 మంది ఎంపీలను గెలిపించినా ప్రయోజనం లేదన్న విమర్శలున్నాయి. వీటి నుంచి బయటపడి, ఎన్నికలను ఎదుర్కొనాలంటే జగన్ బీజేపీని దూరం పెట్టక తప్పదన్న సూచనలు కూడా బలంగా విన్పిస్తున్నాయి.