Ycp : ఈ యువనేత స్పార్క్ ను జగన్ ఎప్పుడు గుర్తించారంటే…?

సాధారణంగా ఏ పార్టీలో అయినా పదవులు దక్కడం అంత సులువు కాదు. సీనియర్లకే ప్రాధాన్యం ఉంటుంది. కానీ జగన్ లెక్కలు వేరుగా ఉంటాయి. యువనేతలకే ఎక్కువ ప్రాధాన్యత [more]

Update: 2021-11-10 14:30 GMT

సాధారణంగా ఏ పార్టీలో అయినా పదవులు దక్కడం అంత సులువు కాదు. సీనియర్లకే ప్రాధాన్యం ఉంటుంది. కానీ జగన్ లెక్కలు వేరుగా ఉంటాయి. యువనేతలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. భవిష్యత్ లో పార్టీని మరింత పరుగులు తీయించేందుకు జగన్ యువకులకే ఎక్కువ అవకాశాలు కన్పిస్తున్నారు. మంత్రి వర్గంలో చూసుకున్నా ఎక్కువగా యువకులే కన్పిస్తారు. ఇక జగన్ ఇప్పటి వరకూ భర్తీ చేసిన పదవుల్లోనూ యువతకే ప్రాధాన్యత ఇవ్వడం విశేషం.

ఎమ్మెల్సీగా….

తాజాగా ఎమ్మెల్సీ పదవికి పాలవలస విక్రాంత్ ను జగన్ ఎంపిక చేశారు. ఆయనను ఎమ్మెల్సీగా ఊరికే ఎంపిక చేయలేదు. ఈ యువనేత బ్యాక్ గ్రౌండ్ గట్టిదే. పాలవలస విక్రాంత్ కుటుంబానికి శ్రీకాకుళం జిల్లాలో రాజకీయంగా మంచి పేరుంది. విక్రాంత్ తాత పాలవలస సంగం నాయుడు 1962లోనే ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన అనంతరం విక్రాంత్ తండ్రి రాజశేఖరం కూడా సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా రాజకీయంగా ఎదిగారు.

తాత, తండ్రుల నుంచి…

విక్రాంత్ తండ్రి రాజశేఖరం 1994 లో అప్పటి ఉనుకూరు శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి ఆయన రాజకీయం మొదలు పెట్టారు. ఆ తర్వాత 2006 నుంచి 2011 వరకూ శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఛైర్మన్ గా పనిచేశారు. ఆ తర్వాత 2011 లో జగన్ పార్టీ పెట్టిన వెంటనే పాలవలస కుటుంబాం వైసీపీలో చేరింది. జిల్లాలో జగన్ పార్టీకి అండగా నిలిచింది. పార్టీ పెట్టిన నాటి నుంచి పదవులు ఆశించకుండా ఆ కుటుంబం పార్టీ కోసమే పనిచేసింది.

పాదయాత్ర సమయంలోనే…

పార్టీలో చేరినప్పుడే పాలవలస కుటుంబానికి జగన్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. అధికారంలోకి వస్తే పదవి ఇస్తానన్న హామీని జగన్ రాగానే నిలబెట్టుకున్నారు. శ్రీకాకుళం డీసీసీబీ ఛైర్మన్ ను చేశారు. 2019 ఎన్నికల్లో పాలవలస విక్రాంత్ పార్టీ విజయానికి కృషి చేశారు. పాదయాత్రలోనే జగన్ విక్రాంత్ లో స్పార్క్ ను గుర్తించారు. దీంతో ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక మంచి కుటుంబానికి పదవి ఇచ్చారని అందరూ ఒప్పుకోవడం విశేషం.

Similar News