పార్టీ పేరుతోనే ఇబ్బంది వస్తుందా?
వైఎస్ షర్మిల మరి కొద్ది రోజుల్లో పార్టీని ప్రకటించబోతున్నారు. తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేయడానికి ఆమె కారణాలు ఇప్పటికే చెప్పారు.. ఒకటి రాజన్న రాజ్యం తేవాలని, మరొకటి [more]
వైఎస్ షర్మిల మరి కొద్ది రోజుల్లో పార్టీని ప్రకటించబోతున్నారు. తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేయడానికి ఆమె కారణాలు ఇప్పటికే చెప్పారు.. ఒకటి రాజన్న రాజ్యం తేవాలని, మరొకటి [more]
వైఎస్ షర్మిల మరి కొద్ది రోజుల్లో పార్టీని ప్రకటించబోతున్నారు. తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేయడానికి ఆమె కారణాలు ఇప్పటికే చెప్పారు.. ఒకటి రాజన్న రాజ్యం తేవాలని, మరొకటి తాను తెలంగాణ బిడ్డనేనని. ఇప్పుడు షర్మిల పార్టీ పేరును ప్రకటించకముందే ఆ పార్టీపై దాడి ప్రారంభమయింది. ప్రధానంగా ఆ పార్టీ పేరు మీదే ఎటాక్ స్టార్టయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని విలన్ గా చిత్రీకరించే ప్రక్రియ ప్రారంభమమయింది.
ఈ నెల 8వ తేదీన….
వైఎస్ షర్మిల జులై 8వ తేదీన వైఎస్ జయంతి సందర్భంగా పార్టీ పేరును ప్రకటించనున్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీగా ఎన్నికల కమిషన్ ఎదుట పేరును నమోదు చేసుకున్నారు. భారీ బహిరంగ సభ ద్వారా ఆమె ఈ పేరును ప్రకటించనున్నారు. అయితే దీనికి ముందుగానే వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణకు చేసిన ద్రోహాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అధికార టీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దగ్గర నుంచి పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు నిర్మాణం వరకూ వైఎస్ రాజశేఖర్ రెడ్డినే ఎక్కువగా టార్గెట్ చేసింది.
రెండు రాష్ట్రాల్లో….
వైఎస్ రాజశేఖర్ రెడ్డికి రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా అమలు చేసిన సంక్షేమ పథకాలే అందుకు కారణం. అయితే ప్రస్తుతం ఆర్డీఎస్, రాయలసీమ ఎత్తిపోతల పధకం వివాదంగా మారింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్ ఏపీలో ఆ ప్రాజెక్టు నిర్మాణాలకు కారణం. అయితే తెలంగాణలో మాత్రం జగన్ పేరు కన్నా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరే ఎక్కువగా విన్పిస్తుంది. పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు సామర్థ్యాన్ని 11 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచడానికి కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని జోరుగా ప్రచారం చేస్తున్నారు.
అందుకే ఆయనను హైలెట్…..
దీనికి ప్రధాన కారణం వైఎస్ షర్మిల పార్టీని తొలినాళ్లలోనే నిర్వీర్యం చేయడమే. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకు ఆమె వైపు మరల కుండా ఉండేందుకే వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తెలంగాణకు విలన్ గా చేసే ప్రయత్నం మొదలయింది. నీటి వివాదాలు సహమే. నేరుగా జగన్ తో యుద్ధం చేయాల్సిన టీఆర్ఎస్ నేతలు వైఎస్ రాజశేఖర్ రెడ్డినే ఎక్కువగా వాడుకుంటున్నారంటే ఇది రాజకీయ ప్రయోజనం కోసమే నంటున్నారు. వైఎస్ షర్మిలకు కూడా ఇది నష్టమేనంటున్నారు. ఆ పేరే ఉన్న పార్టీకి ఎవరు నేతలు వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డిని హైలెట్ చేస్తున్నారు.