పెదవి విరుస్తున్నారా…!!

వై.ఎస్.జగన్ పాదయాత్రలో ఎక్కువగా కలిసింది వాళ్ళనే. ఎక్కువగా తలచింది కూడా వాళ్ళనే. వై.ఎస్.జగన్ ప్రసంగం ప్రారంభంలోనూ, ముగింపులోనూ అవ్వా తాతల ప్రసక్తి లేకుండా ఉండదు. అటువంటి జగన్ [more]

Update: 2019-07-04 05:00 GMT

వై.ఎస్.జగన్ పాదయాత్రలో ఎక్కువగా కలిసింది వాళ్ళనే. ఎక్కువగా తలచింది కూడా వాళ్ళనే. వై.ఎస్.జగన్ ప్రసంగం ప్రారంభంలోనూ, ముగింపులోనూ అవ్వా తాతల ప్రసక్తి లేకుండా ఉండదు. అటువంటి జగన్ ను మనవడుగా భావించారు. ఓపిక లేకపోయినా క్యూలో, ఎండల్లో నిలబడి ఓట్లేసి జగన్ని గెలిపించారు. రాజన్న రాజ్యంలో తాము ఆనందంగా ఉంటామనుకున్నారు. రాజశేఖర్ రెడ్డి 75 రూపాయల పింఛన్ ను 200 రూపాయలు ఒక్కసారిగా చేశారు. వారూ వీరూ చూడకుండా అందరికీ ఇచ్చారు. ఇక చంద్రబాబు ఆ పించన్లను అయిదు రెట్లు పెంచుతున్నామని వేయి రూపాయలు చేశారు. జగన్ తన నవరత్నాల్లో పెన్షన్ రెండువేలు చేస్టామని హామీ ఇవ్వడంతో ఎన్నికల ముందు హడావుడిగా బాబు ఓ రెండు నెలలు రెండు వేల పెన్షన్ ఇచ్చారు. ఇక జగన్ కొత్త సీఎం అయ్యారు. పెన్షన్ మూడు వేలు అవుతుందని భావించిన వారికి తొలి ఆశాభంగం ఎదురైంది.

అది టీడీపీ తప్పుడు ప్రచారం….

నిజానికి ఈ ఏడాది జనవరి వరకూ సామాజిక పెన్షన్లు కేవలం వేయి రూపాయలు మాత్రమే ఉండేవి. వై.ఎస్.జగన్ దాన్ని రెండు వేలు అన్నాడనే బాబు ఎన్నికల కోసం పెంచారు. ఆ తరువాత వై.ఎస్.జగన్ దాన్ని మూడు వేలకు పెంచుకుంటూ పోతానని అన్నారు. అయితే ఇక్కడే టీడీపీ తప్పుడు ప్రచారం చేసింది. మూడు వేలు పెన్షన్ ఇస్తామని చెప్పిన జగన్ 2,250 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శలు మొదలెట్టింది. దాన్ని జగన్ సర్కార్ ధీటుగా తిప్పికొట్టలేకపోవడంతో పండుటాకుల్లో ఆ అసంతృప్తి అలాగే ఉండిపోయింది.

మరో రాజకీయం మొదలు…

ఇక జూలై నెల పెన్షన్లు వారం పాటు లేట్ అయ్యాయి. దానికి అధికారుల మధ్య సరైన అవగాహన లేకపోవడం వల్లనేనని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ప్రతీ నెల 1వ తేదీకి పెన్షన్ ఇవ్వడం టీడీపీ టైంలో జరిగేది. ఇపుడు వై.ఎస్.జగన్ వచ్చాక పెన్షన్లు ఒక్కసారిగా లేట్ అయ్యాయన్నది టీడీపీ మళ్ళీ చేస్తున్న ప్రచారం. ఇక్కడ ప్రభుత్వ అధికారుల తప్పు ఉన్నా వై.ఎస్.జగన్ కే నేరుగా చెడ్డపేరు వచ్చింది. తన తండ్రి జయంతి వేళ పెంచిన పెన్షన్ ఇవ్వాలని జగన్ కోరలేదని సమాచారం. అయినా అధికారులు మెప్పు కోసమే ఇలా ప్లాన్ చేశారు. ఫలితంగా పండుటాకులకు మళ్ళీ జగన్ సర్కార్ మీద కోపం వచ్చేసింది. తమను ఇబ్బంది పెట్టడం భావ్యమా అంటున్నారు. మొత్తానికి జగన్ని విమర్శించడానికి అదీ వృద్ధులను అడ్డం పెట్టుకుని టీడీపీ చేస్తున్న రాజకీయాన్ని తిప్పికొట్టకపోత వైసీపీకి చెడ్డ పేరు రావడం ఖాయమని అంటున్నారు.

Tags:    

Similar News