వైసీపీకి మ‌రో గెలుపు సిద్ధంగా ఉందా?

తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ రాజకీయం రసకందాయంలో పడింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ అధినాయకత్వం మీద ధిక్కార స్వరాన్ని [more]

Update: 2021-09-11 08:00 GMT

తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ రాజకీయం రసకందాయంలో పడింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ అధినాయకత్వం మీద ధిక్కార స్వరాన్ని వినిపించారు. ఆయన సరైన టైం లోనే ఇలా గొంతు విప్పారని అంటున్నారు. రాజకీయంగా బడా నాయకుడు కావడం వల్లనే టైం చూసి మరీ హై కమాండ్ కి చమటలు పట్టించారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి టీడీపీకి కీలకం. ఆయన ఎన్నో ఎన్నికలను చూసిన మహా యోధుడు. ఆయన చేతుల మీదుగా మూడు సార్లు రాజమండ్రి కార్పోరేషన్ లో టీడీపీ గెలిచింది. మరో సారి అక్కడ జెండా పాతాలి అంటే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సహకారం అవసరం. రాజ‌మండ్రి సిటీ నుంచి నాలుగు సార్లు.. రూర‌ల్ నుంచి మ‌రో రెండు సార్లు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలుస్తున్నారు.

ఆదిరెడ్డి వర్గంతో….?

అయితే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాత్రం టీడీపీలో ఆదిరెడ్డి అప్పారావు వర్గంతో పూర్తిగా విబేధిస్తున్నారు. మరో వైపు ఆదిరెడ్డి ఫ్యామిలీలో అప్పారావు వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా నెగ్గి సరైన టైమ్ చూసుకుని టీడీపీలోకి జంప్ చేశారు. ఇక ఆయన కోడలు, ఎర్రన్నాయుడు కూతురు అయిన భవాని రాజమండ్రీ సిటీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. కుమారుడు వాసు మొత్తం టీడీపీ రాజకీయాన్ని గుప్పిట పట్టాలని చూస్తున్నారు. ఈ క్రమంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి వృద్ధుడు కావడం, ఆయనకు వారసులు లేకపోవడంతో అసలు సమస్య ఏర్పడింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరిని పూర్తిగా పక్కన పెట్టడానికి చూస్తున్నారు అన్న ప్రచారంతో ఆయన వర్గంలో కూడా అలజడి మొదలైంది.

వచ్చే ఎన్నికల్లో గోరంట్లకు…?

దాంతో వారు కోరి మరీ ఆదిరెడ్డి వర్గంలోకి జంప్ చేయలేరు. దాంతో మాజీ కార్పోరేటర్లతో పాటు చాలా మంది కీలక నేతలు వైసీపీ వైపు చూస్తున్నారని టాక్. తమకు ఈ టైమ్ లో సరైన పార్టీ అదేనని వారు అంటున్నారు. పైగా అధికారంలో ఉన్న పార్టీ కావడంతో ఆదిరెడ్డి వర్గాన్ని గట్టిగా ఢీ కొట్టవచ్చు అని భావిస్తున్నారు. ఇక ఎంత అరచి గీ పెట్టినా కూడా వచ్చే ఎన్నికలో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి టికెట్ డౌట్ అని చెబుతున్నారు. ఆయన వారసుడిగా సోదరుడి కుమారుడికి కూడా కూడా సామాజిక స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో టిక్కెట్ వ‌స్తుందా ? రాదా ? అన్న డౌట్ ఉంది.

తొలిసారి ఎగురేయాలని?

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజకీయం ముగిసినట్లే అన్న మాట ఉంది. దాంతో ఆయనతో దశాబ్దాలుగా ఉంటూ వస్తున్న బలమైన వర్గం ఇపుడు వైసీపీ వైపుగా కదులుతోంది. త్రిస‌భ్య క‌మిటీతో బాబు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫైర్‌ను త‌గ్గించినా ఆయ‌న వ‌ర్గం మాత్రం ఆదిరెడ్డితో క‌లిసి ప‌నిచేసే ప‌రిస్థితి లేదు. టీడీపీలో ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్న వైసీపీ కూడా అవకాశాన్ని వాడుకుంటోంది. రాజమండ్రీ ఎంపీ మార్గాని భరత్ మీద జగన్ కార్పోరేషన్‌ను గెలిపించే బాధ్యతలను పెట్టారు. ఆయన ఇప్పటికే ఆపరేషన్ టీడీపీ చేపట్టారు. అనుకోకుండా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎపిసోడ్ తెర మీదకు రావడంతో వైసీపీ హుషార్ చేస్తోంది. మొత్తానికి రాజమండ్రీ కార్పోరేషన్ లో తొలిసారి వైసీపీ జెండా ఎగిరే ప‌వ‌నాలే క‌నిపిస్తున్నాయి.

Tags:    

Similar News