పగ తీర్చుకుంటున్నారే
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో జరిగిన కాపుల గర్జన ఏ ఒక్కరు మరిచిపోరు. నాటి కాపుల ఉద్యమంలో చెలరేగిన ఆందోళనకారులు తుని లో రత్నాచల్ ఎక్స్ [more]
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో జరిగిన కాపుల గర్జన ఏ ఒక్కరు మరిచిపోరు. నాటి కాపుల ఉద్యమంలో చెలరేగిన ఆందోళనకారులు తుని లో రత్నాచల్ ఎక్స్ [more]
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో జరిగిన కాపుల గర్జన ఏ ఒక్కరు మరిచిపోరు. నాటి కాపుల ఉద్యమంలో చెలరేగిన ఆందోళనకారులు తుని లో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కి తుని రూరల్ పోలీస్ స్టేషన్ కి నిప్పటించిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనమే అయ్యింది. ఈ సంఘటన వెనుక టీడీపీ నేతల హస్తం ఉందని వైసీప కాదు వైసిపి నేతలే ఇదంతా చేశారని అధికారపార్టీ ఒకరిపై మరొకరు ఆరోపించుకున్నారు. అంతేకాదు ఈ సంఘటనలపై నమోదైన కేసుల్లో వైసిపి వారిపై అనేక కేసులు బనాయించడం వారంతా జైళ్ళు కోర్టుల చుట్టూ సైతం నేటికీ తిరుగుతూనే వున్నారు. ఇప్పుడు సీన్ మారబోతుంది. అధికారంలోకి వైసిపి వచ్చింది. ఇన్నాళ్ళు తాము పడిన కష్టాలు అధికారపార్టీకి చూపించాలన్న ఉత్సహం ఆ పార్టీ లోని నాటి సంఘటనలో లేకున్నా ఉన్నట్లు చూపించిన బాధితుల్లో వ్యక్తం అవుతుంది.
పాత కేసులు పోయి…
తుని సంఘటనలపై ఇప్పుడు ప్రభుత్వ చీఫ్ విప్ దాడిశెట్టి రాజా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్ట్టించాయి. నాటి పాత కేసులు తొలగిస్తామని కొత్తగా విచారణ జరిపి అసలు దోషులను శిక్షిస్తామని రాజా ప్రకటించారు. అక్కడితో ఆయన ఆగలేదు. ఈ దుస్సంఘటనల వెనుక అసలు సూత్రధారులు మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమ లు వున్నారని ఆరోపించారు దాడిశెట్టి. దాంతో తుని తగవు ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు.
కేసుల్లో సర్కారీ మార్క్….
అప్పుడు టిడిపి తుని సంఘటనకు రాజకీయ రంగు పులమడం, వైసిపి సైతం పగ ప్రతీకారానికే పరిమితం అయ్యేలా అప్పటి కేసులు తొలగించి కొత్త విచారణ అని పేర్కొనడం గమనిస్తే ఏ పార్టీ అధికారంలో ఉంటే వారు తమ ప్రత్యర్థులను వేధించి తీరుతారని ధోరణి లో సాగుతుంది. ఇప్పటికే పోలీస్ వ్యవస్థ పై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతున్న తరుణంలో అధికారంలో వున్న వారు ఇదే ధోరణి కొనసాగిస్తే అసలైన నేరస్థులు తప్పించుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి అంటున్నారు న్యాయ నిపుణులు. క్రిమినల్ కేసుల్లో సైతం సర్కారీ మార్క్ ఉంటే ఇక దేవుడు కూడా న్యాయం చేయలేడని అంటున్నారు. వైసిపి సర్కార్ తుని సంఘటనలపై సిట్టింగ్ జడ్జ్ చేత విచారణ జరిపించి చర్యలు చేపడితే విశ్వసనీయత పెరుగుతుందని అంతేకానీ కక్ష సాధింపులకు దిగితే టిడిపి – వైసిపి లు దొందు దొందే అంటున్నారు విశ్లేషకులు.