ఫ్యాక్ట్ చెక్: చంద్రబాబు నాయుడు అరెస్టును వ్యతిరేకిస్తూ I.N.D.I.A కూటమి ఎలాంటి ప్రకటన చేయలేదు
చంద్రబాబు నాయుడు అరెస్టును వ్యతిరేకిస్తూ I.N.D.I.A కూటమి ఎలాంటి ప్రకటన చేయలేదు
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ప్రమేయం ఉండడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును నంద్యాలలో సెప్టెంబరు 9, 2023 తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టు తర్వాత పలువురు టీడీపీ నేతలను గృహనిర్బంధంలో ఉంచారు.
ఈ అరెస్టును దేశవ్యాప్తంగా పలువురు నేతలు ఖండించారు.
@2024_FOR_INDIA అనే ట్విట్టర్ ఖాతా ద్వారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండించారు. పలు సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండించారు. ఆంధ్రప్రదేశ్ లోని బీజేపీ నేతలు కూడా రాష్ట్ర పోలీసుల చర్యలను ఖండించారు.
ఈ ట్వీట్ బయటకు వచ్చిన తర్వాత, కొన్ని ప్లాట్‌ఫారమ్‌లు I.N.D.I.A కూటమి, బీజేపీ కూడా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండించాయని వార్తలను పంచుకున్నాయి.
“DEMOCRACY is backsliding We stand with Chandrababu Naidu When dictatorship is a fact, revolution will become a right. It's just a matter of time! #WeWillStandWithCBNSir #ChandrababuNaidu #StopIllegalArrestOfCBN” (WHAT IS THIS?) అంటూ I.N.D.I.A కూటమిని పోలిన ఎక్స్ ఖాతా నుండి పోస్టులు వచ్చాయి.
ఈ ట్వీట్ మాత్రమే కాదు, ఈ ఖాతాలో చంద్రబాబు నాయుడు అరెస్ట్, టీడీపీ నేతల నిరసనల గురించి వీడియోలు, పోస్ట్‌లను వరుసగా పోస్ట్ చేయడం చూడవచ్చు.
ఆర్కైవ్ లింకు.
Andhra Friends.com ద్వారా “చంద్రబాబు arrest ని ఖండించిన ఏపీ బీజేపీ , I.N.D.I.A అలియన్స్” అనే పోస్టులను మనం గమనించవచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. I.N.D.I.A కూటమి చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండించలేదు.
ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (I.N.D.I.A).. భారత జాతీయ కాంగ్రెస్ నేతృత్వంలోని భారతదేశంలోని 26 రాజకీయ పార్టీల మెగా రాజకీయ కూటమి. ఈ కూటమి జూలై 18, 2023న ఏర్పడింది.
క్షుణ్ణంగా శోధించిన తర్వాత మేము I.N.D.I.A రాజకీయ కూటమి పేరుతో ఎలాంటి అధికారిక సోషల్ మీడియా ఖాతాలు లేదా వెబ్‌సైట్‌ను కనుగొనలేకపోయాము.
@2024_For_INDIA అనే అకౌంట్ ను నిశితంగా పరిశీలించగా.. ఆ బయోలో అకౌంట్ ను ఏప్రిల్ 2010లో అకౌంట్ ను క్రియేట్ చేశారని తెలిపారు. I.N.D.I.A రాజకీయ కూటమి జులై 2023లో ఏర్పడింది. ఈ అకౌంట్ కు కేవలం 3,414 ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు.
మేము social-searcher.com, సోషల్ మీడియా ప్రొఫైల్ సెర్చింగ్ వెబ్‌సైట్‌ని ఉపయోగించి ఖాతా మరిన్ని వివరాల కోసం సెర్చ్ చేయగా, మేము ఖాతా ట్వీట్‌లలో కొన్ని వ్యత్యాసాలను కనుగొన్నాము. పాత ట్వీట్లలో ఖాతా పేరు sandeep2009గా ఉందని గుర్తించాం.
మే 2014లో అదే ఖాతా ద్వారా ప్రచురించిన ఒక ట్వీట్‌కి వినియోగదారు ప్రతిస్పందించారు. ఆ హ్యాండిల్‌ని @Sandeep2009గా స్పష్టంగా చూడవచ్చు.
అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ చూడొచ్చు

మేము ట్విట్టర్ హ్యాండిల్ @Sandeep2009 యొక్క కార్యకలాపాల కోసం వెతికాం.. ఇప్పుడు ఆ అకౌంట్ పేరును @2024_For_India గా మార్చుకున్నారని స్పష్టమైంది.
@2024_FOR_INDIA అనే ట్విట్టర్ అకౌంట్.. దేశంలోని 26 పార్టీలు ఏర్పాటు చేసిన I.N.D.I.A కూటమికి చెందినది కాదు. ఇది I.N.D.I.A కూటమిని అనుకరిస్తూ అనేక ప్రాంతీయ, జాతీయ వార్తలను ట్వీట్ చేసే ఖాతా. అంతకుముందు అకౌంట్ పేరు @Sandeep2009 అని ఉండగా @2024_FOR_INDIA మార్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను ఖండిస్తూ వైరల్ అవుతున్న ట్వీట్ I.N.D.I.A కూటమికి సంబంధించినది కాదు. వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను ఖండిస్తూ వైరల్ అవుతున్న ట్వీట్ I.N.D.I.A కూటమికి సంబంధించినది కాదు. వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
Claim : I.N.D.I.A కూటమి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను ఖండించింది
Claimed By : Twitter User
Fact Check : False